హీరోయిన్ గా అష్షు రెడ్డి, లక్కీ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర బ్యూటీ..
లక్కీ ఛాన్స్ కొట్టేసింది బుల్లి తెర బ్యూటీ అష్షు రెడ్డి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తన కలను నెరవేర్చకుంది. సిల్వర్ స్క్రీన్ పై అందాల ఆరబోతుకు రెడీ అవుతోంది.
అష్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ సమంతగా.. ఆమె ఇమేజ్ ఆమెకు ఉంది. బిగ్ బాస్ కు వెళ్లడంతో .. స్మాల్ స్క్రీన్ పై వరుస ఆఫర్లు సాధించింది. స్పెషల్ షోస్ తో దడదడలాడించింది. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది బ్యూటీ.
Ashu Reddy
మరో వైపు... వెండితెర ప్రయత్నానలో భాగంగా.. సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోయడం మొదలు పెట్టింది అష్షు రెడ్డి. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుని.. సిల్వర్ స్క్రీన్ వరకూ రీచ్ అవ్వాలని ప్లార్ చేసింది. ఇక ఎట్టకేలకు అనుకున్నది సాధించింది అష్షు రెడ్డి. హీరోయన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.
యంగ్ హీరో అరవింద్ కృష్ణ రీసెంట్ గా ఓ న్యూ మ్యూవీని స్టార్ట్ చేశాడు. ఏ మాస్టర్ పీస్ టైటిల్ తో సిల్వర్ స్క్రీన్‌పై ఇదివరకెన్నడూ చూడని కొత్త తెలుగు సూపర్ హిరోగా అరవింద్ కృష్ణ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అష్షు రెడ్డి సెలక్ట్ యినట్టు తెలుస్తోంది.
ఈ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి ..ఈ 'సినిమాలో లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోందని తెలిసి ఆమె ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన సస్పెన్స్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేసిన ఏ మాస్టర్ పీస్ టైటిల్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఏ మాస్టర్ పీస్ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆద్య అనే పాత్రలో అషూరెడ్డి కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నది. యాక్టింగ్‌తో పాటు గ్లామర్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో అషూరెడ్డి కనిపించబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహనరంగ సినిమాతో ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ మీద మెరిసింది అష్షు రెడ్డి.
బిగ్‌బాస్ సీజన్ సీజన్ 3 తో పాటు ఓటీటీ బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది బ్యూటీ.. కాని రెండింటిలో ఫైనల్స్ వరకూ వెళ్లలేక పోయింది. ఇక రామ్‌గోపాల్‌వర్మతో చేసిన ఇంటర్వ్యూల ద్వారా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులర్ అయ్యింది అషూరెడ్డి. రీసెంట్ గా ఆమె పాదాలు ముద్దాడుతూ.. వర్మ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆటాపిక్ హీట్ ఇంకా తగ్గలేదు కూడా.
ఇన్ స్టా రీల్స్, ఇంటర్వ్యూలు, పలు షోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అషురెడ్డి... చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్ గా కనిపిస్తుండటంతో ... ఆమె ఫాలోవర్లు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.