- Home
- Entertainment
- అమర్ దీప్-సురేఖావాణి మధ్య అలాంటి రిలేషన్... అందుకే కూతురు సుప్రీతకు ఆఫర్, కీలక విషయాలు వెలుగులోకి!
అమర్ దీప్-సురేఖావాణి మధ్య అలాంటి రిలేషన్... అందుకే కూతురు సుప్రీతకు ఆఫర్, కీలక విషయాలు వెలుగులోకి!
బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి హీరోగా ఇటీవల ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ మూవీలో సుప్రీత హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. కాగా అమర్ దీప్-సురేఖావాణి మధ్య రిలేషన్ ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Amar Deep Chowdary
బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ చేశారు. ఈ చిత్రంలో అమర్ దీప్ కి జంటగా సుప్రీత నటిస్తుంది. సురేఖావాణి కూతురైన సుప్రీతకు ఇది డెబ్యూ మూవీ.
Surekhavani
సురేఖావాణి కొన్నాళ్లుగా కూతురిని హీరోయిన్ గా పరిచయం చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. అమర్ దీప్ సినిమాతో ఆ కోరిక తీరింది. అమర్ దీప్ తన సినిమాలో సుప్రీతకు ఛాన్స్ ఇవ్వడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయట. ముఖ్యంగా సురేఖావాణితో అమర్ దీప్ కి రిలేషన్ ఉందని సమాచారం.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
తాజాగా అమర్ దీప్-సుప్రీత దావత్ అనే టాక్ షోకి వచ్చారు. జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి హోస్ట్ గా ఉన్న ఈ షోలో ఈ యంగ్ జోడి సందడి చేశారు. ఈ సందర్భంగా అమర్ దీప్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నటి సురేఖావాణితో తనకున్న బంధం బయటపెట్టాడు.
Amar Deep Chowdary
అమర్ దీప్ కి సురేఖావాణి బంధువులు అవుతారట. ఆమె వరసకు అక్క అవుతుందట. ఇక సుప్రీతకు నేను మేనమామ అవుతానని అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. దాంతో హోస్ట్ రీతూ చౌదరి.... అమర్ దీప్ ని మామయ్య అని పిలవాలని సుప్రీతకు చెప్పింది. మామయ్యా... అంటూ సో క్యూట్ గా పిలిచింది సుప్రీత. అమర్ సిగ్గుపడిపోయాడు.
Amar Deep
అలాగే తన సినిమాలో సుప్రీతను హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ఏమిటో చెప్పాడు అమర్ దీప్. ఆ పాత్రకు సుప్రీత బాగా సెట్ అవుతుంది. అందుకే ఎంపిక చేశామని అమర్ దీప్ అన్నాడు. ఇక ఈ సినిమా వలన తన కాలేజీ డేస్ గుర్తుకు వస్తున్నాయని వెల్లడించాడు.
సుప్రీత-అమర్ దీప్ ల మూవీ చిత్రీకరణ దశలో ఉంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ ఏడాది థియేటర్స్ లోకి రానుంది. ఒకప్పటి సీరియల్ హీరో అమర్ దీప్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి..