MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లిప్ కిస్ పెట్టాలనుకున్నా.. కెప్టెన్ అయ్యాక అనీ మాస్టర్ తో సన్నీ, రవి ఆశలు గల్లంతు

లిప్ కిస్ పెట్టాలనుకున్నా.. కెప్టెన్ అయ్యాక అనీ మాస్టర్ తో సన్నీ, రవి ఆశలు గల్లంతు

Bigg Boss 5 Telugu నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అక్టోబర్ 22 ఎపిసోడ్ ' స్మైల్ చేయండి.. స్టార్ట్ చేయండి' టాస్క్ తో మొదలవుతుంది. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులంతా తమ లైఫ్ లో జరిగిన సంగతులని షేర్ చేసుకోవాలి.

2 Min read
Author : pratap reddy
| Updated : Oct 22 2021, 11:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Bigg Boss 5 Telugu నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అక్టోబర్ 22 ఎపిసోడ్ ' స్మైల్ చేయండి.. స్టార్ట్ చేయండి' టాస్క్ తో మొదలవుతుంది. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులంతా తమ లైఫ్ లో జరిగిన సంగతులని షేర్ చేసుకోవాలి. సన్నీ తాను నటుడిగా ఓ దర్శకుడి నుంచి ఎలా ప్రేరణ పొందాడో వివరిస్తాడు. ఇక షణ్ముఖ్ మాట్లాడుతూ నటనని కెరీర్ గా ఎంచుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతాడు. చివరకు సూసైడ్ కూడా చేసుకోవాలనే ఆలోచన వచ్చినట్లు షణ్ముఖ్ తెలిపాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సిరి మాట్లాడుతూ తనకు ఓ పెళ్లి ఫిక్సైంది.ఫిక్స్ అయ్యాక ఆగిపోయిది. ఆ తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడు. చుట్టాలంతా తల్లి పద్దతిగా ఉంటె కదా కూతురు ఉండడానికి అని కామెంట్స్ చేశారు. వారందరికీ చెబుతున్నా నేనిప్పుడు ఈ స్టేజిలో ఉన్నా అంటూ సిరి తెలిపింది. ఇక జెస్సి తాను మోడలింగ్ లో ఎగతాళి చేసిన వారి ముందే గెలిచి చూపించానని అంటాడు. ఈ టాస్క్ లో జెస్సి విజేతగా నిలుస్తాడు. 

36

కోడి గుడ్ల టాస్క్ లో జరిగిన గొడవతో సన్నీ, ప్రియా శత్రువులుగా మారిన సంగతి తెలిసిందే. ఇతర హౌస్ మేట్స్ తో ప్రియా.. సన్నీ గురించి ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఈసారి సన్నీ కనిపిస్తే కన్నుకొట్టి.. ఫ్లైయింగ్ కిస్ ఇస్తా అంటూ కామెంట్స్ చేస్తుంది. ఇంతలో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రకటిస్తారు. రవి, మానస్, కాజల్, విశ్వ , సన్నీ కెప్టెన్సీ టాస్క్ లో పోటీ దారులుగా ఉంటారు. టాస్క్ ప్రకారం పోటీ దారులంతా బిగ్ బాస్ ఇచ్చిన బెలూన్స్ నడుముకి కట్టుకోవాలి. బజార్ మోగిన ప్రతిసారి గార్డెన్ ఏరియాలో ఓ గుండు సూది ఉంచుతారు. ఆ సూదిని దక్కించుకున్నవారు తమకు ఇష్టమైన కెప్టెన్సీ పోటీ దారునికి ఇవ్వవచ్చు. 

46

సూది అందుకున్న కెప్టెన్సీ పోటీ దారుడు.. ఇతర పోటీ దారులలో ఎవరిదైనా బెలూన్ ని పగల గొట్టవచ్చు. బెలూన్ పగిలిన వారు కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకోవాలి. చివరకు ఎవరి బెలూన్ పగల కుండా ఉంటుందో వారే హౌస్ కెప్టెన్ అని బిగ్ బాస్ ప్రకటిస్తారు. మొదట జెస్సి సూది అందుకుంటాడు. దీనితో జెస్సి సూదిని కాజల్ కి ఇస్తాడు. కాజల్..విశ్వ బెలూన్ పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. రెండు సార్లు కెప్టెన్ అయ్యావు.. మిగిలిన వారికి కూడా ఛాన్స్ కావాలి కదా అని కాజల్ అంటుంది. దీనితో విశ్వ ఆగ్రహానికి గురవుతాడు. కాజల్ నుంచి తప్పించుకునే క్రమంలో విశ్వ బెలూన్ పగిలిపోతుంది. 

56

ఆ తర్వాత కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకున్న విశ్వకు సూది దక్కుతుంది. దీనితో విశ్వ ఆ సూదిని రవికి ఇస్తాడు. సూది దక్కించుకునే క్రమంలో విశ్వ, ప్రియాంకకు గొడవ జరుగుతుంది. తన చేతికి వచ్చిన సూదితో రవి.. మానస్ బెలూన్ ని పగలగొడుతాడు. మరోసారి కూడా రవి చేతికే సూది వస్తుంది. లోబో సూదిని తీసుకువచ్చి రవికి ఇస్తాడు. ఈసారి రవి.. కాజల్ బెలూన్ పగలగొడుతాడు. ఇక ఇక పోటీలో రవి, సన్నీ మాత్రమే ఉంటారు. ఈసారి అనీ మాస్టర్ సూది దక్కించుకుంటుంది. సూదిని అనీ మాస్టర్ సన్నీకి ఇస్తుంది. దీనితో సన్నీ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. రవి బెలూన్ పగలగొట్టి హౌస్ కి కొత్త కెప్టెన్ గా అవతరిస్తాడు సన్నీ. రవి ఆశలు గల్లంతయ్యాయి. 

66

తన కోసం సూది తీసుకువచ్చిన అనీ మాస్టర్ పై సన్నీకి ఇష్టం పెరిగిపోతుంది. కెప్టెన్ అయ్యాక సంతోషంతో సన్నీ అనీ మాస్టర్ కి గట్టి ముద్దు ఇస్తాడు. కొంత సమయం తర్వాత అసలు మీకు నేను ఇంగ్లీష్ ముద్దు(లిప్ కిస్) ఇవ్వాలనుకున్నా. ఇక్కడ సెన్సార్ ఒప్పుకోదని ఆగిపోయి అని చిలిపిగా అంటాడు. దీనితో అనీ మాస్టర్ కూడా సన్నీ వైపు చిలిపి కోపంతో చూస్తుంది. ఆ తర్వాత సన్నీ.. ప్రియకి కూడా దగ్గరవుతాడు. మీరు ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే డైజిస్ట్ కావడం లేదు నాకు అని సరదాగా అంటుంది. కెప్టెన్సీ ఛాన్స్ పోయిన బాధలో ఉన్న కాజల్ తో రవి మాట్లాడుతుండగా నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: మా సినిమా బాగలేక కాదు, రాంచరణ్ వల్లే ఫ్లాప్.. నా భార్య కూడా తిట్టేసింది, డైరెక్టర్ కామెంట్స్
Recommended image2
ANR: అక్కినేనిది నాగుపాము పగ, ఆ హీరోపై ప్రతీకారం.. ఏఎన్నార్‌ నిజస్వరూపం బయటపెట్టిన రైటర్‌
Recommended image3
Rakul Preet Singh: ఐటీ దాడుల విషయంలో నోరు విప్పిన రకుల్ ప్రీత్ సింగ్, ఇచ్చిపడేసిందిగా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved