- Home
- Entertainment
- పెళ్లి పీఠలెక్కబోతున్న బిగ్ బాస్ 6 బ్యూటీ.. కాబోయే భర్త వివరాలు వెల్లడించిన నేహా చౌదరి
పెళ్లి పీఠలెక్కబోతున్న బిగ్ బాస్ 6 బ్యూటీ.. కాబోయే భర్త వివరాలు వెల్లడించిన నేహా చౌదరి
బిగ్ బాస్ 6 తెలుగు కంటెస్టెంట్ నేహా చౌదరి గుడ్ న్యూస్ చెప్పింది. తాను త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతుంది. తాజాగా తనకు కాబోయే భర్త వివరాలు వెల్లడించి సర్‌ప్రైజ్ చేసిందీ పొడుగు కాళ్ల సుందరి.

`బిగ్ బాస్ 6 తెలుగు` (Bigg Boss 6 Telugu) కంటెస్టెంట్ నేహా చౌదరి(Neha Chowdary) పెళ్లిపీఠలెక్కబోతుంది. త్వరలోనే ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతుంది. తాజాగా తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ఆయన వివరాలను స్వయంగా వెల్లడించడం విశేషం. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చింది నేహా చౌదరి, రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో ఆమె జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గానూ నిలిచారు. ఆ తర్వాత యాంకర్‌గా టర్న్ తీసుకుంది.
ఎంటర్‌టైన్‌మెంట్స్ రంగలపై ఆసక్తితో యాంకరింగ్‌గా మారింది. పలు ఎంటర్‌టైన్‌మెంట్ షోలకు యాంకర్‌గా చేసింది. దీంతోపాటు స్పోర్ట్స్ యాంకర్ కొనసాగుతుంది. టీ 20, ఐపీఎల్ వంటి క్రికెట్ మ్యాచ్‌లకు ఆమె యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ యాంకర్‌గా ఆమె బాగా పాపులర్ అయ్యారు. ఈ గుర్తింపుతోనే ఆమెకి బిగ్ బాస్ 6 తెలుగులోకి అవకాశం వచ్చిందని టాక్.
బిగ్ బాస్ తెలుగు 6 షోలో కొన్ని రోజులు సందడి చేసింది. `పెళ్లి` అనే కండీషన్‌తోనే బిగ్ బాస్‌లోకి వచ్చిందట. షోకి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటానని మాటిచ్చానని తెలిపింది. అన్నట్టుగానే త్వరగానే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకొచ్చింది. మూడో వారంలోనే ఆమె ఎలిమినేట్ అయ్యింది. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించింది.
ఈ సందర్భంగా తనకు కాబోయే భర్త వివరాలను కూడా స్వయంగా పంచుకుంది నేహా చౌదరి. తాను మ్యారేజ్ చేసుకోబోతున్నాననే పుకార్లు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఫ్రెండ్స్ అంతా ప్రశ్నిస్తున్నారట. ఒక్కొక్కరికి ఏం చెబుతామని చెప్పి అందరికి ఒకేసారి చెప్పాలనుకుందట. అలా తన ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలిపించుకుని అసలు విషయాన్ని రివీల్ చేసింది. తాను ఎస్ చెప్పానని తెలిపింది. చేసుకోబోయే వ్యక్తి జర్మనీలో సెటిల్డ్ అయ్యాడని వెల్లడించింది.
తనకు బిటెక్ క్లాస్ మేట్ అని, 13ఏళ్లుగా తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని, కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారట. అలా తాను అతనికి ఎస్ చెప్పానని తెలిపింది. ఆయన పేరు అనిల్ అని, జర్మనీలో సెటిల్డ్ అయ్యాడని, పెళ్లి మాత్రం ఇండియాలోనే చేసుకుంటామని, తాను కమిట్ అయిన ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకుని ఏడాది తర్వాత తాను కూడా జర్మనీ వెళ్లిపోతానని పేర్కొంది. వీడియో కాల్ ద్వారా తనకు కాబోయే వాడిని ఫ్రెండ్స్ కి పరిచయం చేసింది నేహా చౌదరి.
ఈ సందర్బంగా `నా పెళ్లి గోల మొదలైంది` అనే వీడియోని షేర్ చేసింది. ఇందులో అన్ని విషయాలను పంచుకుంది. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే పెళ్లి ఎప్పుడనేది మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం డేట్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, అతి త్వరలోనే మ్యారేజ్ ఉంటుందని మాత్రం చెప్పింది నేహా చౌదరి.