- Home
- Entertainment
- చిరంజీవికి పాటలు, నాకు ఫైట్స్ ఇక క్లైమాక్స్ అలా ఉండాలి... మల్టీస్టారర్ స్క్రిప్ట్ సెట్ చేసిన బాలయ్య!
చిరంజీవికి పాటలు, నాకు ఫైట్స్ ఇక క్లైమాక్స్ అలా ఉండాలి... మల్టీస్టారర్ స్క్రిప్ట్ సెట్ చేసిన బాలయ్య!
అన్ స్టాపబుల్ టాక్ షో వేదికగా అనేక ఆసక్తికర విషయాలు చర్చకు వస్తున్నాయి. లేటెస్ట్ ఎపిసోడ్ గెస్ట్స్ గా నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ వచ్చారు. ఈ క్రమంలో చిరంజీవి-బాలయ్య మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది.

Chiranjeevi-Balakrishna Multi starer
టాలీవుడ్ సీనియర్ మోస్ట్ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. బాలయ్య సారథ్యంలో ఎప్పటిలాగే ఆసక్తికర అంశాలతో ఈ షో సాగింది. పలు సెన్సిటివ్ మేటర్స్ చర్చకు వచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి-బాలకృష్ణ మల్టీస్టారర్ పై అల్లు అరవింద్, బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Chiranjeevi-Balakrishna Multi starer
సురేష్ బాబు నాతో సినిమాలు చేశారు. కానీ మీరెందుకు ఒక్క సినిమా కూడా చేయలేదని బాలకృష్ణ నిర్మాత అల్లు అరవింద్ ని అడిగారు. నేను మిమ్మల్ని, చిరంజీవిని పెట్టి మల్టీస్టారర్ చేద్దామని ఆగాను అని అల్లు అరవింద్ మంచి టైమింగ్ ఆన్సర్ చెప్పాడు. బాలయ్య ఆ ఆన్సర్ అల్లు అరవింద్ నుండి ఊహించాడు లేదో తెలియదు కానీ కొత్తగా ఫీల్ అయ్యాడు.
Chiranjeevi-Balakrishna Multi starer
ఈ క్రమంలో తామిద్దరూ కలిసి మల్టీస్టారర్ చేస్తే స్క్రిప్ట్ ఎలా ఉండాలో బాలయ్య వెంటనే సూచించాడు. మా మల్టీస్టారర్ లో చిరంజీవికి పాటలు ఉండాలి. నాకు ఫైట్స్ ఉండాలి. ఇంట్రో సాంగ్ చిరంజీవిది, క్లైమాక్స్ ఫైట్ నాది అంటూ టకాటకా చెప్పేశాడు. బాలయ్య ఎప్పటిలాగే తనకు కావాల్సిన మాస్ ఎలివేషన్స్ ఇచ్చుకున్నాడు. ఇక్కడ బాలకృష్ణ తన నైజం మరోసారి రుజువు చేసుకున్నాడు. క్లైమాక్స్ లో ఫైట్ నాదైతే ప్రేక్షకులకు నేనే గుర్తిండి పోతాను అన్నాడు.
Chiranjeevi-Balakrishna Multi starer
చిరంజీవితో మల్టీస్టారర్ అయినప్పటికీ పై చేయి నాదే అవ్వాలన్నట్లు బాలయ్య స్క్రిప్ట్ భలే సెట్ చేసుకున్నాడు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబుతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా షోలో జాయిన్ అయ్యారు. చిరంజీవి-బాలయ్యల మల్టీస్టారర్ కి డైరెక్టర్ గా నేను వ్యవహరిస్తాను అన్నారు. అప్పుడది పాన్ వరల్డ్ మూవీ అవుతుందని బాలయ్య కామెంట్ చేశారు.
Chiranjeevi-Balakrishna Multi starer
నిజంగా ఇది కార్యరూపం దాల్చితే అద్భుతమే అని చెప్పాలి. ఆ అవకాశాలు కొట్టిపారేయలేం కూడా. ఎందుకంటే ఎన్టీఆర్-చరణ్ కలిసి మల్టీస్టారర్ చేస్తారని మనం ఊహించలేదు. దర్శకుడు రాజమౌళి అది సాకారం చేశారు. ప్రస్తుతం చిరు, బాలయ్యల స్టార్ డమ్ కొంచెం తగ్గింది. కాబట్టి ఇగోలు పక్కన పెట్టి నటించే అవకాశం లేకపోలేదు.
Chiranjeevi-Balakrishna Multi starer
బాలయ్యతో చిరంజీవి నటించక పోయినప్పటికీ ఎన్టీఆర్ తో చిరంజీవి సినిమాలు చేశారు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ చిత్రాల్లో నటించాడు. స్టార్ డమ్ వచ్చాక చిరంజీవి మల్టీస్టారర్స్ చేయలేదు. ఆయన నెక్స్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ఒక పాత్ర చేస్తున్నారు. దీన్ని ఒక కోణంలో మల్టీస్టారర్ అనుకోవచ్చు.
ఇక 2023 సంక్రాంతికి బాలకృష్ణ-చిరంజీవి బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలపై పరిశ్రమలో భారీ హైప్ ఉంది.