మెగాస్టార్ తో నటించేందుకు ఆషిక మరింత గ్లామర్ పెంచుతోందా.. నా సామిరంగ బ్యూటీ జిమ్ వర్కౌట్స్ చూశారా
తాజాగా ఆషిక జిమ్ వర్కౌట్స్ వీడియో నెటిజన్లని తెగ ఆకర్షిస్తోంది. జిమ్ లో పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఒంపుసొంపులతో ఉక్కిరి బిక్కిరి చేసే ఫోజులు ఇస్తోంది.
కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భోగి పండుగ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సంక్రాంతికి ఎన్ని సినిమాలైనా ఆడేస్తాయి అనే నమ్మకంతో నాగార్జున సరిగ్గా సంక్రాంతికి తన చిత్రాన్ని వదిలాడు.
సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నప్పటికీ నాగార్జున వెనక్కి తగ్గలేదు. తన సినిమాలో పర్ఫెక్ట్ గా పండగ మెటీరియల్ ఉందని నా సామిరంగ టీం మొత్తం నమ్మింది. చివరికి నాగార్జున నమ్మకమే గెలిచింది.
తొలి షో నుంచే నా సామిరంగ చిత్రానికి నెగిటివ్ టాక్ మొదలయింది. అయినప్పటికీ వారం రోజుల లోపే నా సామిరంగ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ట్రేడ్ కి ఊహించని షాక్ ఇచ్చింది.
ఇంత నెగిటివ్ టాక్ లో కూడా బ్రేక్ ఈవెన్ నా సామి రంగ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. నా సామిరంగ చిత్రం సంక్రాంతి హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ ఆషిక రంగనాథ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆషిక రంగనాథ్ పాత్ర పెద్ద ప్లస్ అయింది. నా సామిరంగ చిత్ర విజయంలో ఆమె పాత్ర ఎంతైనా ఉంది.
పల్లెటూరి అమ్మాయిలా ఒదిగిపోయి ఎంతో అందంగా నటించింది. లంగా ఓణిలో, చీరకట్టులో అదరహో అనిపించింది. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ యంగ్ బ్యూటీ సొగసుకి యువత ఫిదా అవుతున్నారు.
ఆషిక రంగనాథ్ హిట్ దక్కిన జోష్ లో ఉందో ఏమో కానీ ఆమె యాటిట్యూడ్ పూర్తిగా మారిపోతోంది. మునుపటి కంటే ఘాటుగా సొగసు వెదజల్లుతూ రెచ్చిపోతోంది. నా సామిరంగ హిట్ ఇచ్చిన జోష్ ఆషిక కెరీర్ కి బాగా ప్లస్ అవుతున్నట్లు ఉంది.
ఆషిక మెగాస్టార్ చిరంజీవితో కలసి రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఆషిక అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇది ఇంకా కంఫర్మ్ కాలేదు. ఏది ఏమైనా ఆషిక ప్రస్తుతం జిమ్ లో తన సొగసు కి మరింత పదును పెడుతోంది. తాజాగా ఆషిక జిమ్ వర్కౌట్స్ వీడియో నెటిజన్లని తెగ ఆకర్షిస్తోంది.
జిమ్ లో పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఒంపుసొంపులతో ఉక్కిరి బిక్కిరి చేసే ఫోజులు ఇస్తోంది. ఆషిక రంగనాథ్ మరింత సన్నగా మారుతూ యువతని ఆకర్షిస్తోంది. జిమ్ ట్రైనర్ సమక్షంలో ఆషిక కసరత్తులు చేస్తోంది.