ఓటమెరగని సాహసీకుడు.. ప్రపంచానికి టాలీవుడ్‌ సత్తా చాటిన దర్శకధీరుడు

First Published 10, Oct 2020, 8:45 AM

ఆయనకు ఓటమనేదే లేని దర్శకుడు. ఆయన మొదలెట్టాడంటే ఆ సినిమా అద్భుతమైన శిల్పంగా రూపుదిద్దుకోవాల్సిందే. ఆయన తీశాడంటే అదొక అద్భుత కళాఖండం కావాల్సిందే. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన గ్రేట్‌ డైరెక్టర్ రాజమౌళి బర్త్ డే స్పెషల్‌.

ఆయనొక రూపశిల్పి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సాహసీకుడు. ఆయనే.. దర్శకధీరుడు. టాలీవుడ్‌ ముద్దుగా పిలుచుకునే `జక్కన్న` పుట్టిన రోజు నేడు(శనివారం). 47ఏళ్లు పూర్తి చేసుకున్న రాజమౌళి కెరీర్‌ని గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు చూద్దాం.

టాలీవుడ్‌ సినిమాకి `పాన్‌ ఇండియా` అనే ట్యాగ్‌ని పరిచయం చేసిన రాజమౌళి కర్నాటకలోని మాన్విలో జన్మించారు. అసలు పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి(ఎస్‌ఎస్‌ రాజమౌళి). వీరి తండ్రి గొప్ప రైటర్ కెవి. విజయేంద్రప్రసాద్‌ అన్న విషయం తెలిసిందే. తల్లి రాజ నందిని. వీరి ఫ్యామిలీ ఏపీలోని కొవ్వూరుకి చెందినవారు. అక్కడే రాజమౌళి విద్యాభ్యాసం జరిగింది.

సినిమాలపై ఆసక్తి, పైగా తండ్రి విజయేంద్రప్రసాద్‌ పెద్ద రైటర్‌ కావడంతో ఆయన ఎంట్రీ సులభంగానే జరిగింది. తొలుత ఈటీవీలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వద్ద పనిచేవారు. మొదటగా `శాంతి నివాసం` అనే సీరియల్‌ డైరెక్ట్‌ చేశాడు. దీనికి రాఘవేంద్రరావు నిర్మాత.

దర్శకుడిగా ఎన్టీఆర్‌తో `స్టూడెంట్‌ నెం.1` చిత్రాన్ని రూపొందించారు. తొలిసినిమాతోనే దర్శకుడిగా తన సత్తాని చాటారు. ఇక రెండేళ్ళ గ్యాప్‌తో మరోసారి ఎన్టీఆర్‌తోనే `సింహాద్రి` చేసి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ నెక్ట్స్ ఇయర్‌ నితిన్‌తో `సై` తో భారీ హిట్‌ కొట్టాడు. హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారు.

ప్రభాస్‌తో చేసిన `చత్రపతి`తో స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. ఎన్టీఆర్‌తో మూడో సినిమా `యమదొంగ`, రామ్‌చరణ్‌తో చేసిన `మగధీర` టాలీవుడ్‌ని షేక్‌ చేసింది. ఈ సినిమాతో రాజమౌళి రేంజ్‌ మామూలు కాదని అందరికి అర్థమైపోయింది. ఈ సినిమా తర్వాత అందరిని షాక్‌కి గురి చేస్తూ, తనపై అంచనాలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా హాస్యనటుడు సునీల్‌తో `మర్యాద రామన్న` సినిమా చేసి హిట్‌ కొట్టాడు. రవితేజతో `విక్రమార్కుడు`తీసి మరో బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు.

`ఈగ`తో సినిమా చేసి టాలీవుడ్‌ రికార్డ్ లను తిరగరాశాడు. తాను మనుషులతోనే కాదు, జంతువులు, కీటకాలతోనూ సినిమాలు చేసి హిట్‌ కొట్టగలనని నిరూపించారు. ఈ క్రమంలో రాజమౌళి ఫోకస్‌ పాన్‌ ఇండియా సినిమాపై పడింది. పెద్ద కలలు కన్నాడు. అందుకు తండ్రి విజయేంద్రప్రసాద్‌ తోడయ్యాడు. అంతే `బాహుబలి` వంటి ఇండియన్‌ సినిమా రికార్డ్ లను షేక్‌ చేసే అద్భుత కళాఖండాన్ని, ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసే పీరియాడికల్‌ విజువల్‌ వండర్‌ని, తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమాని రూపొందించారు.

70 ఏళ్ళ జాతీయ చలన చిత్ర అవార్డుల చరిత్రలో  తొలిసారి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా `బాహుబలి` రూపంలో స్థానాన్ని కల్పించిన దర్శకుడు కూడా. సాదా సీదా కథలైన సరే ఈయన ఇచ్చే విజువల్‌ ట్రీట్‌కి అద్భుతంగా మారిపోతాయి. ఈయన సినిమాల్లోని ఎమోషన్లు థియేటర్‌ నుంచి బయటికొచ్చిన ప్రేక్షకుడితో ఇంటివరకు వెళ్తాయి.

ప్రస్తుతం మరోసారి వండర్‌ని క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా `ఆర్‌ ఆర్‌ ఆర్‌`ని రూపొందిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు ముందు విప్లవవీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు యంగ్‌ ఏజ్‌లో చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని పది భాషల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇక దర్శకధీరుడు, జక్కన్న రాజమౌళి డ్రీమ్‌ మరోటి ఉంది. `మహాభారతం`ని తెరకెక్కించారు. దీన్ని ఐదు భాగాలుగా తీయాలని తన చిరకీల కోరికగా ఉంది. తాను రిటైర్‌మెంట్‌ తీసుకునే టైమ్‌కి దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఇక `ఆర్‌ ఆర్‌ ఆర్‌` తర్వాత మహేష్‌బాబు్‌తో ఓ సినిమా చేయబోతున్నారు.

తెలుగు సినిమా గర్వించ దగ్గ దర్శకుడు రాజమౌళి కెరీర్‌లో ఓటమన్నదే లేదు. ఏకంగా సునీల్‌తో సినిమా తీసి సూపర్‌ హిట్‌ కొట్టాడు. ఇప్పటి వరకు పది సినిమాలు చేస్తే పదీ బ్లాక్‌బస్టర్సే. కేవలం `యమదొంగ` మాత్రమే యావరేజ్‌ రిజల్ట్ ని చవి చూసింది. దీంతోపాటు తాను దర్శకత్వ సహకారం అందించిన నాగార్జున `రాజన్న` సైతం సూపర్‌ హిట్‌గా నిలిచింది. రాజమౌళి బర్త్ డే స్పెషల్‌గా ప్రస్తుతం చేస్తున్న `ఆర్‌ ఆర్‌ ఆర్` నుంచి ఏదైనా ట్రీట్‌ అవుతుందని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. మరి చిత్ర బృందం ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో చూడాలి.

loader