Bandla Ganesh: దేవుడు అంటూ కొలిచే పవన్ ఫోటో తీసేసిన బండ్ల గణేష్.. అంతలా చెడిందా ?
బండ్ల గణేష్ పేరు చెప్పగానే వీరావేశంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రశంసలు కురిపిస్తూ చేసే ప్రసంగాలే గుర్తుకు వస్తాయి. అంతలా బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ మధ్య బంధం పెనవేసుకుపోయింది.

బండ్ల గణేష్ పేరు చెప్పగానే వీరావేశంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రశంసలు కురిపిస్తూ చేసే ప్రసంగాలే గుర్తుకు వస్తాయి. అంతలా బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ మధ్య బంధం పెనవేసుకుపోయింది. గబ్బర్ సింగ్ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ బండ్ల గణేష్ ఆరాధించడం మొదలు పెట్టాడు.
పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్ లో ప్రత్యక్షం అవుతూ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా బండ్ల గణేష్ ప్రసంగాలు చేస్తూ పాపులర్ అయ్యాడు. బండ్ల గణేష్ ఏం చేసినా సంచలనమే. గతంలో రాజకీయాల్లోకి వెళ్లి చేతులు కాల్చుకుని బయటకి వచ్చాడు. కొంతకాలంగా బండ్ల గణేష్ సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇక ఇటీవల బండ్ల గణేష్ ట్విట్టర్ లో ట్వీట్స్ ప్రవాహం ఎక్కువైంది. జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ కూడా బండ్ల గణేష్ ట్వీట్స్ చేయడం ప్రారంభించాడు. అయితే ఏంజరిగిందో ఏమో కానీ బండ్ల గణేష్ కాస్త అసహనంలో, నిరాశలో ఉన్నట్లు అర్థం అవుతోంది.
ఇటీవల బండ్ల గణేష్ ట్విట్టర్ లో తన ఆడియో రిలీజ్ చేశాడు. ఈ ఆడియోలో.. జీవితంలో ఎవరినీ నమ్ముకోవద్దు.. మీ తల్లి దండ్రులని నమ్మండి.. మీ భార్యని ప్రేమించండి.. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి అంటూ బండ్ల గణేష్ నిరాశలో మాట్లాడుతూ ఆడియో రిలీజ్ చేశాడు. దీనితో బండ్ల గణేష్ ఇంతకీ ఎవరి వల్ల హార్ట్ అయ్యాడు. ఎవరినీ నమ్మొద్దు అంటూ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటూ ఫ్యాన్స్ లో గందరగోళం మొదలైంది.
తాజాగా బండ్ల గణేష్ చేసిన మరో ట్వీట్ వైరల్ గా మారింది. గతంలో తన ఇంట్లో పాన్ కళ్యాణ్ ఫోటో తన తల్లిదండ్రుల ఫోటో పెట్టాడు. పవన్ ఫోటోని తీసేశాడు. దీనితో అభిమానుల్లో గందరగోళం మరింతగా పెరిగింది. పవన్ తో బండ్ల గణేష్ కి దూరం పెరిగిందా అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా బండ్ల గణేష్ .. త్రివిక్రమ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆడియో లీక్ అయింది. తనకి ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరు కావాలని ఉన్న త్రివిక్రమ్ రానివ్వడం లేదు అంటూ బండ్ల గణేష్ కామెంట్స్ చేశాడు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బండ్ల గణేష్ పవన్ పై ఏదో విషయంలో హర్ట్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.