- Home
- Entertainment
- భోళా శంకర్ ఫస్ట్ రివ్యూ... ఫ్యాన్స్ కి మెగా మాస్ ట్రీట్, గూస్ బంప్స్ లేపే ఇంటర్వెల్ బ్యాంగ్!
భోళా శంకర్ ఫస్ట్ రివ్యూ... ఫ్యాన్స్ కి మెగా మాస్ ట్రీట్, గూస్ బంప్స్ లేపే ఇంటర్వెల్ బ్యాంగ్!
భోళా శంకర్ మూవీ సెన్సార్ జరుపుకుంది. ఈ చిత్రానికి సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ క్రమంలో టాక్ బయటకు వచ్చింది.

Bhola Shankar Review
బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ ని హోరెత్తిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 2023 ఏప్రిల్ లో ఆచార్య విడుదల చేసిన మెగాస్టార్ అక్టోబర్ లో గాడ్ ఫాదర్, 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య విడుదల చేశారు. మరో ఏడు నెలల్లో భోళా శంకర్ అంటూ సందడి చేయనున్నాడు.
దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సెన్సార్ పూర్తి చేసుకోగా టాక్ బయటకు వచ్చింది. సెన్సార్ సభ్యులు నాలుగు మార్పులు సూచించినట్లు సమాచారం. ఒకటి ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం టెక్స్ట్ సైజ్ పెంచాలని చెప్పారట. డ్రగ్స్ వాడకం ప్రమాదం అనే సూచన కూడా చేయాలన్నారట.
అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ లో విలన్ తలను నరికే సన్నివేశం ఉంటుందట. అది బ్లర్ చేయాలన్నారట. ఇక చివరిగా బద్దలు బాసింగాల్ అనే ఓ బూతు పదం డబ్బింగ్, సబ్ టైటిల్ నుండి తొలగించాలని చెప్పారట. ఈ నాలుగు మార్పులు చెప్పి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారట.
Bhola Shankar
ఇక సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే... మరోసారి మెగాస్టార్ నుండి మాస్ ట్రీట్ తప్పదంటున్నారు. చిరంజీవి మేనరిజం, డైలాగ్స్, యాక్షన్ పీక్స్ లో ఉంటాయి. ప్రేక్షకులు ఆద్యంతం ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో అదిరిపోతుందట.
Bhola Shankar
క్లైమాక్స్ లో సిస్టర్ సెంటిమెంట్ తో కట్టిపడేశారట. సినిమా చాలా రిచ్ గా ఉంటుందని అంటున్నారు. కీర్తి సురేష్ పాత్ర కీలకం కాగా చెల్లిగా ఆమె కన్నీరు పెట్టించిందని అంటున్నారు. తమన్నా గ్లామర్, శ్రీముఖితో స్పూఫ్ సీన్స్ మెప్పిస్తాయని అంటున్నారు. మొత్తంగా చిరంజీవి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు భోళా శంకర్ మూవీలో ఉన్నాయంటున్నారు.
భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా తెరకెక్కుతుంది. ఒరిజినల్ లో అజిత్ నటించారు. ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.