- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ కి చాలా బోల్డ్ గా బర్త్ డే విషెస్ చెప్పిన నటి.. అందరూ ఒకలా ఆమె మాత్రం మరోలా, వైరల్
పవన్ కళ్యాణ్ కి చాలా బోల్డ్ గా బర్త్ డే విషెస్ చెప్పిన నటి.. అందరూ ఒకలా ఆమె మాత్రం మరోలా, వైరల్
పవన్ కళ్యాణ్ కి ఓ నటి చాలా బోల్డ్ గా బర్త్ డే విషెస్ తెలిపింది. పవన్ పై తన అభిమానాన్ని చాటుకునే క్రమంలో ఆమె ఏం చేసిందో ఈ కథనంలో చూడండి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. సెప్టెంబర్ 2 మంగళవారం రోజు పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. దీనితో సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, చంద్రబాబు, చిరంజీవి లాంటి వారంతా పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ కి సెలబ్రిటీలంతా చెప్పిన బర్త్ డే విషెస్ ఒక ఎత్తు అయితే నటి అషు రెడ్డి చెప్పిన విషెస్ మరో ఎత్తు. చాలా బోల్డ్ గా అషు రెడ్డి పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ తెలిపింది. ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అషు రెడ్డి టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు పొందింది. ఆ తర్వాత బిగ్ బాస్ షో లో పాల్గొని క్రేజీ సెలబ్రిటీగా మారిపోయింది.
సోషల్ మీడియాలో అషు రెడ్డి తరచుగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకర్షిస్తూ ఉంటుంది. మంగళవారం రోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై అషు రెడ్డి తన అభిమానాన్ని విభిన్నంగా చాటుకుంది. తన బాడీపై ఉన్న పవన్ కళ్యాణ్ టాటూ ని ప్రదర్శిస్తూ అషు రెడ్డి పోస్ట్ చేసింది. ఆమె షేర్ చేసిన పోస్ట్ బోల్డ్ గా ఉంటూ నెటిజన్లని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గతంలోనే అషు రెడ్డి పవన్ కళ్యాణ్ పేరుని తన బాడీపై టాటూగా వేయించుకుంది. నీవు పుట్టిన గడ్డపైనే నేను కూడా జన్మించడం గర్వంగా ఫీల్ అవుతున్నా. ప్రజలకు దేవుడైన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని అషు రెడ్డి పోస్ట్ చేసింది.సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వాటిని టాటూలుగా వేయించుకుంటున్నారు.
తమ భర్తల పేర్లు లేదా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకాలని టాటూలుగా వేయించుకుంటుంటారు. కానీ అందుకు భిన్నంగా అషు రెడ్డి పవన్ కళ్యాణ్ పేరుని టాటూ గా వేయించుకోవడంతో ఆమె నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.అషు రెడ్డి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షేర్ చేస్తే తరచుగా వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆశించిన స్థాయిలో ఆమెకి సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. బుల్లితెర షోలలో అప్పుడప్పుడు కనిపిస్తోంది.