- Home
- Entertainment
- 'ది కేరళ స్టోరీ'కి బిగ్ షాక్.. 10 సన్నివేశాలు తొలగించిన సెన్సార్ బోర్డు, మాజీ సీఎం ఇంటర్వ్యూ కూడా..
'ది కేరళ స్టోరీ'కి బిగ్ షాక్.. 10 సన్నివేశాలు తొలగించిన సెన్సార్ బోర్డు, మాజీ సీఎం ఇంటర్వ్యూ కూడా..
హార్ట్ ఎటాక్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ ఆ తర్వాత పెద్దగా సందడి చేయలేదు. కానీ ఇప్పుడు ఆమె నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారిన చిత్రంలో భాగమైంది. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన 'ది కేరళ స్టోరీ' చిత్రం రాజకీయంగా సంచలనంగా మారింది.

హార్ట్ ఎటాక్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ ఆ తర్వాత పెద్దగా సందడి చేయలేదు. కానీ ఇప్పుడు ఆమె నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారిన చిత్రంలో భాగమైంది. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన 'ది కేరళ స్టోరీ' చిత్రం రాజకీయంగా సంచలనంగా మారింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రాపగాండ మూవీ అంటూ అభివర్ణించిన సంగతి తెలిసిందే.
అనేక వివాదాల మధ్య కేరళ స్టోరీ చిత్రం శుక్రవారం రోజు అన్ని భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని విపుల్ అమృతల్ షా నిర్మించగా, సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. కేరళ యువత ఉగ్రవాద ముసుగులో చిక్కుకుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కేరళపై ఉగ్రవాదం ప్రభావం ఎలా పడుతోంది అనే అంశాలని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ది కేరళ స్టోరీ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే సెన్సార్ బోర్డు కేరళ స్టోరీ చిత్రానికి ఊహించని షాక్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఏకంగా 10 సన్నివేశాలని తొలగించారు. దీనితో ఈ చిత్రంలో ఆ రేంజ్ లో సెన్సిటివ్ కంటెంట్ ఉందా అనే చర్చ జరుగుతోంది.
సెన్సార్ బోర్డు తొలగించిన సన్నివేశాలతో మాజీ సీఎం ఇంటర్వ్యూకి సంబంధించిన సీన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ అనే ప్రచారం జరుగుతోంది. ఆయన కామెంట్స్ ని దర్శకుడు సుదీప్తో సేన్ రియల్ ఫుటేజ్ గా ఉపయోగించుకుని ఉండొచ్చు.
డిలీట్ చేసిన సన్నివేశాలపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. వివాదం అయ్యే అవకాశం ఉన్న డైలాగులు, సన్నివేశాలని సెన్సార్ బోర్డు తొలగిస్తూ నిర్ణయం తీసుకుందట. హిందూ దేవుళ్లపై వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ ని తొలగించినట్లు తెలుస్తోంది. ఒక డైలాగ్ అయితే ' ఇండియన్ కమ్యూనిస్టులు పెద్ద హిపోక్రటిక్స్' అనే డైలాగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డైలాగ్ లో ఇండియన్ అనే పదాన్ని తొలగించినట్లు సమాచారం.
మాజీ సీఎం తన గతంలో తన ఇంటర్వ్యూలో.. రానున్న 20 ఏళ్లలో కేరళ యువత ఎక్కువ భాగం ముస్లింలుగా కన్వెర్ట్ కాబోతున్నారు. ఆ విధంగా వారిని ప్రభావితం చేసి ముస్లింలు గా మార్చేస్తారు అనే సన్నివేశం మొత్తాన్ని డిలీట్ చేయాలని సెన్సార్ బోర్డు ఆదేశించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో కూడా దీనికి సంబంధించిన డైలాగ్ ఉంది.. ఈ పరిస్థితి వస్తుందని మన మాజీ సీఎం వార్న్ చేస్తూనే ఉన్నారు అని ఓ యువతి చెప్పడం డైలాగ్ లో చూడొచ్చు.
దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. అయితే గత ఏడాది నవంబర్ లో ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే వివాదం మొదలయింది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా ఆ కాంట్రవర్సీ తారా స్థాయికి చేరింది. దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ది కేరళ స్టోరీపై కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అనుకూలంగా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఈ చిత్రాన్ని తప్పుబడుతున్నారు. రిలీజ్ అయ్యాక ఇంకెన్ని ప్రకంపనలు రేగుతాయో చూడాలి. అయితే ట్రైలర్ చూసి విమర్శించే వాళ్లంతా సినిమా చూసి ఆ తర్వాత మాట్లాడాలని చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ కోరారు. ఈ చిత్రం కోసం తాను ఏడేళ్లు కష్టపడ్డట్లు తెలిపారు. వాస్తవాలు తెలియకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదని పేర్కొన్నారు.