Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి ప్రీమియర్ టాక్... బాలయ్య ఫ్యాన్స్ కి ట్రీట్, హైలెట్స్ ఇవే!

Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి ప్రీమియర్ టాక్... బాలయ్య ఫ్యాన్స్ కి ట్రీట్, హైలెట్స్ ఇవే!

వరుస విజయాలతో జోరుమీదున్న బాలకృష్ణ భగవంత్ కేసరిగా ప్రేక్షకులను పలకరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల కీలక రోల్ చేసింది. కాజల్ హీరోయిన్. అంచనాల మధ్య అక్టోబర్ 19న విడుదలైన భగవంత్ కేసరి ప్రీమియర్ టాక్ ఏంటో చూద్దాం...   

Sambi Reddy | Published : Oct 19 2023, 07:01 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Bhagavanth Kesari Review-Premier Talk

Bhagavanth Kesari Review-Premier Talk

వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ విజయాలు సాధిస్తున్నారు కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, రజినీకాంత్. టాలీవుడ్ స్టార్స్ ఈ విషయంలో లేటుగా మేలుకున్నా స్టార్ట్ చేశారు. భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య పాత్ర అలాంటిదే. పెళ్లీడు కొచ్చిన అమ్మాయికి తండ్రి సమానుడైన పాత్ర చేశాడు. భగవంత్ కేసరి కథ రొటీన్. ఇప్పటికే చాలా సినిమాల్లో ట్రై చేసినదే... 

 

27
Bhagavanth Kesari Review-Premier Talk

Bhagavanth Kesari Review-Premier Talk

అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లకు కష్టం వస్తే... ఎదురుగా ఉన్నది ఎవరైనా తిరగబడే తండ్రి స్టోరీ. భగవంత్ కేసరి తన కూతురు కోసం పెద్దోళ్ళను ఢీకొంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. ప్రత్యర్థులపై ఆయన పోరాటం ఎలా సాగింది అనేది కథ... 
 

37
Bhagavanth Kesari Review-Premier Talk

Bhagavanth Kesari Review-Premier Talk

యూఎస్ లో భగవంత్ కేసరి ప్రీమియర్స్ ముగియగా టాక్ బయటకు వచ్చింది. మెజారిటీ ఆడియన్సు భగవంత్ కేసరి డీసెంట్ ఎమోషనల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఎమోషనల్, కామెడీ సన్నివేశాలతో మొదలవుతుంది. శ్రీలీల-బాలయ్య మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మెప్పిస్తాయి. కామెడీ మాత్రం నిరాశపరిచింది. అంతగా వర్కవుట్ కాలేదు. 
 

47
Bhagavanth Kesari Review-Premier Talk

Bhagavanth Kesari Review-Premier Talk

అయితే ఇంటర్వెల్ కి ముందు సినిమా ఊపందుకుంది. బాలయ్య మీద వచ్చే మాస్ యాక్షన్ బ్లాక్స్ ఫ్యాన్స్ ని మెప్పిస్తాయి. ఈ మధ్యలో మాత్రం సినిమా రొటీన్ కమర్షియల్ డ్రామాలా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కొంచెం బోరింగ్ గా సాగుతుంది. బాలయ్య మాస్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫస్ట్ హాఫ్ లో అలరించే అంశాలు... 
 

57
Bhagavanth Kesari Review-Premier Talk

Bhagavanth Kesari Review-Premier Talk

సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌడ్ ఎపిసోడ్స్ తో మొదలవుతుంది. ఇది కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సాగుతుంది. బాలికలకు అవసరమైన బాడ్ టచ్ గుడ్ టచ్ పై అవగాహన కల్పించే సన్నివేశాలు కూడా ఈ సినిమాలో జోడించారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన గత చిత్రాలకు భిన్నంగా ఎమోషన్స్, మాస్ ఎలివేషన్స్ మీద ఫోకస్ పెట్టాడు. 
 

67
Bhagavanth Kesari Review-Premier Talk

Bhagavanth Kesari Review-Premier Talk

అనిల్ రావిపూడి చిత్రాల్లో కామెడీ కోణం ఎక్కువ ఉంటుంది. ఇందులో తగ్గించాడు. బాలయ్యను కొత్తగా ప్రజెంట్ చేశాడనే మాట వినిపిస్తోంది. డైలాగ్స్ మరీ ఓవర్ గా కాకుండా సెటిల్డ్ గా ఉన్నాయని ఆడియన్స్ అభిప్రాయం. థమన్ బీజీఎం ఓకే, సాంగ్స్ నిరాశపరిచాయి. కాజల్ పాత్రకు పెద్దగా స్పేస్ లేదని తెలుస్తుంది. శ్రీలీల కీలకమైన రోల్ లో చాలా వరకు మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
 

77
Bhagavanth Kesari Review-Premier Talk

Bhagavanth Kesari Review-Premier Talk


మొత్తంగా భగవంత్ కేసరి డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఎమోషనల్, మాస్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి ట్రీట్. రొటీన్ స్టోరీ కావడంతో పాటు అక్కడక్కడా బోరింగ్ గా సాగుతుంది. కామెడీ వర్క్ అవుట్ కాలేదు. అయితే బాలయ్య డైలాగ్, యాక్షన్ ఎపిసోడ్ మెప్పిస్తాయి.. ఈ దసరాకు ఓ సారి ట్రై చేయొచ్చని అంటున్నారు... 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories