తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్.. హౌజ్‌ని వీడే మరో కంటెస్టెంట్ ఇతనే
తొమ్మిదో వారం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఇప్పటికే రాము ఎలిమినేట్ కాగా, ఇప్పుడు మరో ఎలిమినేషన్ ఉంది. ఈ కంటెస్టెంట్ ఆదివారం హౌజ్‌ని వీడబోతున్నాడు.

తొమ్మిదో వారం రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం ఇప్పటికే రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడు. సెల్ఫ్ గా ఆయన ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ గుర్తుకొస్తుందని, అమ్మ గుర్తుకొస్తుందని తెలిపారు. నిద్ర పట్టడం లేదన్నాడు. చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. ఏకంగా పాట పాడి తన బాధని బయటపెట్టాడు. తమది పెద్ద ఫ్యామిలీ అని, చాలా గజిబిజీగా ఉంటుందని, తాను లేకపోతే ఎలా ఉందో అనే టెన్షన్‌గా ఉందని, భయమనిస్తుందని చెప్పాడు. ఇంట్లో ఏడెనిమిది మంది పిల్లలుంటారు వాళ్లు గుర్తుకొస్తున్నారని, ఇక్కడ ఉండలేకపోతున్నా అని చెప్పాడు రాము.
నాగార్జున చెప్పినా వినని రాము
నాగార్జున ఎన్నిసార్లు అడిగినా వెళ్లిపోతా అన్నాడు. హౌజ్‌మేట్స్ రిక్వెస్ట్ చేసినా వినలేదు. ఎట్టకేలకు సెల్ఫ్ గా ఎలిమినేట్ అయ్యాడు. శనివారం ఎపిసోడ్‌లోనే ఆయన హౌజ్‌ని వీడాడు. ఇప్పుడు తాను హ్యాపీ అవుతానని తెలిపారు. అదే సమయంలో తాను ఎలిమినేట్ అయినందుకు ఆటుహౌజ్ మేట్స్ కి, ఆడియెన్స్ కి సారీ చెప్పాడు రాము రాథోడ్. ఆయన కోసం హౌజ్ అంతా విచారం వ్యక్తం చేశారు.
తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్
ఇదిలా ఉంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. ఇప్పటికే రాము రాథోడ్ ఎలిమినేట్ కాగా, ఇప్పుడు మరో ఎలిమినేషన్ ఉందట. ఓటింగ్ ప్రకారం రాము రాథోడ్ తర్వాత లీస్ట్ లో ఉన్నది శ్రీనివాస సాయి. ఈ వారం ఆయన కూడా హౌజ్‌ని వీడినట్టు సమాచారం. రెగ్యూలర్ ఎలిమినేషన్‌లో భాగంగా శ్రీనివాస సాయిని ఎలిమినేట్ చేశారట నాగార్జున. ఇలా తొమ్మిదో వారం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో మొదటిసారి డబుల్ ఎలిమినేషన్ జరిగిందని చెప్పొచ్చు. ఇకపై ఈ డబుల్ ఎలిమినేషన్ స్టార్ట్ కానుందని సమాచారం.
ఇప్పటి వరకు ఎలిమినేట్ అయ్యింది వీరే
ఇక సెప్టెంబర్ 7న స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు 9 ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంటుంది. 15 మంది కంటెస్టెంట్లతో షో స్టార్ట్ కాగా, శ్రష్టి వర్మ, ప్రియా, ఫ్లోరా, హరిత హరీష్, మర్యాద మనీష్, భరణి, రమ్య మోక్ష, దివ్వెల మాధురి, శ్రీజ ఇప్పటి వరకు ఎలిమినేట్ అయ్యారు. ఆయేషా జీనత్ అనారోగ్యంతో హౌజ్‌ని వీడింది. ఇప్పుడు రాము కూడా సెల్ఫ్ గా ఎలిమినేట్ అయ్యారు. అయితే వీరిలో భరణిని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చారు. అయినా ఆయన ఆటతీరు మారలేదు. త్వరలో మళ్లీ ఆయన ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదు.
ప్రస్తుతం హౌజ్‌లో ఉన్నది వీరే
ఈ సీజన్ పూర్తి కావడానికి మరో ఆరు వారాలు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు హౌజ్‌లో సంజనా, రీతూ చౌదరీ, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, కళ్యాణ్, నిఖిల్, దివ్య, గౌరవ్, శ్రీనివాస సాయి, భరణి ఉన్నారు. వీరిలో శ్రీనివాస సాయి ఈ ఆదివారం హౌజ్‌ని వీడబోతున్నారట. ఇక పది మంది మాత్రమే ఉంటారు. వీరిలో టాప్ 5కి వెళ్లేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.