MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్ లో జడివానకి, బడబాగ్నికి దోస్తీ..లవ్ బర్డ్స్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, ట్విస్టులే ట్విస్టులు

బిగ్ బాస్ హౌస్ లో జడివానకి, బడబాగ్నికి దోస్తీ..లవ్ బర్డ్స్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, ట్విస్టులే ట్విస్టులు

బిగ్ బాస్ సీజన్ 6 లో 30 వ ఎపిసోడ్ ఊహించని ట్విస్ట్ లతో సాగింది. ఈ వారం నామినేషన్ ప్రకియ మొత్తం రసవత్తరంగా సాగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కోసారి బిగ్ బాస్ ఇద్దరిని పిలుస్తారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 03 2022, 11:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ సీజన్ 6 లో 30 వ ఎపిసోడ్ ఊహించని ట్విస్ట్ లతో సాగింది. ఈ వారం నామినేషన్ ప్రకియ మొత్తం రసవత్తరంగా సాగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కోసారి బిగ్ బాస్ ఇద్దరిని పిలుస్తారు. వారిద్దరిలో ఎవరు నామినేట్ కావాలో.. ఎవరు సేవ్ కావాలో వాళ్లే తేల్చుకోవాలి అని బిగ్ బాస్ తెలిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఊహించని ట్విస్ట్ ఏంటంటే ఈ వారం నుంచి రోహిత్ మెరీనా జంటగా ఆడడం లేదని.. ఇక నుంచి వారిద్దరూ విడివిడిగా గేమ్ ఆడాలని బిగ్ బాస్ చెప్పడంతో హౌస్ మొత్తం షాక్ అయింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా బిగ్ బాస్ మెరీనా, రోహిత్ లనే పిలిచారు. ఇద్దరి చేతికి కెప్టెన్ కీర్తి బేడీలు వేస్తుంది. ఇద్దరి వారి అభిప్రాయం చెప్పిన తర్వాత.. మెరీనా రోహిత్ కోసం త్యాగం చేస్తూ నామినేట్ అయింది. దీనితో రోహిత్ సేవ్ అయ్యాడు. 

36

అనంతరం ఇనయా, శ్రీహన్ లని బిగ్ బాస్ పిలిచారు. హౌస్ లో నేను ఉండాలి అంటే నేనే ఉండాలి అంటూ ఇద్దరూ వాగ్వాదం చేసుకున్నారు. చివరకి శ్రీహన్ మాటలకు ఇనయా కోపగించుకుంది. నువ్వు నాకు ఫ్రెండ్ ఏంటి అంటూ ఫైర్ అయింది. నేనే నామినేట్ అవుతా. ఆడి బిగ్ బాస్ టైటిల్ గెలిచి చూపిస్తా అంటూ శపథం చేసింది. దీనితో ఇనయ నామినేట్ ఐంది. 

46

సుదీప, వాసంతి ఇద్దరూ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనగా వాసంతి నామినేట్ అయింది. వాసంతి ఎమోషనల్ కావడంతో సుదీప ఆమెని ఓదార్చింది. అనంతరం గీతూ వసంతితో మాట్లాడుతూ నువ్వెందుకు స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పలేదు.. ఆమె స్ట్రెస్ లో ఉంటే ఆడలేను అని చెప్పింది. సో ఆమె హౌస్ లో ఉండేందుకు అర్హురాలు కాదు. ఈ పాయింట్ చెప్పి ఉండాల్సింది నువ్వు అని వాసంతితో గీతూ సీక్రెట్ గా మాట్లాడింది. 

56

శ్రీసత్య, అర్జున్ లని బిగ్ బాస్ పిలిచారు. వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ ఉన్నాయి. వారిద్దరూ రాగానే హౌస్ మేట్స్ గోల గోల చేసారు. సూర్య అయితే.. జడివానకి, బడబాగ్నికి దోస్తీ అంటూ ఆర్ఆర్ఆర్ సాంగ్ పాడాడు. ఈ నామినేషన్ ప్రక్రియతో ఈ లవ్ బర్డ్స్ మధ్య చిచ్చు మొదలవుతుంది అని అనుకున్నారు. కానీ శ్రీసత్య, అర్జున్ ఇద్దరూ స్మూత్ గా హ్యాండిల్ చేసుకున్నారు. చివరకి అర్జున్ తానే నామినేట్ అవుతున్నట్లు ప్రకటించుకున్నాడు. 

66

ఆది రెడ్డి, రేవంత్ మధ్య హీట్ అండ్ ఎమోషనల్ చర్చ జరిగింది. చివరకి నేనే ఫైట్ చేస్తా అంటూ ఆదిరెడ్డి నామినేషన్ తీసుకున్నాడు. సూర్య కోసం ఫైమా త్యాగం చేస్తూ నామినేషన్స్ లోకి వెళ్ళింది. మొత్తంగా ఈ వారం మెరీనా, ఇనయా, వాసంతి, అర్జున్, ఆది రెడ్డి, ఫైమా, ఆదిత్య, చంటి నామినేట్ అయ్యారు. చివర్లో రేవంత్, ఫైమా బయట విషయాలు మాట్లాడుతున్నందుకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. కెప్టెన్ గా కీర్తి యాక్షన్ తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెతో రేవంత్ కి పెద్ద గొడవే జరిగింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Prasad Remuneration: రామ్‌ ప్రసాద్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే పారితోషికం.. బుల్లితెర స్టార్‌కి ఝలక్‌
Recommended image2
Malaika Arora Skincare: 52 ఏళ్ల వయసులో మెరిసిపోతున్న మలైకా.. ఆమె నైట్ స్కిన్‌కేర్ సీక్రెట్ ఇదే!
Recommended image3
Reality Show: బిగ్ బాస్ ని మించిన వింత, కాంట్రవర్షియల్ రియాలిటీ షోలు.. ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved