నాని 'హిట్ 3' షూటింగ్ లో తీవ్ర విషాదం..మహిళా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ మృతి
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో జరుగుతోంది. హిట్ 3 షూటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హిట్ 3 చిత్రం కోసం అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న కెఆర్ కృష్ణ (30) అనే మహిళ మృతి చెందారు.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో జరుగుతోంది. హిట్ 3 షూటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హిట్ 3 చిత్రం కోసం అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న కెఆర్ కృష్ణ (30) అనే మహిళ మృతి చెందారు. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో చిత్ర యూనిట్ మొత్తం విషాదానికి గురైంది. మహిళా సినిమాటోగ్రాఫర్ గా రాణించేలానే ఆదేశంతో కేఆర్ కృష్ణ చిత్ర పరిశ్రమలోకి వచ్చారు.
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 23న కెఆర్ కృష్ణ అస్వస్థతకి గురయ్యారు. దీనితో చిత్ర యూనిట్ ఆమెని శ్రీనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. చెస్ట్ ఇన్ఫెక్షన్ కావడంతో వైద్యులు ఆమెకి చికిత్స అందించారు. ఇన్ని రోజులు కెఆర్ కృష్ణ చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. కృష్ణ కోలుకుంటున్నట్లు కేరళలోని ఆమె కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు.
వైద్యులు ఆమెని జనరల్ వార్డుకి మార్చారు. కానీ సోమవారం రోజు ఊహించని విధంగా కెఆర్ కృష్ణకి గుండెపోటు వచ్చింది. దీనితో ఆమె తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతి ఇటు హిట్ 3 చిత్ర యూనిట్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులలో కూడా తీరని విషాదాన్ని నెలకొల్పింది.
కెరలోని పెరుంబవూర్ ఆమె స్వస్థలం. అక్కడే ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 చిత్రం శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. హిట్ చిత్రం ఒక ప్రాంచైజీగా తెరకెక్కుతోంది. మొదటి భాగంలో విశ్వక్ సేన్ నటించారు. రెండవ భాగంలో అడివి శేష్ నటించారు. ఇప్పుడు 3వ భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి.