వధువు కావాలంటూ ఆ నటుడు ప్రకటన... తమన్నా ఉందిగా అంటూ షాకిచ్చిన జనాలు!
నటుడు విజయ్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. పెళ్ళి చేసుకోవడానికి వధువు కావాలని ప్రకటన చేయగా తమన్నా ఉందిగా అంటూ సమాధానం చెబుతున్నారు.

Photo Courtesy: Instagram
హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమలో పడ్డారనేది మీడియా వర్గాల వాదన. కొద్దినెలలుగా నటుడు విజయ్ వర్మతో ఆమె సన్నిహితంగా ఉంటున్నారు. తరచుగా కలిసి కనిపిస్తున్నారు. 2023 న్యూ ఇయర్ వేడుకలు జంటగా సెలబ్రేట్ చేసుకున్నారని సమాచారం. అయితే ఈ వార్తలను తమన్నా ఖండించారు. నేను ఎవరితో డేటింగ్ చేయడం లేదు. ప్రస్తుతం సింగిల్ అని సమాధానం చెబుతున్నారు. కానీ ఆమె చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి.
ఇంత రచ్చ జరుగుతుంటే తమన్నా-విజయ్ వర్మ కలవడం మానలేదు. ఇటీవల వీరిద్దరూ ఒకే కారులో డిన్నర్ నైట్ కి వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. చేసేది లేక తమన్నా నవ్వుతూ హాయ్ చెప్పారు. విజయ్ డ్రైవింగ్ చేస్తుండగా, పక్క సీట్లో తమన్నా కూర్చొని ఉంది. ఈ క్రమంలో తమన్నా, విజయ్ మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు నిజమే అని పలువురు వాదిస్తున్నారు.
విజయ్ వర్మ నటించిన వెబ్ సిరీస్ దాహడ్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ వర్మ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. అతని గుణగణాలు, అందచందాలు తెలియజేస్తూ వధువు కావలెను అని పోస్టర్ వేశారు. అనూహ్యంగా ఈ ప్రమోషనల్ పోస్టర్ వేరు రూటు తీసుకుంది. తమన్నాతో అతడు అఫైర్ నడుపుతున్నాడనే వార్తల నేపథ్యంలో... తమన్నా ఉంది కదా మరొక అమ్మాయి ఎందుకంటూ సైటైర్స్ వేస్తున్నారు.
vijay varma
ఊహించని ఈ రెస్పాన్స్ కి విజయ్ వర్మ ఖంగుతిన్నాడు. విజయ్ వర్మ పెద్ద స్టార్ ఏమీ కాదు. అయినా అతడు తమన్నా మనసు దోచుకున్నాడు. తెలుగులో విజయ్ వర్మ ఎం సీ ఏ చిత్రం చేశాడు. నాని హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంలో విజయ్ వర్మ విలన్ గా నటించారు. ఎం సీ ఏ సూపర్ హిట్ కొట్టినా విజయ్ వర్మకు తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాలేదు.
ఇక తమన్నా కెరీర్ పరిశీలిస్తే ఆమె జోరు తగ్గలేదు. స్టార్ హీరోయిన్ హోదా పోయినప్పటికీ టాప్ స్టార్స్ పక్కన ఛాన్సులు వస్తున్నాయి. భోళా శంకర్, జైలర్ చిత్రాల్లో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. కెరీర్లో మొదటిసారి రజినీకాంత్ కి జంటగా నటిస్తున్నారు.