`కల్కి 2898 AD`:ఎలక్షన్ రిజల్ట్ పై నాగ్ అశ్విన్ ఒకలా, అశ్వినీదత్ మరొకలా
ఈనెల 13నే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరగనుండగా.. ఓటేసేందుకు జనం ఉత్సాహంగా ఉన్నారు.

aswanidutt
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఏపీలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈనెల 13నే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరగనుండగా.. ఓటేసేందుకు జనం ఉత్సాహంగా ఉన్నారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో సెటిల్ అయిన చాలా మంది ఓటేసేందుకు వెళ్తున్నారు . ఇదిలా ఉంటే సినిమా పరిశ్రమ సైతం చాలా ఉత్సాహంగా ఈ ఎలక్షన్స్ ని గమనిస్తోంది. ఈ క్రమంలో కొందరు బహిరంగంగానే జనసేనకు సపోర్ట్ ప్రకటించి, ప్రచారానికి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూటమికి మద్దతుగా సినీ రంగానికి చెందిన అనేక మంది సెలబ్రిటీలు ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. ఇప్పుడు అశ్వనీదత్ కూడా తెలుగుదేశం పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు.
మరో ప్రక్క ఎలక్షన్స్ రావడంతో ఓటు వేయడానికి కల్కికి పనిచేసే వారు కూడా పోతున్నారు. దీంతో షూటింగ్‌పై ప్రభావం పడింది. తాజాగా, ఈ విషయాన్ని నిర్మాత స్వప్న దత్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అంతేకాకుండా నాగ్ ఆశ్విన్‌తో ఉన్న ఫొటోను కూడా పోస్ట్‌లో పెట్టింది.
కల్కి సినిమాకు సీజ్ వర్క్ చేసేవారు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్నారు అని నాగ్ అశ్విన్ అనగా.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారని స్వప్న అడుగుతుంది. దీనికి డైరెక్టర్.. ఎవరు గెలిచినా నాకు అనవసరం కానీ నా సీజ్ షాట్స్ ఎప్పుడు వస్తాయో అదే నాకు కావాలి అని అంటాడు. ఇదంతా స్వప్న పోస్ట్‌లో వివరించడంతో అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ వైజయంతి బ్యానర్ పై రూ.500 కోట్లతో ‘ప్రాజెక్ట్ కే’ను రూపొందిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. సీ అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్ లోనూ రిలీజ్ చేయబోతున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జూన్ 27న సినిమాని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీగా కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. నాగ్ అశ్విన్ దగ్గరుండి తనకి కావాల్సిన అవుట్ ఫుట్ ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు
నిజానికి మే 10న కల్కి మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి నడుస్తోన్న నేపథ్యంలో రిలీజ్ వాయిదా వేశారు. కల్కి 2898ఏడీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన విశేషాలని స్వప్నదత్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని త్వరలో రిలీజ్ చేయడానికి న నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందంట. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ తోనే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు.
Kalki2898AD
అలాగే మూవీలో ప్రభాస్ రెండు భిన్నమైన క్యారెక్టర్స్ లో కల్కి చిత్రంలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కల్కి 2898ఏడీ మూవీతో సౌత్ సినిమాకి హాలీవుడ్ లో మార్కెట్ గేట్స్ ని ప్రభాస్ ఓపెన్ చేయబోతున్నాడనే మాట వినిపిస్తోంది.
Kalki 2898
దర్శకుడు నాగ్ అశ్విన్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు దాదాపు అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. మరో రెండు వారాల వరకు అదే పని ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రమోషన్ ను పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశ్యంతో మేకర్స్ పాటల విడుదలకు సిద్ధం అవ్వడం లేదని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ వంటి స్టార్స్ ఉన్న కారణంగా కల్కి సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంతే కాకుండా పాన్ వరల్డ్ మూవీ అన్నట్లుగా కూడా ఈ టైమ్ ట్రావెలర్ ను ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 27న ఈ సినిమా విడుదల ఉంటుందని అంటున్నారు.