MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలయ్య, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లను కాపాడిన పాప.. అదృష్టం అంటే నందమూరి హీరోలదే!

బాలయ్య, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లను కాపాడిన పాప.. అదృష్టం అంటే నందమూరి హీరోలదే!

నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ సినిమాలు వరుసగా విజయాలు సాధించాయి. దీంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. అయితే ఈ ముగ్గురి సినిమాల సక్సెస్‌కి ఒక్కటే కారణం కావడం విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 09 2022, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలకృష్ణ(Balakrishna), ఎన్టీఆర్‌(NTR), కళ్యాణ్‌ రామ్‌(Kalyan Ram) ఇప్పుడు వరుసగా విజయాలు సాధించారు. `అఖండ`(Akhanda)తో బాలయ్య, `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR)తో ఎన్టీఆర్‌, `బింబిసార`(Bimbisara)తో కళ్యాణ్‌ రామ్‌ విజయాలు అందుకున్నారు. ఎన్టీఆర్‌ మినహాయిస్తే బాలయ్య, కళ్యాణ్‌ రామ్‌ వరుస పరాజయాల అనంతరం విజయాలు సాధించి ఫామ్‌లోకి వచ్చారు. నందమూరి ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇదిలా ఉంటే ఈ ముగ్గురి హీరోల సినిమాలకు సేమ్‌ కనెక్షన్‌ ఉంది. యాదృశ్చికంగా ఈ ముగ్గురి హీరోలను కాపాడింది ఒకే ఎలిమెంట్‌ కావడం విశేషం. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమవుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నందమూరి హీరోల్లో మొదట హిట్‌ కొట్టింది బాలయ్య. ఆయన గతేడాది డిసెంబర్ `అఖండ` సినిమాతో హిట్‌ కొట్టాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 17న విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. కరోనాతో విలవిలలాడుతున్న ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసింది. తర్వాత అనేక పెద్ద చిత్రాలకు ధైర్యాన్నిచ్చింది. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది పాప ఎలిమెంట్‌ కావడం విశేషం. 
 

37

బాలయ్య ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రంలో ఓ బాలయ్య కూతురిని కాపాడేందుకు మరో బాలయ్య(అఖండ) బయటకు రావడంతో అసలు కథ నడుస్తుంది. ఆ తర్వాత ఆ పాప కారణంగానే ఆయన శత్రువులతో పోరాడటం, వారిని తుదిముట్టించడం జరుగుతుంది. సెకండాఫ్‌ మొత్తం ఆ పాప చుట్టూతే జరుగుతుంది. పాప సెంటిమెంట్‌ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. 
 

47

ఎన్టీఆర్ నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌`లో కూడా పాప సెంటిమెంటే హైలైట్‌. పాప కోసమే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కొట్టుకోవడం, బ్రిటీష్‌ వారిని ఎన్టీఆర్‌ ఎదురించి వారిని తుదముట్టించడం జరుగుతుంది. పాప సెంటిమెంటే సినిమాకి ప్రధాన బలం. ఆడియెన్స్ సినిమాకి కనెక్ట్ అవ్వడంలో అది ముఖ్య భూమిక పోషించారు. 

57

ఇంకా చెప్పాలంటే `ఆర్‌ఆర్‌ఆర్‌` హిట్‌ కావడంలో పాప సెంటిమెంటే ప్రధాన కారణంగా చెప్పాలి. ఆ పాపే సినిమాని కాపాడిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్‌ ఆ పాప కోసం పదే తాపత్రయం, వారి మధ్య సెంటిమెంట్‌ ఆడియెన్స్ హృదయాలకు బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాలో ఎమోషన్స్ పండేలా చేసింది. సినిమాని అఖండ విజయం సాధించేలా చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషించారు. 

67

ఇటీవల కళ్యాణ్‌ రామ్‌ `బింబిసార` చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఇందులోనూ కీలక భూమిక పోషించింది పాప. కళ్యాణ్‌ రామ్‌ ప్రాణాలు కాపాడి, ఆయన్ని మంచిగా మార్చడమే `బింబిసార`లో మెయిన్‌ ఎలిమెంట్‌. ఆ విషయంలో పాపే సెంటిమెంట్‌ హైలైట్‌. ఆ పాప మీద ప్రత్యేకంగా పాట కూడా ఉండటం విశేషం. ఆ పాపే కళ్యాణ్‌ రామ్ని కాపాడిందని చెప్పాలి.

77

మొత్తంగా మూడు సినిమాల విజయాలకు పాప సెంటిమెంట్‌నే సక్సెస్‌ ఎలిమెంట్‌గా నిలవడం విశేషం. మూడు సినిమాలకు కామన్‌ ఎలిమెంట్ గా ఉన్న `పాప`.. ఈ ముగ్గురు నందమూరి హీరోల సినిమాలకు సక్సెస్‌ మంత్రంగా నిలిచింది. వారికి విజయాలను అందించింది. ఫెయిల్యూర్‌లో ఉన్న వారికి నూతనోత్సాహన్నిచ్చింది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Recommended image2
Naga Vamsi: ఆడపిల్ల శాడిజం చూపించడం వల్లే బ్లాక్ బస్టర్ అయింది.. ప్రపంచాన్ని ఊపేసిన మూవీపై నాగవంశీ రివ్యూ
Recommended image3
Dhanush political entry: విజయ్ బాటలోనే ధనుష్ రాజకీయం... జెండా ఆవిష్కరించిన అభిమాన సంఘం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved