డైరెక్టర్ వేణు ముందే 'బలగం' చిత్రాన్ని కామెడీ చేసేశారుగా.. ఎమోషనల్ సీన్ తో ఇలా అపహాస్యం
ఈ ఏడాది టాలీవుడ్ అతి పెద్ద సర్ప్రైజ్ అంటే 'బలగం' చిత్రం అనే చెప్పాలి. ఏ మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా మాజీ జబర్దస్త్ హాస్య నటుడు వేణు దర్శకుడుగా ఇలాంటి చిత్రం ఒకటి తెరకెక్కిస్తున్నారు అని ఎవరికీ తెలియదు.
ఈ ఏడాది టాలీవుడ్ అతి పెద్ద సర్ప్రైజ్ అంటే 'బలగం' చిత్రం అనే చెప్పాలి. ఏ మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా మాజీ జబర్దస్త్ హాస్య నటుడు వేణు దర్శకుడుగా ఇలాంటి చిత్రం ఒకటి తెరకెక్కిస్తున్నారు అని ఎవరికీ తెలియదు. తెలంగాణ గ్రామాల్లో ఉన్న బంధాలు, పల్లెటూరి ప్రజలు.. మరణం తర్వాత ఉండే ఆచార వ్యవహారాల్ని దర్శకుడు వేణు ఎల్దండి కళ్ళకి కట్టినట్లు చూపించారు.
ఈ చిత్రం చూసి కంటతడి పెట్టని ప్రేక్షకులు అంటూ లేరు. క్లయిమాక్స్ తో ఈ చిత్రాన్ని హృదయానికి హత్తుకునే విహంగా ఎంతో ఎమోషనల్ గా ముగించారు. ఈ చిత్రం గ్రామాల్లోకి కూడా చొచ్చుకుని పోయింది. మారుమూల గ్రామాల్లో సైతం ఈ చిత్రాన్ని ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ బలగం ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చిత్రానికి అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా వస్తున్నాయి.
ఇదిలా ఉండగా దర్శకుడు వేణు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి అతిథిగా హాజరయ్యారు. శ్రీదేవి డ్రామా కంపెనీషోలో హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, యాంకర్ రష్మీ, ఇంద్రజ, రోహిణి ఈ షోలో కామెడీతో పెద్ద హంగామానే చేశారు. హైపర్ ఆది, బులెట్ భాస్కర్ లాంటి వాళ్ళు కామెడీ పంచ్ లు వేస్తుంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో వీరి కామెడీ నవ్వించే విధంగా ఉంది. అయితే ఎంచుకున్న స్కిట్ మాత్రం నెటిజన్లకు అంతగా నచ్చడం లేదు. బలగం చిత్రంలోని సన్నివేశాల పేరడీతో హైపర్ ఆది, తాగుబోతు రమేష్, బుల్లెట్ భాస్కర్ కామెడీ చేశారు. ఇది కొందరు నెటిజన్లకు నచ్చడం లేదు. అది కూడా బలగం దర్శకుడు వేణు ముందే వాళ్ళు కామెడీ చేశారు.
బలగం చిత్రంలో కొమరయ్య మరణించే సన్నివేశాలు,ఆ తర్వాత కాకికి పిండం పెట్టే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఆ సన్నివేశాలనే శ్రీదేవి డ్రామా కంపెనీలో అపహాస్యం చేశారు. ఈ స్కిట్ లో హైపర్ ఆది, తాగుబోతు రమేష్, భాస్కర్ ప్రధానంగా నటించగా.. యాంకర్ రష్మీ కూడా పాల్గొంది. చివర్లో బలగం తరహాలో జబర్దస్త్ ప్రవీణ్ పాట పడుతూ హైపర్ ఆది, రష్మీ ఇలా ఒక్కొక్కరి గురించి కామెడీగా వివరించి అలరించాడు.
రష్మీ గురించి పాట పాడుతూ.. గాలోడు గాలోడు అంటే గాలికి పోయాడు.. ఈమె ఇక్కడే ఉండిపోయింది అంటూ ప్రవీణ్ నవ్వించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ పూర్తి ఎపిసోడ్ ఏప్రిల్ 30న ప్రసారం కానుంది. బలగం చిత్రంలో నటించిన ప్రతి నటీనటులకు మంచి గుర్తింపు దక్కింది.