బండ్ల గణేష్ ఇంట్లో టాలీవుడ్ స్టార్స్ 30 ఇయర్స్ పార్టీ, వైరల్ అవుతున్న ఫోటోలు
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో రీ యూనియన్ పార్టీలు, గెట్ టు గెదర్ పార్టీలుట్రెండ్ గా మారాయి. ఏ గ్రూప్ కు ఆగ్రూప్ స్టార్స్ ఏడాదికొక్కసారి పార్టీలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే మరికొంత మంది స్టార్స్ చిన్న చిన్న పార్టీలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.

బండ్ల గణేష్ ఇంట్లో 30 ఇయర్స్ పార్టీ
టాలీవుడ్‌లోని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల తన నివాసంలో ఒక ప్రత్యేక గెట్ టుగెదర్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కి చెందిన అనేక మంది ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫొటోలను ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆయన తన ట్వీట్‌లో, “30 ఇయర్స్ ఇండస్ట్రీ పార్టీకి థాంక్యూ బండ్ల గణేశ్ బ్రో. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్‌తో… సీనియర్ సిటిజన్స్… కాదు కాదు, సీనియర్ యాక్టర్స్” అంటూ కామెడీ ట్యాగ్ కూడా తగిలించారు బ్రహ్మాజీ.
KNOW
టాలీవుడ్ స్టార్స్ సందడి
ఈ ప్రత్యేక పార్టీలో నటుడు శ్రీకాంత్, బ్రహ్మాజీ, ఆలీ, శివాజీ రాజా, దర్శకుడు కృష్ణవంశీ, నటుడు రాజా రవీంద్ర, నటుడు శివాజీ, సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, రైటర్ బీవీఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి పార్టీలో ఉల్లాసంగా గడిపిన క్షణాలను ఫోటోలు తీసి.. వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు స్టార్స్. ఇప్పటికే గత కొన్ని నెలలుగా పాత తరం నటులు, దర్శకులు తరచూ రీ యూనియన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇదే తరహాలో బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన ఈ గెట్ టుగెదర్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ యాక్టర్స్ మళ్లీ ఒక చోట చేరి పాత జ్ఞాపకాలను రీ-లైవ్ చేస్తూ సందడి చేసిన వేళ, నెట్టింట్లో ఈ ఫోటోలు అభిమానులు అలరిస్తున్నాయి.
30 years industry 😀❤️.. Thank you @ganeshbandla bro for hosting 🤗…
young n dynamic directors with senior citizens .. typo error… senior actors 😜 pic.twitter.com/TrS4NCScee— Brahmaji (@actorbrahmaji) August 24, 2025
టాలీవుడ్ లో కొత్త ట్రెండ్
ఇదిలా ఉండగా, ఇదే తరహాలో ఇటీవల గోవాలో జరిగిన మరో గ్లామరస్ రీయూనియన్ పార్టీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి సంగీత, సిమ్రన్, మహేశ్వరి, సంఘవి, కావ్య రమేశ్, ఊహ, శివ రంజని లాంటి సీనియర్ హీరోయిన్లతో పాటు దర్శకులు శంకర్, కేఎస్ రవికుమార్, లింగుసామి, మోహన్ రాజా, అలాగే హీరోలు శ్రీకాంత్, జగపతి బాబు, ప్రభుదేవా వంటి ప్రముఖులు హాజరయ్యారు.ఆ ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విధంగా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ సెలబ్రిటీస్ మధ్య ఏర్పడుతున్న మైత్రీ, ఒకరికొకరు ఇచ్చే గౌరవం అభిమానులకు ఓ పండుగలా మారుతోంది.