విజయ్ దేవరకొండపై బండ్ల గణేష్ డైరెక్ట్ అటాక్.. తండ్రి ఫోటోలు పెట్టి ట్రోలింగ్
బండ్ల గణేష్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో తరచుగా కిరికిరి పెట్టుకుంటూనే ఉన్నాడు. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ని ట్రోల్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ బండ్ల గణేష్. ముక్కుసూటిగా మాట్లాడడం అతడి నైజం. బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ కొన్ని సందర్భాల్లో వివాదంగా మారుతుంటాయి. నిర్మాతగా బండ్ల గణేష్ గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.
బండ్ల గణేష్ ట్విట్టర్ లో, సినిమా ఈవెంట్స్ లో చేసే వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతుంటాయి. కొన్ని సార్లు వివాదంగా మారి బండ్ల గణేష్ కి చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. బండ్ల గణేష్ కి తాన్ టంగ్ కంట్రోల్ లో ఉండదు అనే విమర్శ ఉంది. బండ్ల గణేష్ తరచుగా తన దూకుడు స్వభావం చూపిస్తూనే ఉన్నారు.
ఆ మధ్యన జగన్నాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పై బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇటీవల అల్లు బ్రదర్స్ పై కూడా గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో తరచుగా కిరికిరి పెట్టుకుంటూనే ఉన్నాడు.
ఆ మధ్యన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ కార్యక్రమంలో మా తాత, తండ్రి ఎవరో మీకు తెలియదు .. అయినా ఇంత అభిమానం చూపిస్తున్నారు అని ఫ్యాన్స్ ని ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు ట్యాలెంట్ కూడా ఉండాలి అని బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.
ఇప్పుడు తాజాగా మరోసారి బండ్ల గణేష్ విజయ్ దేవరకొండపై డైరెక్ట్ అటాక్ చేశాడు. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ని ట్రోల్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. బండ్ల గణేష్ తన తండ్రికి హెయిర్ కట్ చేస్తున్న పిక్ ని, విజయ్ దేవరకొండ అతడి తండ్రితో కూర్చుని ఉన్న పిక్ ని పోస్ట్ చేశాడు. విజయ్ దేవరకొండ తన తండ్రి పక్కన కాలు టేబుల్ పై పెట్టి ఉన్నాడు.
ఈ రెండు ఫోటోలకు బండ్ల గణేష్ పెట్టిన కామెంట్ విజయ్ దేవరకొండని ట్రోల్ చేసే విధంగా ఉంది. మనకి ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టం కల్పించిన తల్లి దండ్రులు మనకి దైవాలు. వారిని పూజించడం, ప్రేమించడం మన భాద్యత అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది.