MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రియా కోసం హమీద బలి.. భరించలేం అంటూ షణ్ముఖ్ కామెంట్, కావాలనే ఆమెని లేపుతున్నారా..

ప్రియా కోసం హమీద బలి.. భరించలేం అంటూ షణ్ముఖ్ కామెంట్, కావాలనే ఆమెని లేపుతున్నారా..

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5లో గురువారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ ఇచ్చిన రాజ్యానికి ఒక్కరే రాజు అనే టాస్క్ లో భాగంగా ఇరు రాజ్యాల సభ్యులు వ్యూహాలతో నిమగ్నమవుతారు.

2 Min read
Author : pratap reddy
Published : Oct 07 2021, 11:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5లో గురువారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ ఇచ్చిన రాజ్యానికి ఒక్కరే రాజు అనే టాస్క్ లో భాగంగా ఇరు రాజ్యాల సభ్యులు వ్యూహాలతో నిమగ్నమవుతారు. ఇప్పటికీ టాస్క్ ముగిసిందని, కొంత సమయం తర్వాత నాణేల లెక్కింపు ఉంటుందని బిగ్ బాస్ ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా ప్రియాంక బర్త్ డే సందర్భంగా ఆమెకు బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇస్తాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆమె తల్లిదండ్రుల వీడియో బైట్ ప్లే చేస్తారు. మాకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అన్నీ నువ్వే అని చెప్పడంతో ప్రియాంక కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. తన తల్లిదండ్రులని చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేశారు. అదే నాకు పెద్ద బర్త్ డే గిఫ్ట్ అంటూ ప్రియాంక సంతోషపడుతూనే భావోద్వేగం ఆపుకోలేకపోతుంది. 

35

ఇక ఇంటి సభ్యులు ప్రియాంక బర్త్ డే సెలెబ్రేట్ చేస్తారు. ఇరు రాజ్యాల రాజులు, ప్రజల వద్ద ఉన్న కాయిన్స్ ని లెక్కించిన తర్వాత బిగ్ బాస్ తమ రాజుని ఎంచుకునే అవకాశాన్ని ప్రజలకే వదిలేస్తారు. దీనితో రవికి 7 మంది ప్రజల మద్దతు, సన్నీకి 6 మంది మద్దతు లభిస్తుంది. దీంతో రవి రాజ్యానికి రాజుగా అవతరిస్తాడు. రవికి రాజుగా ఇంటి సభ్యులు పట్టాభిషేకం చేస్తారు. కాయిన్స్ మొత్తాన్ని రవి తన రాజ్యంలోని సభ్యులకు పంచే అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్తారు. 

45

దీనితో రవి.. అనీ మాస్టర్, హమీద, శ్వేతాలని ఎంచుకుంటాడు. అంటే వీరు రవితో పాటు కెప్టెన్సీ పోటీకి అర్హులు. ఇంతలో బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇస్తారు. ప్రియని శాశ్వతంగా కెప్టెన్సీ పొతే నుంచి ప్రారంభంలో తప్పించిన సంగతి తెలిసిందే. తిరిగి ఆమె కెప్టెన్సీ పోటీలోనిలిచే ఛాన్స్ బిగ్ బాస్ ఆమెకి ఇస్తారు. కాకపోతే రవి, అని మాస్టర్, శ్వేతా, హమీద లలో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. దీనితో హమీద..ప్రియా కోసం త్యాగం చేస్తుంది. అంతకు ముందు షణ్ముఖ్.. సీక్రెట్ గా కొంతమంది ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. హమీద మాత్రం కెప్టెన్ ఆ వద్దురా బాబు.. భరించలేం అని కామెంట్ చేస్తాడు. ఒక రకంగా ప్రియా కోసం హమీద బలైనట్లు అయింది. బిగ్ బాస్ ఇచ్చిన ఈ ట్విస్ట్ చూస్తే కావాలనే ప్రియని హైలైట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు అనుమానం కలగక మానదు. 

55

చివరకు రవి, ప్రియా, శ్వేతా, అనీ మాస్టర్ కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు. వీరు నలుగురికి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇస్తారు. గార్డెన్ ఏరియాలో నాలుగు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్స్ కి హొల్స్ కూడా ఉంటాయి. బజర్ మోగగానే సంచాలకుడిగా ఉన్న షణ్ముఖ్ అన్ని ట్యాంక్ లలో హొల్స్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తుంటాడు. నీళ్లు కింద పోకుండా కెప్టెన్సీ పోటీదారులు వేళ్ళతో ఆ హొల్స్ మూయాలి. ఇతర సభ్యులు తమకు ఇష్టమైన వారికి సాయం చేయొచ్చు. అలా టాస్క్ ముగిసే సమయానికి ఎవరి ట్యాంక్ లో ఎక్కువ వాటర్ ఉంటే వారే విజేత. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. విజేత ఎవరనేది రేపటి ఎపిసోడ్ లో తేలనుంది. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Recommended image2
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image3
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved