విదార్ధులకు శుభవార్త.. ఈనెలలో మరో 3 రోజులు సెలవులు.. ఎప్పుడంటే..?
రోజు స్కూల్ అంటే బోర్.. సెలవొస్తే బాగుండు అనుకుంటున్న స్టూడెంట్స్ ఈ నెలలో పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే వరుస సెలవులు రాగా.. మరో రెండు రోజులు వరుసగా సెలవులు రాబోతున్నాయి. ఎప్పుడు..? ఎందుకంటే..?
స్కూల్ కు వెళ్లే విద్యార్ధులు సెలవు వచ్చిందంటే ఎగిరి గంతేస్టుంటారు. ఉన్న కాస్త హోమ్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఎంచక్క ఆడుకోవచ్చు అనుకుంటారు. లేదా ఎక్కువ రోజులు సెలవొస్తే ఊరెళ్ళిరావచ్చు అని ఆశపడుతుంటారు. ఇల సెలవు రోజుల్లో రకరకాలుగా ప్లాన్ చేసుకుంటుంటారు స్టూడెంట్స్. వారి కోరికను మించి సెలవులు వస్తే..? వరుసగా హాలీవుడ్ వచ్చి సర్ ప్రైజ్ ఇస్తే.. ఆనందానికి హద్దులు ఉండవు మరి.
ఇక ఈ ఆగస్ట్ నెల స్టూడెంట్స్ కు పండగ నెల అనుకోవచ్చు. ఈనెలలో వరుసగా సెలవులు రావడంతో దిల్ ఖుష్ అవుతున్నారు విద్యార్థులు. ఇప్పటికే ఈనెలలో వరుసగా 5 రోజుల సెలవులు వచ్చాయి. ఆగస్టు 15 నుంచి.. 19 వరకు వరుసగా సెలవులు రావడంతో.. స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేశారు. వరుసగా పండగలు రావడంతో ఈ రోజుల్లో ఫ్యామిలీతో సరదాగా గడిపేశారు విద్యార్ధులు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, 16, వరలక్ష్మి వ్రతం, 17 శనివారం, 18 ఆదివారం, 19 రాఖీ పండుగ రావడంతో.. వరుసగా సెలవులు వచ్చాయి.
All So Read: ఇండియాలో చిట్టి చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? దాని ప్రత్యేకతలివే..?
ఈమధ్యలో 17న శనివారం కొన్ని స్కూల్స్ హాలీడే ప్రకటిస్తే.. మరికొన్ని స్కూల్స్ ఓపెన్ ఉన్నా.. ఎక్కువగా ఆప్సెట్స్ ఉన్నాయట. ఇక ఈ ఐదురోజులు సెలవులు అయిపోతడంతో.. ఈరోజు (అగస్ట్ 20) స్కూల్ కు వెళ్లాలంటే.. చాలా భారంగా ఫీల్ అవుతున్నారు విద్యార్దులు. అంతలో హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా.. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో స్కూల్స్ కు ఈరోజు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
ఇది కాక రేపు అంటే 21వ తారీకుసెలవు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. భారత్ బంద్ వల్ల 21న విద్యా సంస్థలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఇదే వారంలో విద్యార్ధులకు మరో రెండు రోజులు సెలవులు రాబోతున్నాయి. ఆగస్టు 25, 26న విద్యా సంస్థలకు సెలవులు ఉన్నాయి.
ఆగస్టు 25 ఆదివారం సెలవుదినం కాగా.. ఆగస్టు 26 పోమవారం కృష్ణాష్టమి కారణంగా సెలవు రాబోతోంది. దాంతో స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇవ్వబోతున్నారు.ఈనెల అగస్ట్ స్పెషల్ హాలీడేస్ మన్త్ గా ఈ ఏడాది నిలిచి పోయింది. ఎందుకంటే.. దాదాపు 10 రోజులకు పైగా ఈనెలలో సెలవులు రావడం విశేషం. కాగా వర్షాల కారణంగా అవి పెరిగినా ఆశ్చర్యపరడనక్కర్లేదు.
All So Read: ఇండియాలో చిట్టి చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? దాని ప్రత్యేకతలివే..?
tn school students
ఇక ఆగస్టు నెల మొత్తం మీద స్కూల్స్, కాలేజీలకు 10 రోజులు సెలవులు రావడంతో విద్యార్ధులు ఎగిరి గంతేస్తున్నారు. అటు టీచర్స్ మాత్రం సిలబస్ లు అవ్వడానికి.. టార్గెట్ లు పూర్తి అవ్వడానికి ఇబ్బంది అవుతుందేమో అని భయపడుతున్నారు. కొందరు టీచర్స్ కూడా సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మరో రెండు రోజులు సెలవులను ఎంజాయ్ చేయడానికి స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు.