MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ హీరోయిన్ మోజులో హీరో బాలయ్య ... డైరెక్టర్ వద్దంటున్నా ఆమెనే కావాలంటున్నాడా, మేటర్ అదేనా?

ఆ హీరోయిన్ మోజులో హీరో బాలయ్య ... డైరెక్టర్ వద్దంటున్నా ఆమెనే కావాలంటున్నాడా, మేటర్ అదేనా?

బాలకృష్ణ నెక్స్ట్ మూవీకి క్యాస్టింగ్ జరుగుతుందట. హీరోయిన్ గా బాలకృష్ణ ఓ హీరోయిన్ ని సూచించాడట. డైరెక్టర్ వద్దు, ఇంకో హీరోయిన్ ని తీసుకుందాం అంటున్నా... వద్దు ఆమెనే కావాలి అంటున్నాడట.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 13 2024, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


బాలకృష్ణ ఫుల్ హ్యాపీ. ఆయన కెరీర్ గాడిన పడింది. ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ఈ జోష్ లో చకచకా NBK 109 షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
 

27

కాగా అఖండ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన బాలకృష్ణ హ్యాట్రిక్ పూర్తి చేయడం విశేషం. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి సూపర్ హిట్ అయ్యింది. అలాగే భగవంత్ కేసరి చిత్రంతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్య వరుసగా మూడు విజయాలు సాధించి దశాబ్దాలు అవుతుంది.

37
Balakrishna

Balakrishna


కాగా బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ కొత్త మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న 4వ చిత్రం ఇది. అందుకే BB4 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇది అఖండ సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. స్క్రిప్ట్ పూర్తి చేసి బోయపాటి సిద్ధంగా ఉన్నాడు. 
 

47


బాలయ్య-బోయపాటిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. సింహ చిత్రానికి గానూ ఫస్ట్ చేతులు కలిపారు. ఆ మూవీ మంచి విజయం అందుకుంది. అనంతరం వచ్చిన లెజెండ్, అఖండ సైతం భారీ విజయాలు రాబట్టాయి. అఖండ బాలయ్యకు చాలా ప్రత్యేకం. అందుకు కారణం... బాలయ్య కెరీర్ పూర్తిగా సందిగ్ధంలో పడిన సమయంలో అఖండ కాపాడింది. 
 

57

అసలు బాలయ్య మార్కెట్ దారుణంగా పడిపోయింది. పది కోట్ల వసూళ్లు కూడా కష్టం అయ్యాయి. ఇక బాలయ్య పని అయిపోయిందనుకుంటున్న తరుణంలో అఖండ ఊపిరి పోసింది. అందుకే ఈ సినిమా బాలయ్యకు చాలా ప్రత్యేకం. ఇక అఖండ సినిమాలో నటించిన చాలా మంది నటులు అఖండ 2కి కూడా కంటిన్యూ అవుతారట.

67

అయితే హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ని బదులు మరొకరిని తీసుకుందామని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నాడట. బాలయ్య అందుకు ఒప్పుకోలేదట. ప్రగ్యా జైస్వాల్ నే కొనసాగిద్దాం అన్నాడట. బాలయ్యతో ఎవరూ వాదించలేరు కాబట్టి... బోయపాటి కూడా ఓకే చేశాడట. ప్రగ్యా జైస్వాల్ మీద బాలయ్యకు అంత ఇంట్రెస్ట్ ఏమిటనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.. 
 

77
photo credit - vega sri ad

photo credit - vega sri ad


దీనికి పెడర్థాలు తీయాల్సిన అవసరం లేదు. బాలయ్యకు సెంటిమెంట్స్ ఎక్కువ. అందుకే ప్రగ్యా జైస్వాల్ కోసం పట్టుబట్టాడని అంటున్నారు. బాలయ్య తాను నటించిన ఓ జ్యువెలరీ యాడ్ కి కూడా ప్రగ్యా జైస్వాల్ ని రికమెండ్ చేశాడు. అయితే ప్రగ్యా జైస్వాల్ అసలు ఫార్మ్ లో లేదు. ఆఫర్స్ లేక ఆమె ఖాళీగా ఉంది. ఇలాంటి సమయంలో అఖండ 2లో ఆమెకు ఛాన్స్ అంటే బంపర్ ఛాన్స్ కొట్టినట్లే... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved