నువ్వు `గే` నా?.. నవదీప్ రహస్యాలు బయటపెట్టిన రీతూ చౌదరీ.. పూజా హెగ్డేతో ఆ పని చేస్తాడట..
నటుడు నవదీప్ అనేక వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఇప్పటికీ ఆయనపై రకరకాల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా `గే` గురించి ప్రస్తావించింది రీతూ చౌదరి.
నవదీప్ నటుడిగా నిర్మాతగా రాణిస్తున్నాడు. చాలా సినిమాలను సెట్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. తెరవెనుక కథ నడిపిస్తుంటాడు. యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. నటుడిగానూ బిజీగా ఉన్నాడు. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. రెండింటిలోనూ బిజీగా ఉంటున్నాడు.
నవదీప్ అనేక వివాదాల్లోనూ ఇరుక్కున్నాడు. ముఖ్యంగా డ్రగ్స్ ఆరోపణలు బాగా వినిపించాయి. ఇటీవల కూడా ఆయన పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆ మధ్య ఆయన వ్యక్తిగత విషయం కూడా బయటకు వచ్చింది. `గే` అంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఓ షోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది యాంకర్ రీతూ చౌదరి. అనేక రహస్యాలను బయటపెట్టింది.
రీతూ చౌదరి హోస్ట్ గా `దావత్` అనే టాక్ రన్ అవుతుంది. చాలా రోజులుగా ఇది వస్తుంది. తాజాగా దీనికి నవదీప్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా నవదీప్‌ని ప్రాసలతో పొగిడేసింది. ఆ తర్వాత నేను నీకు పెద్ద పొరంబోకు ఫ్యాన్ ని అంటూ రెచ్చిపోయింది రీతూ. ఆయన నటించిన `పొరంబోకు` సినిమాను తాను థియేటర్లో చూసిందట. ఆ సినిమా గురించి ఇప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుందని అడిగింది రీతూ. దీనికి ఆ సినిమా గురించి ఇప్పుడు డిస్కషనే అనవసరం అనిపిస్తుందని తనదైన స్టయిల్‌లో చెప్పి రచ్చ చేశాడు నవదీప్.
`మీరు రవితేజకి గాసిప్పులు చెప్పేవారట` అని రీతూ అడగ్గా, ఆయనే నాకు చెప్పేవారని, ఒరేయ్ అబ్బాయి ఏంట్రా రా కూర్చో అని సరదాగా కూర్చునేవాళ్లమన్నాడు. ఆ గాసిప్పులు చెప్పమని ఆమె అడగ్గా `ఏంటీది దావత్ లా లేదు. రీతూ తో కుతూహలం లా ఉందన్నారు. ఈ సందర్భంగా అభిమానులు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఎప్పుడు చూసిన ఇదే పనేట్రా, ఎప్పుడైనా బోర్ కొట్టదా అని మీకు అనిపించిన పనేంటి అని అడిగారు.
దానికి నవదీప్ రియాక్ట్ అవుతూ, అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుందన్నారు. అయితే ఏం చేసేవాళ్లు అని మాత్రం అడక్కండి అన్నాడు. ఈ సందర్భంగా రీతూ మరో సంచలన ప్రశ్న అడిగింది. `మీరు గే అని ఒక టైమ్‌లో రూమర్ స్ప్రెడ్ అయ్యింది. అంటే అన్నాడు గానీ ఆ ఊహ ఎంత బాగుందో` అని అడిగింది రీతూ. దీనికి నవదీప్ రియాక్షన్ నవ్వుతూ ఇచ్చాడు. ఏం చెప్పాడనేది సస్పెన్స్.
నా సావు నేను చస్తా.. మీకెందుకు అని ఎప్పుడు అనిపించిందని అడగ్గా, నాకు న్యూస్ చూసినప్పుడల్లా అనిపిస్తుందని చెప్పాడు. ఆటగాళ్లే అనే మీమ్ ఎప్పుడు కనెక్ట్ అయ్యిందని అడగ్గా, కేవలం మా నాన్న వల్లే అయ్యిందన్నాడు. నవ్వులు విరిసేలా చేశాడు. మా బావ పెద్ద పొరంబోకు అంటోన్న నవదీప్ అనే సెటైర్ వేశాడు. అది ఎవరిపై అనేది ఆసక్తికరంగా మారింది.
ఇలా రీతూ చౌదరి.. నవదీప్ సీక్రెట్స్ అన్నీ అడిగే ప్రయత్నం చేసింది. అనంతరం సెలబ్రిటీలతో కొన్ని థింగ్స్ ని కనెక్ట్ చేయాల్సి ఉంది. ఇందులో పూజా హెగ్డేకి టైటానిక్ షిప్‌ని కనెక్ట్ చేశాడు నవదీప్. దీనికి రీతూ స్పందిస్తూ, పూజా హెగ్డేతో టైటానికి షిప్‌లో మునగాలనుకుంటున్న నవదీప్ అంటూ రూమర్ క్రియేట్ చేసింది.
రవితేజని అదే తగ్గించుకుంటే బాగుంటుందని మరో ఫోటోకి కనెక్ట్ చేశాడు నవదీప్. మొత్తంగా రీతూ చౌదరితో దావత్ టాక్ షో ప్రోమో ఆద్యంతం నవ్వులు విరిసేలా ఉంది. పలు రహస్యాలను బయటపెట్టేలా సాగింది. మరి దీనికి నవదీప్ ఆన్సర్ ఎలా ఉంటుందో చూడాలి.