- Home
- Entertainment
- Bheemla Nayak Collections: పడిపోయిన `భీమ్లా నాయక్` కలెక్షన్లు.. త్రివిక్రమ్ చేసిన మిస్టేక్ అదేనా?
Bheemla Nayak Collections: పడిపోయిన `భీమ్లా నాయక్` కలెక్షన్లు.. త్రివిక్రమ్ చేసిన మిస్టేక్ అదేనా?
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన `భీమ్లా నాయక్` బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. కానీ కలెక్షన్ల పరంగా డీలా పడిపోయింది. కేవలం మూడు రోజులు మాత్రమే సత్తా చాటిన ఈ సినిమా ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయింది.

పవర్ స్టార్ పవన్(Pawan Kalyan) `వకీల్‌సాబ్` హిట్ తర్వాత నటించిన చిత్రం `భీమ్లా నాయక్`(Bheemla Nayak). `అయ్యప్పనుమ్ కోషియమ్` అనే మలయాళ చిత్రానికిది రీమేక్. పవన్, రానాల మధ్య ఈగో ఇష్యూ తలెత్తితే ఆ ఇద్దరు తమ ఈగో కోసం చేసిన ఫైట్ నేపథ్యంలో సాగే చిత్రమిది. గత శుక్రవారం విడుదలైన ఈసినిమా థియేటర్లలో రన్ అవుతుంది. ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌ని తెచ్చుకోవడం విశేషం. దీంతో ఈ చిత్రం టాలీవుడ్‌లో రికార్డ్ లు క్రియేట్ చేస్తుందని, నాన్ `బాహుబలి` రికార్డ్ లు కొల్లగొడుతుందని అంతా భావించారు. కానీ అలా జరగడం లేదు.
పవన్ కళ్యాణ్‌కి ఉన్న కల్ట్ ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్ గురించి తెలిసిందే. ఎంత పొలిటికల్ లీడర్ అయినా ఆయన ఇమేజ్ చెక్కుచెదరలేదు. టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఉన్నారు. అయితే ఆయన్నుంచి సరైన హిట్ లేక చాలా కాలమవుతుంది. `వకీల్ సాబ్` హిట్ టాక్ తెచ్చుకున్నా.. కరోనా ప్రభావంతో అది మొదటి వారాంతంలోనే క్లోజ్ అయ్యింది. దీంతో ఆ లోటుని `భీమ్లా నాయక్` తీర్చబోతుందని అంతా భావించారు. ఇప్పటికే హిట్ అయిన సినిమా కావడం, విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచడం, పవన్ సినిమా కోసం ఆయన అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేసిన నేపథ్యంలో `భీమ్లా నాయక్` ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది.
ప్రీమియర్స్ నుంచే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అంతా ముక్తకంఠంతో సూపర్ హిట్‌గా తేల్చేశారు. అనుకున్నట్టుగానే ఈ చిత్రం తొలి రోజు సుమారు నలభై కోట్ల షేర్(61కోట్లు గ్రాస్) రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో వంద కోట్ల గ్రాస్‌ని రీచ్ అయ్యింది. కానీ మండే నుంచి ఒక్కసారిగా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. నాల్గో రోజు(సోమవారం) కేవలం 13కోట్లే వసూలు కావడం గమనార్హం. ఆ తర్వాత 15 కోట్లు, ఎనిమిది కోట్లు, ఏడు కోట్లు వసూలు చేసింది. ఒక్కసారిగా కలెక్షన్లు పడిపోతూ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
సోమవారం నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోవడంతోనే చిత్ర బృందం తేరుకుని ప్రమోషన్ కార్యక్రమాలు పెంచారు. దర్శకుడు, రానాలతో ఇంటర్వ్యూలు పెట్టించి ప్రమోషన్ కార్యక్రమాలు పెంచారు. కానీ సినిమాకవి ఏమాత్రం హెల్ప్ కాలేదు. పైగా మరింతగా డ్రాప్ అయ్యాయి. దీంతో ఈ సినిమా విషయంలో జరిగిన మిస్టేక్స్ ఏంటనేది ఆరా తీయగా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావాన్ని పడ్డాయని చెప్పొచ్చు. ఓవరాల్ కలెక్షన్లలో దాదాపు ముప్పై కోట్ల మేరకు ప్రభావం చూపించాయని చెప్పొచ్చు.
దీనికితోడు ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లలో ప్రదర్శించారు. దీంతో సినిమాని చూసే రెగ్యూలర్ ఆడియెన్స్ మొత్తం మొదటి మూడు రోజుల్లోనే ఆల్మోస్ట్ చూసేశారు. చూడని వారి మిగిలిన రోజుల్లో చూస్తున్నారు. ఇది ఓ కారణమైతే, సినిమాలో బలమైన ఫ్యాన్స్ మూవ్‌మెంట్స్ లేవనే టాక్ వినిపిస్తుంది. సెకండాఫ్‌లో పాటలు లేకపోవడం కూడా సినిమాకి మైనస్ అయ్యిందంటున్నారు. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే అంశాలు కొరవడినట్టు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్లే ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రానికి దూరమయ్యారనే టాక్ వినిపిస్తుంది.
ఏ సినిమాకైనా రిపీట్ ఆడియెన్స్ వస్తేనే సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేయగలుగుతుంది. కానీ ఫ్యాన్స్ కూడా మరోసారి చూసేలా `భీమ్లా నాయక్` లేదంటున్నారు. ఫ్యాన్స్ మూవ్ మెంట్స్ సరైన విధంగా లేకపోవడమే అందుకు కారణమంటున్నారు. దీని వల్ల ఇది యూత్‌కే,మాస్‌కే పరిమితమైన చిత్రంగా నిలిచిందనే అభిప్రాయం క్రిటిక్స్ నుంచి వినిపిస్తుంది. దీంతో ప్రస్తుతం మొదటి వీక్‌లో ఈ చిత్రం అధికారిక లెక్కల ప్రకారం 170కోట్లు వసూలు చేసిందని టాక్. కానీ 130కోట్ల(గ్రాస్)కే పరమితమయ్యిందనేది ఇన్‌సైడ్ వర్గాల టాక్.
అయితే ఈ విషయంలో బన్నీ నటించిన `పుష్ప`, బాలయ్య నటించిన `పుష్ప` చిత్రాలు `భీమ్లా నాయక్` కంటె బెటర్ పొజిషియన్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. బాలయ్య తన `అఖండ` సక్సెస్‌తో దాదాపు 150కోట్ల మార్క్ కి చేరుకున్నారు. తన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా `అఖండ`ని నిలిపారు. ఇందులో భారీ స్థాయిలో ఫ్యాన్స్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి. పైగా ఫ్యామిలీ చూసే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని చూసేందుకు జనం భారీగా కదిలారు. రిపీట్‌గా చూశారు.
అలాగే ఐకాన్ స్టార్ `అల్లు అర్జున్` నటించిన `పుష్ప` చిత్రం సైతం భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నా, ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంది ఊహించని విధంగా భారీ కలెక్షన్లని సాధించింది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇందులో ఫ్యాన్స్ కి నచ్చే అంశాలతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే వీటికి రిపీట్ ఆడియెన్స్ వచ్చారు. సినిమాకి అఖండ విజయాన్ని అందించారు.
కానీ `భీమ్లానాయక్`లో అవి లోపించడంతో సినిమా నాల్గో రోజు నుంచి దారుణంగా పడిపోయిందంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు సాగర్ కె చంద్ర, త్రివిక్రమ్ చేసిన మిస్టేక్ అదే అని అంటున్నారు. ఫ్యాన్స్ మూవ్‌మెంట్స్ పెంచి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలను పెంచి ఉంటే సినిమా ఫలితం మరింత బాగా ఉండేదంటున్నారు. ఈ శుక్రవారం విడుదలైన చిత్రాల(`ఆడవాళ్లు మీకు జోహార్లు`, `సెబాస్టియన్`)కు కూడా పెద్దగా పాజిటివ్ టాక్ లేదు. ఈ సందర్భాన్ని `భీమ్లా నాయక్` క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నా, ఆ ప్రయోజయం చేకూరే ఛాన్స్ లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇంకా సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి టైమ్ పడుతుందని, ఏపీలో చాలా చోట్లు నష్టాలు తప్పవని అంటున్నారు.