- Home
- Entertainment
- BiggBoss6-Ott Final List: ఆషురెడ్డి, అరియానా, హమీద, ముమైత్ ఖాన్, అఖిల్.. ఈసారి మసాలా డోస్ అదిరిందిగా
BiggBoss6-Ott Final List: ఆషురెడ్డి, అరియానా, హమీద, ముమైత్ ఖాన్, అఖిల్.. ఈసారి మసాలా డోస్ అదిరిందిగా
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ఓటీటీ ఫైనల్ లిస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో అరియానా, ఆషురెడ్డి, ముమైత్ ఖాన్, హమీద, సరయు వంటి హాట్ భామలు ఎక్కువగా కనిపిస్తున్నారు.

బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన షో. ఇండియాలోనూ విశేష ఆదరణ పొందుతుంది. ఇక తెలుగులో ఇప్పటి వరకు ఐదో షోలు విజయవంతంగా పూర్తయ్యాయి. గతేడాది డిసెంబర్‌లో ఐదో సీజన్ పూర్తికాగా, వీజే సన్నీ విన్నర్‌గా నిలిచారు. ఇక ఆరో సీజన్ కూడా త్వరగానే ప్రారంభమవుతుందని హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఫినాలే రోజునే చెప్పారు.
అన్నట్టుగానే ఫిబ్రవరిలోనే ప్రారంభించబోతున్నారు. ఈ నెల 26 నుంచి ఈ షోని ప్రారంభించబోతున్నట్టు ఇటీవల నిర్వహకులు ప్రకటించారు. ఈ మేరకు ప్రోమోని కూడా విడుదల చేశారు. అయితే ఇది ఓటీటీలో విడుదల కాబోతుండటం విశేషం. `బిగ్‌బాస్ నాన్‌స్టాప్` పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ రియాలిటీ ప్రసారం కానుంది. కాకపోతే ఇది 24 గంటలు ప్రసారం కానుండటం విశేషం.
డైరెక్ట్ గా బిగ్‌బాస్ హౌజ్‌లో ఏం జరుగుతుందో అదే ఓటీటీలో చూపించనున్నారు. చాలా తక్కువ ఫిల్టరింగ్‌తో ఈ షో ప్రసారం కానుంది. ఆడియెన్స్ కి 24గంటలు ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. తెలుగులో తొలిసారి ఇలా ఓటీటీలో ప్రసారం చేస్తుండటం విశేషం. దీంతో ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. అందరు దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే తాజాగా ఓటీటీ బిగ్‌బాస్ 6 తెలుగులో షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ ఇదే అంటూ చక్కర్లు కొడుతుంది.
ఇందులో గ్లామర్ లిస్ట్ చాలా పెద్దగానే కనిపిస్తుంది. గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు సగం వరకు ఉండగా, మరికొందరు కొత్తవారు కనిపిస్తున్నారు. వారిలో ప్రధానంగా అరియానా, ఆషురెడ్డి, అఖిల్, హమీద, సరయు, ధన్‌రాజ్, తనీష్, మహేష్‌విట్టా, ఆదర్శ్, నటరాజ్ మాస్టర్ వంటి వారున్నారు. వీరంతా గత సీజన్లలో వీరంతా పాల్గొన్నారు.
గత ఐదు సీజన్ల నుంచి ఇద్దరిని చొప్పున ఈ ఆరో సీజన్‌కి ఎంపిక చేశారు. దీంతో పది మంది కంటెస్టెంట్లు పాతవారే ఉండబోతున్నారు. అరియానా, ముమైత్ ఖాన్, ఆషురెడ్డి, అఖిల్, హమీద, సరయు, ధన్‌రాజ్, తనీష్, మహేష్‌విట్టా, ఆదర్శ్, నటరాజ్ మాస్టర్ గత సీజన్లలో పాల్గొనే వారే కావడం విశేషం. వీరంతా పదకొండు మంది అవుతున్నారు.
వీరిలో బిగ్‌బాస్ మొదటి సీజన్ నుంచి ముగ్గురు ముమైత్ ఖాన్, ధన్‌రాజ్, ఆదర్శ్ ఉన్నారు. ఇందులో ముమైత్ ఖాన్‌తో గ్లామర్ డోస్ పెంచబోతున్నారు. రెండో సీజన్ బిగ్‌బాస్ నుంచి తనీష్ ని తీసుకుంటున్నారట.
అలాగే బిగ్‌బాస్ మూడో సీజన్ నుంచి మహేష్ విట్టా, జూనియర్ సమంత ఆషురెడ్డిని తీసుకుంటున్నారట. ఇక ఆషురెడ్డి హాట్ డోస్ గురించి తెలిసిందే. ఓటీటీ ఆడియెన్స్ కి పండగే అని చెప్పొచ్చు.
నాల్గో సీజన్ నుంచి బోల్డ్ బ్యూటీ అరియానా, రన్నరప్ అఖిల్ సార్థక్‌లను ఎంపిక చేసినట్టు టాక్. అరియానా చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.
ఐదో సీజన్ నుంచి ముగ్గురుని దించినట్టు టాక్. వారిలో హమీద, సరయు, నటరాజ్ మాస్టర్ ఉన్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. ఐదో సీజన్ నుంచి గ్లామర్ డోస్ గట్టిగానే ఉందని చెప్పొచ్చు.
వీరితోపాటు ఎనిమిది మంది కొత్తవారి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో యాంకర్ శివ, యాంకర్ స్రవంతి, యూట్యూబర్ నిఖిల్, ఆర్జే చైతూ, మోడల్ అనిల్ రాథోడ్, బమ్ చిక్ బబ్లూ, బిగులూ, మోడల్ మిత్రా శర్మ ఉన్నారు. వీరంతా ఆయా రంగాల్లో పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకున్న వారుండటం విశేషం. అయితే ఒకరిద్దరు మినహాయితే వీరంతా ఫైనల్ అయినట్టు టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి.