మరో కాస్ట్లీ కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ హిమజ, నెటిజన్లు ఏమంటున్నారంటే..?
వరుసగా కార్లు కొనేస్తోంది బిగ్ బాస్ బ్యూటీ హిమజ. హీరోయిన్లను మించి ఖరీదైన కార్లను కొనేస్తోంది. రీసెంట్ గా మరో కాస్ట్లీ కారుకు ఓనర్ అయ్యింది బ్యూటీ.
సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీ తో కలిసి కొత్త కారు కొనేసింది బిగ్ బాస్ బ్యూటీ.. ఈసారి తన ఫ్యామిలీ కోసం ఇలా కొత్త కారుని కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది బ్యూటీ.. పోస్ట్ పెట్టింది. పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.
హ్యాపీ సంక్రాంతి.. ఈ సంక్రాంతికి నా ఫ్యామిలీని ఇలా సర్ ప్రైజ్ చేయగలిగాను.. మీ అందరి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైందని నేను భావిస్తున్నాను అంటూ తన కొత్త కారు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అయితే హిమజ కొన్న కారు ధర ఎంత అంటూ నెటిజన్లు ఆరా తీయ్యడం మొదలెటోటారున లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె కొన్నది కియా కార్నివాల్ కారు. ఈ పేరు గల ఈ కారు దాదాపు 40 నుండి 50 లక్షలు ధర ఉంటుందని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోనే ఒక కాస్ట్లీ కారుకు ఓనర్ అయ్యింది హిమజా. బిఎం డబ్ల్యూలో కారు కొన్నది.
బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది హిమజ. చాలా సీరియస్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. తను అనుకున్నది చేస్తుంది. ఎవరి ఇన్ఫ్లూయెన్సో లేకుండా గేమ్ ఆడిన హిమజ మధ్యలోనే బిగ్ బాస్ ను వీడి బయటకు వచ్చింది. బిగ్ బాస్ తో హిమజ మరింతగా పాపులర్ అయ్యింది. ఈ షోలో డేర్ అండ్ డాషింగ్ గర్ల్ గా పేరు తెచ్చుకుంది.
బిగ్ బాస్ లో మంచి ఇమేజ్ సాధించింది కాని ఆమె పెద్దగా గేమ్ ఆడలేదు. కాకపోతే హిమజ గ్లామర్ మాత్రం ఆడియన్స్ ను బాగా ఆకర్షించిందనే చెప్పాలి. అనే చెప్పాలి. ఈ గ్లామర్ తోనే ఆమె చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుది. ప్రస్తుతం హిమజ అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంది.
ఆమధ్య ఆమె కొత్తగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసింది హిమజ. తనకు సబంధించిన ఇన్ ఫర్మేషన్ అంతా అందులో అప్ డేట్ చేస్తుంటుంది. అంతే కాదు మంచి ఫుడ్ వీడియోస్ తో పాటు.. తన ఫ్యామిలీకి సబంధించిన ఇన్ ఫర్మేషన్ కూడా ఇస్తుంటుంది. ఇక హిమజా బై బర్త్ బాగా కలిగిన కుటుంబం అని తెలుస్తుంది. దాంతో ఆమో పెద్దగా అవకాశాల కోసం వెంపర్లాడటం లేదు. ఆడుతూ పాడుతూ.. వచ్చిన అవకాశాలు మాత్రమే అందిపుచ్చుకుంటుందిబ్యూటీ.