- Home
- Entertainment
- Ariyana Glory : గ్లామర్ షోతో చంపేస్తున్న ‘అరియానా గ్లోరీ’.. అందం దాగి ఉంటుందంటున్న ‘ఆర్టీవీ గర్ల్’
Ariyana Glory : గ్లామర్ షోతో చంపేస్తున్న ‘అరియానా గ్లోరీ’.. అందం దాగి ఉంటుందంటున్న ‘ఆర్టీవీ గర్ల్’
యాంకర్ గా తన కేరీర్ ను స్టార్ చేసిన అరియానా గ్లోరీ, తన గ్లామర్ షోతో క్రేజ్ పెంచుకుంటోంది. ‘ఆర్జీవీ’బోల్డ్ ఇంటర్వూ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.

హైదరాబాద్ అమ్మాయి అరియానా గ్లోరీ పాతికేళ్లకు తన యాంకరింగ్ స్కిల్స్ తో అందరినీ ఆకట్టుకుంది. తనదైన శైలిలో, గ్లామర్ ఫీల్డ్ కు కావాల్సిన ఎలమెంట్స్ ను ఫాలోఅవుతూ ఇంటర్వ్యూ చేస్తూ వచ్చింది.
హైదరాబాద్ పరిధిలోని ‘స్టూడియో వన్’టీవీ షోలో తొలుత యాంకర్ గా పనిచేసింది అర్యానా. ఆ తర్వాత ‘సన్ టీవీ’ నెటవర్స్ లో పనిచేసింది. జెమిని కామెడీ, ఈటీవీ అభిరుచి, మనస్టార్స్, ఐడ్రీమ్ వంటి చానళ్లలో పనిచేసి తన కేరీర్ ను ముందుకు నడిపిచింది.
2017లో ఈటీవీ అభిరుచి కుక్కింగ్ షోకు యాంకర్ గా వ్యవహరించింది అర్యానా. ఆ తర్వాత జెమని కామెడీలో ‘కిర్రాక్ కామెడీ’ షోలోనూ పని చేసి తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత య్యూటూబ్ లోని పలు చానళ్లలో పనిచేస్తూ సినీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఉండేంది. ఈ క్రమంలో తన కేరీర్ ముందుకు వెళ్లేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అరియానా సద్వినియోగం చేసుకుంటోంది.
అయితే అప్పటి వరకు అరియానాకు పెద్ద ఆడియెన్స్ లో గుర్తింపు లేదు. కానీ డేర్ అండ్ డ్యాషింగ్ సెన్సేషనల్ డైరెక్టరర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వూతో ఈ బ్యూటీ లైఫ్ మారిపోయింది.
అప్పటికే స్త్రీ జాతిని ప్రేమించే ఆర్జీవీ, ఆ ఇంటర్వ్యూలో అరియానా గ్లోరీ ఆహార్యానికి పలు కామెంట్లు వేశాడు. తన అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తాడు. ఆర్జీవీ కామెంట్ తో అరియానా గ్లోరీ లైఫ్ మారిపోయింది.
అప్పటి నుంచి అరియానాను ‘ఆర్జీవీ గర్ల్’ అని పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాత ‘బిగ్ బాస్ 4’లో అవకాశం కూడా అందుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవీతో బోల్డ్ ఇంటర్వూ చేసి అందరి మతిపోగొట్టింది.
తన క్రేజ్ ను పెంచుకునేందుకు అరియానా ఇటీవల గ్లామర్ ఫొటోషూట్ లతో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. తాజాగా అరియానా గ్లోరీ పోస్ట్ చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.