- Home
- Entertainment
- బాలీవుడ్ లో దళపతి విజయ్ తగ్గక తప్పలేదు.. అక్కడొక్కచోట బీస్ట్ ఎలా రిలీజ్ అవుతుందో తెలుసా..?
బాలీవుడ్ లో దళపతి విజయ్ తగ్గక తప్పలేదు.. అక్కడొక్కచోట బీస్ట్ ఎలా రిలీజ్ అవుతుందో తెలుసా..?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో ఇక్కడ కూడా ఆయన సినిమాల బిజినెస్ అంతకంతకు పెరుగుతూ ఉంది. ఇక ఈసారి బాలీవుడ్ లో కూడా గట్టిగా జెండా పాతాలని చూస్తున్నాడు విజయ్.

దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా అంటే తమిళంలో పడి చచ్చిపోతుంటారు జనాలు. ఇక తెలుగులో కూడా ఆయనకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అటు హిందీలో కూడా విజయ్ కు గుర్తింపు ఉంది. ఈ సర్కిల్ ను బాలీవుడ్ వరకూ పెంచుకోవాలి అని చూస్తున్నాడు విజయ్.
అయితే తమిళ సినిమాలు ఈ మధ్య అవే టైటిల్ తో ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా అజిత్ వాలిమై కూడా ఇలానే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు విజయ్ బీస్ట్ విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నారు మేకర్స్. కాని హిందీలో మాత్రం విజయ్ తగ్గక తప్పలేదు.
ఈ సినిమాను తెలుగు,మలయాళ, కన్నడ ,హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు ఒక్క హిందీలో తప్ప మిగతా భాషల్లో ఈ సినిమా బీస్ట్ టైటిల్ తోనే పలకరించనుంది. హిందీలో మాత్రం ఈ సినిమాకి రా (Raw) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ టైటిల్ తోనే సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కాబోతోంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విజయ్ సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తుంటాయి. హిందీలో కూడా ఇదే ఫార్ములా అప్లై చేయాలి అని చూస్తున్నాడు విజయ్ .
ఇక పోతే విజయ్ సినిమాలు కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు బిజినెస్ పెంచుకుంటూనే ఉన్నారు మేకర్స్. సన్ పిక్చర్స్ బ్యానర్స్ నిర్మించిన ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఇక విజయ్ సరసన హీరోయిన్ గా ఫస్ట్ టైమ్ పూజ హెగ్డే నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఆ మధ్య వచ్చిన సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు.
ఇక బీస్ట్ తెలుగు అనువాద హక్కులకు భారీ రేటు పలికినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు విజయ్ చేసిన మాస్టర్ సినిమా తెలుగు అనువాద హక్కులు 6 కోట్లకు అమ్ముడుపోగా 14 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. ఆ సినిమా మంచి లాభాలను అందుకుంది. దాంతో బీస్ట్ మూవీకి డిమాండ్ ఇంకా బాగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా తెలుగు రౌట్స్ దాదాపు 11 కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.
ఇక సెల్వరాఘవన్ యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించారు. కెజియఫ్ ఛాప్టర్ 2తో పోటీపడుతూ విజయ్ బీస్ట్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా మీద దృష్టి పెట్టిన విజయ్ తెలుగు నుంచి కూడా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మరో సినిమ చేస్తున్నాడు. ఈసినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలి అని చూస్తున్నాడు.