- Home
- Entertainment
- చైతన్యకు పేమెంట్ ఆపేశారు, ఆ ఆరు లక్షలే ప్రాణం తీశాయి... పల్సర్ బైక్ ఝాన్సీ బయటపెట్టిన నిజాలు!
చైతన్యకు పేమెంట్ ఆపేశారు, ఆ ఆరు లక్షలే ప్రాణం తీశాయి... పల్సర్ బైక్ ఝాన్సీ బయటపెట్టిన నిజాలు!
మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్న క్రమంలో పల్సర్ బైక్ ఝాన్సీ కారణాలు బయటపెట్టాయి. చైతన్య అప్పులు కావడానికి కారణం ఇదే అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

Chaitanya Master
డాన్స్ రియాలిటీ షో ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య బుల్లితెర వర్గాలను కుదుపుకు గురి చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చైతన్య ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, అతడు అప్పులపాలు కావడానికి పేమెంట్స్ ఆపేయడమేనని పల్సర్ బైక్ ఝాన్సీ వెల్లడించారు. కొన్నాళ్లుగా ఆయనతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తున్న ఝాన్సీ కీలక అంశాలు తెరపైకి తెచ్చారు.
చైతన్య డిసెంబర్ 31 నైట్ ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ విషయంలో కొందరు ఆర్టిస్ట్స్ చైతన్యకు హ్యాండ్ ఇచ్చారు. వస్తామని చెప్పి తర్వాత రాలేదు. దాంతో ఈవెంట్ ఆర్గనైజర్స్ పేమెంట్ ఆపేశారు. అది దాదాపు రూ. 6 లక్షల రూపాయలు. ఆ డబ్బు కోసం చైతన్య అప్పులు చేశారు. ఆర్టిస్ట్స్ కి ఇవ్వడానికి ఆయన అప్పులు చేశారు. చైతన్య అప్పులపాలు కావటానికి ఇది ప్రధాన కారణమని ఝాన్సీ వెల్లడించారు.
చైతన్య మంచి వ్యక్తి. ఎప్పుడూ పక్కవాళ్ళ గురించి ఆలోచిస్తారు. సహాయం చేస్తారు. మేము ఒంగోలులో ఈవెంట్ చేస్తుండగా చైతన్య మరణవార్త తెలిసింది. ఆయన కొందరు ఆర్టిస్ట్స్ కి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు ఫోన్స్ చేస్తున్నారు. ఆయనకు ఇబ్బందిగా ఉంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోయేది. డబ్బులు ఇవ్వలేనంటే ఒప్పుకునేవారు. ప్రాణాలు తీసుకుని తప్పు చేశారు. ఆయన నిర్ణయం వలన అమ్మ, నాన్న, చెల్లి బాధపడుతున్నారు, అని ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది.
Chaitanya Master
ఐదు రోజుల క్రితమే చైతన్యతో ఒక ఈవెంట్ చేశాను. ఈవెంట్ ఆర్గనైజర్స్ నా విన్నపం ఏమిటంటే... ఒంట్లో బాగున్నా లేకున్నా మేము షో చేస్తాము. మా పెర్ఫార్మన్స్ నచ్చకపోతే మరోసారి పిలవకండి. అంతే కానీ పేమెంట్స్ ఆపవద్దు. అది చాలా మంది ఆర్టిస్ట్స్ జీవితాలను ప్రభావితం చేస్తుందని ఝాన్సీ అన్నారు.
ఏప్రిల్ 30 ఆదివారం నెల్లూరులోని ఓ హోటల్ లో చైతన్య మాస్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోవడానికి ముందు చైతన్య ఒక సెల్ఫీ వీడియో చేశారు. ఆ వీడియోలో ఆత్మహత్యకు కారణాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు చెప్పారు. ఢీ షో తనకు పేరు తెచ్చిపెట్టింది కానీ ఆర్థికంగా నిలబెట్టలేకపోయిందన్నారు. జబర్దస్త్ షోకి ఇస్తున్న రెమ్యూనరేషన్స్ కూడా ఢీలో ఇవ్వడం లేదన్నారు. అలా అని మల్లెమాల సంస్థపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు.
అప్పులు చేస్తే తీర్చే సత్తా ఉండాలి. నాకు ఉంది కానీ... ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను అన్నారు. ఈ జీవితం చాలు. పేరెంట్స్ క్షమించాలని ఆ వీడియోలో చైతన్య కోరాడు. తన సన్నిహితులను చివరిసారిగా తలచుకున్నాడు. ఇక చైతన్య మరణవార్త బుల్లితెర వర్గాలను భారీ షాక్ కి గురి చేసింది. చైతన్యతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. చైతన్య ఇలా చేసి ఉండాల్సింది కాదంటున్నారు.