- Home
- Entertainment
- రోజా ఎట్టి పరిస్థితుల్లో మంత్రి కాకూడదని ఆ నటి కుట్ర.. నింద వేస్తూ రాంప్రసాద్ షాకింగ్ కామెంట్స్
రోజా ఎట్టి పరిస్థితుల్లో మంత్రి కాకూడదని ఆ నటి కుట్ర.. నింద వేస్తూ రాంప్రసాద్ షాకింగ్ కామెంట్స్
తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేశారు. ఎప్పటిలాగే ఈ ప్రోమో కామెడీ పంచ్ లతో ఆకరిస్తోంది. ప్రేక్షకులని అలరించేందుకు స్కిట్ లో వివిధ ప్రయోగాలు చేస్తున్నారు.

జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్ లతో వీళ్ళు అదరగొడుతుంటారు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ స్కిట్ పడిందంటే మిలియన్ల కొద్దీ వ్యూస్ రావలసిందే. కానీ ఇటీవల సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ని విడిచిపెట్టి వెళ్లిన సంగతి తెలిసిందే.
గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ కి దూరం కావడంతో ప్రస్తుతం ఆటో రాంప్రసాద్ ఒంటరైపోయాడు. వీరు ముగ్గురూ ప్రాణ స్నేహితులుగా కొనసాగారు. కానీ ఎవరి కెరీర్ పై వాళ్ళు ద్రుష్టి పెట్టడంతో తలో దిక్కు వెళ్లారు. ప్రస్తుతం రాంప్రసాద్ మాత్రమే ఎక్స్ట్రా జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు.
తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేశారు. ఎప్పటిలాగే ఈ ప్రోమో కామెడీ పంచ్ లతో ఆకరిస్తోంది. ప్రేక్షకులని అలరించేందుకు స్కిట్ లో వివిధ ప్రయోగాలు చేస్తున్నారు. ఇమ్మాన్యూల్, వర్ష జంట ప్రేమికులుగా నటించి నవ్వులు పూయిస్తున్నారు.
ఇక ప్రోమో చివర్లో ఆటో రాంప్రసాద్, బులెట్ భాస్కర్ లని ఇంద్రజ కాంట్రవర్సీ ప్రశ్నలు అడుగుతోంది. ఇంద్రజ బులెట్ భాస్కర్ ని ప్రశ్నిస్తూ.. మీ టీం లో ఒక పెద్దాయన కో లీడర్ గా ఉండేవారు.. నువ్వు తొక్కేయడం వెళ్లే ఆయన జబర్దస్త్ నుంచి వెళ్లి పోయారు కదా అని ప్రశ్నించింది. చాలా రోజులుగా ఈ ప్రశ్న నాకు ఎదురవుతోంది. స్పందించకూడదు అనుకున్నా. కానీ దీనికి నేను సమాధానం చెబుతా అని భాస్కర్ తెలిపాడు.
భాస్కర్ ఎం చెప్పాడు అనేది 17న ప్రసారం కాబోయే ఫుల్ ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఇక ఇంద్రజ.. ఆటో రాంప్రసాద్ ని కూడా ప్రశ్నించింది. నువ్వు స్కిట్ లో సరిగా రాయకపోవడం వల్లే మీ టీం మెంబర్స్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారని అంటున్నారు. నిజమేనా అని ప్రశ్నించింది. దీనికి రాంప్రసాద్ ఎం చెప్పదనేది కూడా ఎపిసోడ్ లోనే చూడాలి.
ఇక చివర్లో రాంప్రసాద్ ఇంద్రజానే ప్రశ్నిస్తూ వివాదానికి తెరలేపాడు. రాంప్రసాద్ వేసిన ప్రశ్న రోజాపై ఇంద్రజకు కుట్ర ఉందనే అనుమానాలు కలిగించేలా, ఆ అర్థం వచ్చేలా ఉంది. మీకు కూడా ఒక ప్రశ్న.. రోజా గారు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి కాకూడదు అని రోజు దేవుడిని ప్రార్ధించారు అట కదా అని అడిగేసాడు. ఈ ప్రశ్నపై వీళ్లిద్దరి మధ్య వివాదం ఏమైనా చెలరేగిందా అనేది జూన్ 17న ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో చూడాలి.