- Home
- Entertainment
- `తానా`లో బాలకృష్ణ హల్‌చల్.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదుగా సత్కారం..
`తానా`లో బాలకృష్ణ హల్‌చల్.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదుగా సత్కారం..
హీరో బాలకృష్ణ.. `తానా` వేడుకల్లో పాల్గొన్నారు. ఆమెరికాలో జరిగిన వేడుకలో ఆయన గెస్ట్ గా పాల్గొని సందడి చేశారు. ఆయన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సత్కరించడం విశేషం.

`తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా`(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 23వ మహాసభలు మూడు రోజులపాటు జరుగుతున్నాయి. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. దీనికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌లతోపాటు బాలకృష్ణ హాజరయ్యారు. ఇందులో నిర్మాత దిల్‌రాజు కూడా పాల్గొనడం విశేషం. యాంకర్ సుమ ఈ మహాసభలను హోస్ట్ చేశారు.
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జులై 7, 8, 9తేదీల్లో మూడు రోజులపాటు ఈ తానా మహాసభలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో బాలయ్య పాల్గొని సందడి చేశారు. ఆయన స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇందులో బాలకృష్ణని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సత్కరించడం విశేషం.
ఆయనతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ని సైతం వేదికపై వెంకయ్య నాయుడు సత్కరించారు. అందులో ఎన్‌ఆర్‌ఐలతో కలిసి వీరంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ తెలుగు వారు ఎక్కడ ఉన్న ఒక్కటే అని తెలిపారు.
23వ తానా మహాసభల్లో బాలకృష్ణ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచే ఎన్‌ఆర్‌ఐలు ఆయనకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు, వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమెరికాలోని `తానా` మహాసభల ప్రాంగణంలో బాలకృష్ణతో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఫోటోలకు పోజులిస్తూ సందడి.
బాలకృష్ణ ప్రస్తుతం `భగవంత్ కేసరి` చిత్రంలో నటిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో ఇక్కడి ఓ నాయకుడి కథతో ఈ చిత్రం రూపొందుతుంది. అనిల్ రావిపూడి దర్శకుడు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీలీల ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం దసరాకి రిలీజ్ కాబోతుంది.