`బేబీ` రేటింగ్ కేక, `మ్యాడ్`కి క్రేజీ రెస్పాన్స్, `సగిలేటి కథ` చికెన్ సాంగ్, `రాక్షసరాజ్యం` అసలు కథ ఇదే..
`బేబీ` మూవీ టీవీ రేటింగ్‌లో దుమ్ములేపింది. `మ్యాడ్`కి రెస్పాన్స్ క్రేజీగా ఉంది. మరోవైపు `సగిలేటి కథ` నుంచి చికెన్ సాంగ్ వచ్చింది. `రాక్షసరాజ్యం` రిలీజ్‌కి రెడీ అవుతుంది.
ఇటీవల కాలంలో లవ్ స్టోరీస్‌లో సంచలనం సృష్టించిన చిత్రం `బేబీ`. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకుడు. ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలచింది. అయితే తాజాగా ఇది టీవీలో ప్రీమియర్ అయ్యింది. ఓటీటీలో దుమ్ములేపిన ఈ చిత్రం టీవీలో 5.67, 5.8 రేటింగ్స్ రావడం విశేషం. దీంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.
ప్రముఖ నిర్మాతసూర్య దేవర నాగవంశీ నిర్మించిన `మ్యాడ్` చిత్రం నేడు విడుదలైంది. ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే ముఖ్య పాత్రలో, రామ్ నితిన్, సంగీత్ శోభన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్‌దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నేడు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. టైటిల్ కి తగ్గట్టుగానే క్రేజీ రెస్పాన్స్ వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు నిర్మాత నాగవంశీ. ఇందులో టీమ్ అంతా పాల్గొని తమ సంతోషాన్ని వెల్లడించారు. హీరోలుగా తొలి ప్రయత్నానికి ఇంతటి రెస్పాన్స్ రావడం పట్ల వారంతా ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు హీరో నవదీప్ సమర్పణలో రూపొందిన `సగిలేటి కథ` చిత్రం నుంచి `చికెన్ సాంగ్` ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకులుసాయి రాజేష్, వెంకటేష్ మహా, సందీప్ రాజ్ గెస్ట్ లుగా వచ్చి ఈ పాటని విడుదల చేశారు. సినిమా విజయంపట్ల వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇందులో రవి మహా దాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటించగా, రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్‌లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. తాజాగా విడుదలైన పాటకి విశేషం స్పందన లభిస్తుందని టీమ్ వెల్లడించింది. రాయలసీమ పల్లె నేపథ్యంలో ఈ చిత్రంలోని కథ సాగుతుందని, చాలా రియలిస్టిక్‌గా ఉంటుందన్నారు.
చిన్నసినిమాలకు మళ్లీ ఊపొచ్చింది. పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు క్యూ కడుతున్నాయి. అందులో భాగంగా వచ్చే వారం `రాక్షస కావ్యం` అనే సినిమా కూడా రాబోతుంది. ఇందులో అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్‌రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కాబోతుంది.
సినిమా గురించి నిర్మాత శింగనమల కళ్యాణ్ చెబుతూ, `రాక్షస కావ్యం” సినిమా కథ సహజంగా ఉంటూ..రా అండ్ రస్టిక్ గా సాగుతుంది. ఎక్కువ మెలోడ్రామా చూపించడం లేదు. మనం రియల్ లైఫ్ లో చూసేదానికి దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా దిగువ మధ్య తరగతికి చెందిన మనుషులు, బస్తీల్లో ఉండేవాళ్ల మైండ్ సెట్, జీవన విధానం మూవీలో కనిపిస్తుంది. అక్కడ తాగుడుకు బానిసై పిల్లలను చదివించకుండా పనికి పంపిస్తుంటారు. ఈ కథలో విలన్స్ గెలవాలి. ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి అనే కామెడీ పాయింట్ కూడా కొత్తగా ఉంటుంది. మన సినిమాల్లో విలన్స్ ను ఎలా తక్కువ చేసి చూపిస్తున్నారు. హీరోలను ఎలా హైప్ చేస్తున్నారు అని చెప్పే సరదా సీన్స్ కూడా ఉంటాయి. ఈ కథకు పురాణాల్లోని ఓ సందర్బం రిలేట్ అయి ఉంటుంది` అని తెలిపారు నిర్మాత.