MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందుకే సినిమాలు తగ్గించా.. : అనుష్క శెట్టి

అందుకే సినిమాలు తగ్గించా.. : అనుష్క శెట్టి

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటి’ సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క తన పాత్ర, సినిమా విశేషాలు, ప్యూచర్ ప్లాన్స్ పంచుకున్నారు.

2 Min read
Author : Rajesh K
Published : Sep 04 2025, 08:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఘాటి పై భారీ అంచనాలు
Image Credit : Instagram

ఘాటి పై భారీ అంచనాలు

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటి’ సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఈ సందర్భంగా అనుష్క శెట్టి ఇంటర్వ్యూలో తన పాత్ర, సినిమా విశేషాలను పంచుకున్నారు.

25
శీలావతి పాత్రపై అనుష్క స్పందన
Image Credit : instagram / Anushka Shetty

శీలావతి పాత్రపై అనుష్క స్పందన

శీలావతి పాత్ర గురించి అనుష్క మాట్లాడుతూ.. ‘ఘాటి సినిమా లో నేను చేసిన శీలావతి పాత్ర నా కెరీర్‌లో ప్రత్యేకం. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్ర ఇది. చాలా బ్యూటిఫుల్ షేడ్స్ కలిగిన క్యారెక్టర్. కంఫర్ట్ జోన్ దాటి చేసిన సినిమా ఇది. నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్ ఇదే’అని తెలిపారు.

Related Articles

Related image1
పుష్పరాజ్ స్మగ్లింగ్‌ వరల్డ్‌లో ఘాటి షీలావతి కలిస్తే..? అనుష్క రియాక్షన్ వైరల్..
Related image2
అనుష్కని మరో సరోజలా చూపించాలనుకున్నా క్రిష్‌.. కానీ `ఘాటి` ఎలా వచ్చింది? తెర వెనుక కథ
35
సరోజ్ పాత్రకు కొనసాగింపా ?
Image Credit : Asianet News

సరోజ్ పాత్రకు కొనసాగింపా ?

డైరెక్టర్ క్రిష్ తో పనిచేయడం గురించి మాట్లాడుతూ.. ‘ వేదం తర్వాత క్రిష్‌తో మళ్లీ కలిసి పనిచేయడం నాకు ఆనందంగా ఉంది. సరోజ్ పాత్రకు కొనసాగింపుగా చేయాలని అనుకున్నాం. ఆ సమయంలో ‘ఘాటి’ కథ వచ్చింది. క్రిష్ ఎప్పుడూ నన్ను కొత్త కోణంలో చూపించే పాత్రలనే ఇస్తారు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది” అని పేర్కొన్నారు. అలాగే.. క్రిష్ టేకింగ్ గురించి మాట్లాడుతూ.. ‘క్రిష్ ఎప్పుడూ సోషల్‌గా రెలెవెంట్ స్టోరీలనే ఎంచుకుంటారు. ఈ సినిమాలో గంజాయి ఎలిమెంట్ ఉన్నా, మేము దీన్ని కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీశాం. కానీ ఇందులో పాజిటివ్ మెసేజ్ కూడా ఉంటుంది. అది ఆడియెన్స్‌ని టచ్ చేస్తుంది” అని అనుష్క చెప్పారు.

45
అది మెమరబుల్ మూమెంట్
Image Credit : vedam production

అది మెమరబుల్ మూమెంట్

అనుష్క ఘాటి షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ.. “కొత్త లొకేషన్లలో షూటింగ్ చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఫిజికల్‌గా హార్డ్ వర్క్ ఎక్కువైందే కానీ, అది మెమరబుల్ మూమెంట్. క్రిష్ గారు షూటింగ్ చాలా చక్కగా ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం మూడు పాటలు రాశారు. అందులో ‘కుందేటి చుక్క’ పదప్రయోగం నాకు బాగా నచ్చింది. చిన్నచిన్న మాటలతో ఆయన కథలో గొప్ప డెప్త్ తీసుకొస్తారు. కెమెరామాన్ మనోజ్ అద్భుతంగా విజువల్స్ క్యాప్చర్ చేశారు. సంగీత దర్శకుడు సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకి కొత్తదనం తీసుకొచ్చింది. మ్యూజిక్ కూడా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ లాంటిదే”అని అనుష్క అభిప్రాయపడ్డారు.

55
20 ఏళ్ల సినీ జర్నీపై రియాక్షన్
Image Credit : instagram/ Anushka Shetty

20 ఏళ్ల సినీ జర్నీపై రియాక్షన్

అనుష్క తను వర్క్ లైన్ గురించి మాట్లాడుతూ.. “నా ఫిలిం కెరీర్‌లో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో నన్ను అండగా నిలబెట్టిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఒక అవుట్ అండ్ అవుట్ నెగటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. బలమైన పాత్ర కుదిరితే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ఒక మలయాళ సినిమా చేస్తున్నాను. అది నా ఫస్ట్ మలయాళ ఫిల్మ్. అలాగే ఒక కొత్త తెలుగు ప్రాజెక్ట్ కూడా సైన్ చేశాను. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది” అని అనుష్క చెప్పారు. అలాగే.. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ.. “నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తాను, పుస్తకాలు చదవడం ఇష్టం. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నాను. గత రెండేళ్లుగా ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడుపుతున్నాను” అని తెలిపారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
అనుష్క శెట్టి
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
2K Kids Heroines: శ్రీలీల నుంచి మమితా బైజు వరకు.. జెంజీ కుర్రాళ్లని ఊపేస్తున్న కొత్త హీరోయిన్లు
Recommended image2
AR Rahman ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌.. అంతా ప్లాన్‌ చేసుకున్నాక హార్ట్ బ్రేక్‌ అయ్యే ట్విస్ట్
Recommended image3
విజయ్, రష్మిక ఇద్దరిలో చదువులో ఎవరు తోపో తెలుసా.? ఇద్దరి విద్యార్హతలు ఇలా..
Related Stories
Recommended image1
పుష్పరాజ్ స్మగ్లింగ్‌ వరల్డ్‌లో ఘాటి షీలావతి కలిస్తే..? అనుష్క రియాక్షన్ వైరల్..
Recommended image2
అనుష్కని మరో సరోజలా చూపించాలనుకున్నా క్రిష్‌.. కానీ `ఘాటి` ఎలా వచ్చింది? తెర వెనుక కథ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved