MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `భగవంత్‌ కేసరి` అసలు స్టోరీ లీక్‌.. దాచిన బాలయ్య గెటప్‌ ఇదే?

`భగవంత్‌ కేసరి` అసలు స్టోరీ లీక్‌.. దాచిన బాలయ్య గెటప్‌ ఇదే?

బాలయ్య రెండు మూడు గెటప్స్ లో కనిపిస్తారని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. ఇప్పటి వరకు ఒకే గెటప్‌ని చూపించారు. మిగిలిన వాటిని దాచారు. అయితే ఈ గెటప్‌, సినిమా కథ ఇదే అని ఓ లీక్డ్ వార్త వైరల్‌ అవుతుంది. 

Aithagoni Raju | Published : Oct 16 2023, 05:11 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

బాలకృష్ణ ఈ దసరాకి `భగవంత్‌ కేసరి` చిత్రంతో రాబోతున్నారు. `అఖండ`, `వీర సింహారెడ్డి` వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల అనంతరం ఇప్పుడు `భగవంత్‌ కేసరి` చిత్రం విడుదల కాబోతుంది. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే కథ అని చిత్ర బృందం చెబుతుంది. బాలయ్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు ఆకట్టుకున్నా, సహజత్వం కొంత మిస్‌ అవుతున్నట్టుగా అనిపించింది. కానీ సినిమాలో బాగుంటుందని తెలుస్తుంది. అయితే ఇందులో బాలయ్య గెటప్స్ కి సంబంధించి, అలాగే అసలు స్టోరీకి సంబంధించిన ఆసక్తికర విషయంలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

27
Asianet Image

ఇందులో బాలయ్య రెండు మూడు గెటప్స్ లో కనిపిస్తారని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. ఇప్పటి వరకు ఒకే గెటప్‌ని చూపించారు. మిగిలిన వాటిని దాచారు. అయితే ఈ గెటప్‌, సినిమా కథ ఇదే అని ఓ లీక్డ్ వార్త వైరల్‌ అవుతుంది. ఇందులో మరో పాత్రలో బాలయ్య పోలీస్‌ పాత్రలో కనిపిస్తారని, ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఆ ఎపిసోడ్‌ హైలైట్‌గా ఉంటుందని, అందుకే దాన్ని దాచారని అంటున్నారు. 

37
Asianet Image

అదే ఇప్పుడు లీక్‌ అయ్యింది. లీక్‌ అయినట్టుగానే అది పోలీస్‌ పాత్ర అట. బాలయ్య ఆ గెటప్‌లో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తుంది. అయితే దీనికి కొంత పొలిటికల్‌ టచ్‌ కూడా ఉంటుందట. పోలీస్‌ బాలయ్యపై నేరారోపణలతో ఆయన్ని జైల్లో పెట్టిస్లారట. కొందరు చేసిన కుట్ర కారణంగా, చేయని తప్పుకి జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వస్తుందని తెలుస్తుంది. దానికి ప్రతీకారమే ఓల్డ్ గెటప్‌లో ఉన్న బాలయ్య తీర్చుకుంటాడట. అయితే ఇందులో శ్రీలీల తన సొంత కూతురు కాదు. అన్న కూతురని తెలుస్తుంది. చిచ్చా అని పిలుస్తుంటే ఆ విషయం అర్థమవుతుంది. 
 

47
Asianet Image

శ్రీలీల ఓ జైలర్‌ కూతురు అట. ఆయన చనిపోతాడు. ఆయన్ని చంపేస్తారని తెలుస్తుంది. దీంతో శ్రీలీలని చూసుకునే బాధ్యత బాలయ్య తీసుకుంటారట. ఆమెని బలంగా తయారు చేయించడం కోసం, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనేందుకు మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా ఉండేలా ఆమెని తీర్చిదిద్దే పని పెట్టుకుంటాడట. దీంతోపాటు అమ్మాయిలను ఎలా పెంచాలో క్లాస్‌ కూడా పీకడం ఉంటుందని తెలుస్తుంది. అయితే శ్రీలీల తండ్రి జైలర్‌ పాత్రలో ప్రముఖ నటుడు నటించాడని, ఆ పాత్రని సీక్రెట్‌గా ఉంచారని తెలుస్తుంది. 
 

57
Asianet Image

ఇదిలా ఉంటే మొదట ఈ పోలీస్‌ పాత్రకి నక్సలిజం బ్యాక్‌ డ్రాప్‌ అనుకున్నారట. నక్సలైట్‌ని జైల్లో పెడతారు. కానీ బాలయ్య అభ్యంతరం చెప్పారట. తాను నక్సలైట్‌గా చేయనని చెప్పడంతో పోలీస్‌ ఆఫీసర్‌గా పాత్రని మార్చేశాడట అనిల్‌ రావిపూడి. మరి ఆ నేపథ్యాన్ని పోలీస్‌ నేపథ్యంగా మార్చడం కన్విన్సింగ్గా ఉందా? అనేది ఆసక్తికరం. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ 40 నిమిషాలు ఉంటుందని, దానితోపాటు శ్రీలీలతో బాలయ్య అనుబంధం ప్రధానంగా సినిమా నడుస్తుందని తెలుస్తుంది. ఆయా సీన్లు రొటీన్‌గా ఉంటాయనే కామెంట్‌ కూడా వినపిస్తుంది. 
 

67
Asianet Image

శ్రీలీలతో బాలయ్య బాండింగ్‌, ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ సినిమాకి బలం అని, దర్శకుడు అనిల్‌ రావిపూడి వాటినే నమ్ముకున్నారని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో గత బాలయ్య చిత్రాల్లా ఉండదని, కొంత వినోదం, మరికొంత ఎమోషనల్‌గా ఉంటుందని, కూతురు సెంటిమెంట్‌ ఎక్కువగా ఉంటుందట. మూడు భారీ ఫైట్లు ఉంటాయన్నారు దర్శకుడు. మొత్తంగా ఈ చిత్రాన్ని యాక్షన్‌గా కంటే ఎమోషనల్ గా తెరకెక్కించినట్టు సమాచారం. బాలయ్య సైతం సినిమా చూసి కన్నీళ్లు పెట్టకుండా ఎవరూ బయటకు రారు అని చెప్పారు. 
 

77
Asianet Image

మరి ఇప్పుడు సందేశాలు, ఇంతటి ఎమోషన్స్ ని ఆడియెన్స్  చూస్తారా? అనేది చర్చ. పైగా ఈ చిత్రానికి ఎంత చేసినా హైప్‌ రావడం లేదు. చంద్రబాబు అరెస్ట్ ప్రభావం సినిమాపై గట్టిగా పడబోతుందని తెలుస్తుంది. టీడీపీ శ్రేణులు సైతం అంతగా ఆసక్తి కనిపించడం లేదని టాక్‌ వస్తుంది. ఔట్‌పుట్‌ విషయంలో టీమ్‌లో హ్యాపీనెస్‌ కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో మరో మూడు రోజుల్లో తేలనుంది. 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories