MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నవ్వించడమే మేం చేసిన పాపమా?.. కోటా శ్రీనివాసరావుతో గొడవపై బాబుమోహన్‌ షాకింగ్‌ కామెంట్స్

నవ్వించడమే మేం చేసిన పాపమా?.. కోటా శ్రీనివాసరావుతో గొడవపై బాబుమోహన్‌ షాకింగ్‌ కామెంట్స్

కమెడియన్‌ బాబుమోహన్‌ తన జీవితంలో చోటు చేసుకున్న విషాదం గురించి ఓపెన్‌ అయ్యారు. నవ్వించడం పాపమా అంటూ ఎమోషనల్‌ అయ్యారు. కోటతో గొడవ గురించి మాట్లాడారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jul 15 2024, 09:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాబుమోహన్‌ కమెడియన్‌ దాదాపు వెయ్యి చిత్రాల్లో నటించారు. హీరోగానూ సినిమాలు చేసి మెప్పించాడు. బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. రాజకీయాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణించారు. ఇప్పుడు ఆయన చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. కమెడియన్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో బాబు మోహన్‌ సీరియస్‌ పాత్రలకు పరిమితమవుతున్నారు. పొలిటికల్‌ లీడర్‌ తరహా పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ పాత్ర ఏదైనా తన బెస్ట్ ఇస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు బాబుమోహన్‌. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

లేటెస్ట్ గా ఆయన తన జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనల గురించి మాట్లాడారు. కోట శ్రీనివాసరావుతో గొడవల గురించి ఓపెన్‌ అయ్యారు. తన స్నేహితుడు, సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావుతో గొడవలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ, మొగుడు పెళ్లాలకే గొడవలు వస్తాయి. ఇంట్లో అన్నాదమ్ముళ్లకే వస్తాయి, అన్నా చెళ్లెళ్లకి వస్తాయి, తండ్రి కొడుకులకు గొడవలు వస్తాయి. అవన్నీ సహజమే అని చెప్పారు బాబుమోహన్‌. 
 

36

గొడవలు టెంపరరీ, మనుషులం అన్నాక గొడవలు కామన్‌ అని చెప్పాడు బాబుమోహన్‌. `మనుషులన్నాక అన్ని టెంపర్‌మెంట్లు ఉంటాయి, ఉండకూడదని లేదు కదా. కౌరవులు, పాండవుల్లో కూడా గొడవలు జరిగాయ`ని చెప్పారు బాబు మోహన్‌. అయితే తమ మధ్య ఏ గొడవ ఉన్నా, అది అప్పటి వరకే అని, వెంటనే కలిసిపోతామని, తమ దృష్టి ఎప్పుడు వర్క్ పైనే ఉంటుందన్నారు. 
 

46

కోట శ్రీనివాసరావు నేను, ఒకే ప్లేట్‌లో భోజనం చేసేవాళ్లమని, షూటింగ్‌ సమయంలో చెరో రూమ్‌లో ఉంటే కూడా, నా రూమ్‌కి ఆయన రావడమో, ఆయన రూమ్‌కి నేను వెళ్లడమో, ఆయన భోజనం నేను చేయడమో, నా భోజనం ఆయన చేయడమో చేసేవాళ్లమని, అంతగా కలిసిపోయి ఉండేవాళ్లమని, కొందరు నిర్మాతలు రెండు రూమ్‌లు ఎందుకు సర్‌, అద్దె దండగా అనేవాళ్లు. ఎక్కువగా పనిలోనే కలిసిపోయేవాళ్లమని, క్యారెక్టర్‌  ఎంత బాగా చేయాలని, కోట అన్నకి తగ్గకుండా ఎలా చేయాలి, అలాగే బ్రహ్మానందంకి తగ్గకుండా ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఇవ్వాలనేదే తమ మధ్య ఉండేదని, కానీ గొడవలకు ప్రయారిటీ ఇచ్చేవాళ్లం కాదు అని చెప్పారు బాబు మోహన్‌. నటనలో పోటీ పడేవాళ్లమని, గొడవలు పడే టైమ్‌ ఉండేది కాదని, చిన్నచిన్నవి ఉన్నా, అవి వెంటనే సరి చేసుకునేవాళ్లమన్నారు బాబుమోహన్‌.
 

56

ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు, తన జీవితంలోని విషాదాల గురించి చెబుతూ, ఇద్దరి జీవితాల్లో ఒకేలా ఘటనలు చోటు చేసుకున్నాయని, తన పెద్ద బాబు(పవన్‌ కుమార్‌) బైక్‌పై వెళ్తుంటే చిన్నబాబు కారులో వెనకాలే ఉన్నాడని, అలాగే కోట కొడుకు బైక్‌పై వెళ్తుంటే వారి ఫ్యామిలీ వెనకాలే ఉందని, వాళ్ల కళ్ల ముందే ఈ దుర్ఘటలు చోటు చేసుకున్నాయని తెలిపారు. తమ ఇద్దరి ఇళ్లు పక్క పక్కనే అని, ఈ ఘటనలు కూడా తమ ఇంట్లోనే జరిగాయన్నారు. మా ఇద్దరికి కడుపు కోత ఇంకా మర్చిపోలేని దారుణం, కరుడు గట్టిన చర్యగా అభివర్ణించారు బాబు మోహన్‌. నవ్వించడం మేం చేసిన పాపమా? మేం లక్షలాది, కోట్లాది మందిని నవ్వించినందుకు ఇంత నవ్విస్తార్రా అని ఆ దేవుడు మాకు వేసిన శిక్షణేమో, అంటూ ఎమోషనల్‌ అయ్యారు బాబు మోహన్‌. `ట్రీ మీడియా`కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 

66

బాబుమోహన్‌ పెద్దకుమారుడు పవన్ కుమార్‌ 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అలాగే కోట శ్రీనివాసరావు కొడుకు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్‌ 2010లో రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు. ఇద్దరు బైక్ పై ప్రయాణిస్తున్న క్రమంలోనే రోడ్డు ప్రమాదానికి గురి కావడం విచారకరం. బాబుమోహన్‌కి మరో కొడుకు ఉదయ్ కుమార్ ఉన్నాడు. కోటకి ఒక్క కొడుకు చనిపోవడం అత్యంత విచారకరం. ఇద్దరు స్నేహితుల జీవితాల్లోనూ ఈ ఘటనలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. నవ్వులు పూయించారు. టాలీవుడ్‌లో వీరిద్దరి బెస్ట్ జోడీగా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved