- Home
- Entertainment
- మెగా డాటర్ మారాల్సిందే.. సుస్మిత కొణిదెలపై విమర్శలు, అప్పటి నుంచే చిరు కాస్ట్యూమ్స్ దారుణంగా
మెగా డాటర్ మారాల్సిందే.. సుస్మిత కొణిదెలపై విమర్శలు, అప్పటి నుంచే చిరు కాస్ట్యూమ్స్ దారుణంగా
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లో విడుదలయింది. ఏమాత్రం బజ్ లేని ఈ చిత్రం చాలా మంది ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద ఉసూరు మనిపించింది. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి ఈ చిత్రాన్ని మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లో విడుదలయింది. ఏమాత్రం బజ్ లేని ఈ చిత్రం చాలా మంది ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద ఉసూరు మనిపించింది. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి ఈ చిత్రాన్ని మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
సినిమా పరాజయం చెందినప్పుడే లోపాలన్నీ బయటకి వస్తాయి. మెగా ఫ్యాన్స్ సైతం భోళా శంకర్ విషయంలో తీవ్ర నిరాశగా ఉన్నారు. రీమేక్ చిత్రాన్ని అంగీకరించడమే చిరు చేసిన తప్పని అంటున్నారు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో ముందు నుంచి అంచనాలు లేవు. ప్రేక్షకులు అంచనా వేసినట్లుగానే మెహర్ ఈ చిత్రాన్ని ఆకట్టుకునే విధంగా మలచలేదు.
దీనితో ఫ్యాన్స్ చిరు ఇకనైనా రీమేక్ చిత్రాలని పక్కన పెట్టాలని కోరుతున్నారు. భోళా శంకర్ పరాజయం తర్వాత తెరపైకి వచ్చిన మరో లోపం.. చిరు ధరించే కాస్ట్యూమ్స్ అండ్ స్టైలింగ్. సైరా నుంచి చిరంజీవి చిత్రాలకు ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు. అప్పటి నుంచి చిరు కాస్ట్యూమ్స్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావడంతో ఆ లోపం కనిపించలేదు. గాడ్ ఫాదర్ మూవీ కూడా బావుంది. కానీ చిరు కాస్ట్యూమ్స్ నేచురల్ గా లేవనే వాదన వినిపించింది. ఆచార్య గురించి ఇక చెప్పనవసరం లేదు. ఇప్పుడు భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో సుస్మిత కొణిదెలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క సన్నివేశం లో కూడా చిరు కాస్ట్యూమ్స్ ఆకట్టుకునే విధంగా లేవు. ఎదో ఆర్టిఫీషియల్ గా ఉన్నట్లు ఉన్నాయని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
కాస్ట్యూమ్స్ విషయంలో సుస్మిత అప్డేట్ కావాలని అంటున్నారు. లేదా చిరంజీవి తన చిత్రాలని దృష్టిలో పెట్టుకుని కుమార్తె అని ప్రేమ చూపించకుండా పేరున్న కాస్ట్యూమ్ డిజైనర్ ని పెట్టుకోవాలని అంటున్నారు. అలాగే స్టైలిస్ట్ ని కూడా మార్చాలని అంటున్నారు.
చిరంజీవి తన తదుపరి చిత్రం సుస్మిత కొణిదెల నిర్మాణంలోనే నటించబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భోళా శంకర్ పై విమర్శల నేపథ్యంలో సుస్మితనే కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతుందా లేక కొత్త డిజైనర్ కి ప్రాధాన్యత ఇస్తారా అనేది వేచి చూడాలి.