MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • మాస్క్ వేసుకుని కెమెరా కంటపడకుండా అనుష్క జంప్‌.. పాపం స్వీటీని వెంటాడుతున్న `సైజ్‌జీరో` కష్టాలు..

మాస్క్ వేసుకుని కెమెరా కంటపడకుండా అనుష్క జంప్‌.. పాపం స్వీటీని వెంటాడుతున్న `సైజ్‌జీరో` కష్టాలు..

అనుష్క శెట్టి బహిరంగంగా కనిపించి చాలా ఏళ్లు అవుతుంది. ఆమె మాగ్జిమమ్‌ మీడియాకి దూరంగా ఉంటుంది. తాజాగా ఓ కెమెరాకి చిక్కింది. ఆమె లుక్‌ వైరల్‌ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 07 2024, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 అనుష్క శెట్టి తెలుగు తెర స్వీటీగా రాణిస్తుంది. తెలుగు ఆడియెన్స్ ఆమెని ముద్దుగా `స్వీటీ` అని పిలుచుకుంటారు. అంతటి స్వీటి మనస్తత్వం ఆమెది. నటిగానూ అంతేబాగా చేస్తుంది. `అరుంధతి`, `బాహుబలి`, `భాగమతి` వంటి చిత్రాలతో నిరూపించుకుంది. ఇటీవల `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి`తోనూ సందడి చేసింది. కొత్తగా అనుష్క మరే సినిమాని ఒప్పుకోలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సినిమాలతోనే కాదు, మామూలుగా కూడా అనుష్క బయట కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ హోటల్‌లో మెరిసింది. అయితే తనని ఎవరూ గుర్తు పట్టకుండా ఆమె మాస్క్ ధరించింది. మరోవైపు ఫుడ్ డ్రెస్‌ వేసుకుని పైన డెనిమ్‌ జాకెట్‌ ధరించింది. తనని ఎవరూ గుర్తు పట్టకుండా, అదే సమయంలో తన వెయిట్‌ని కవర్‌ చేసుకునేలా ఆమె దుస్తులు ధరించి కనిపించడం విశేషం. 

37

అంతేకాదు బయటకు వచ్చిన ఆమె కెమెరాలతో తనని బంధిస్తున్నారని తెలిసి వెంటనే ఫాస్ట్ గా వెళ్లిపోయింది. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనుష్క లావుగా కనిపిస్తుంది. కానీ లుక్‌ మాత్రం కనిపించకుండా మ్యానేజ్‌ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ఆ డైరెక్టర్‌ని తిట్టుకుంటున్నారు. 

47

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి.. `సైజ్‌ జీరో` చిత్రాన్ని తెరకెక్కించారు. బరువు పెరగడం, తగ్గడమనే కాన్సెప్ట్ తో, క్యాలరీలు కరిగిస్తూ ఎనర్జీని, పవర్‌ని జనరేట్‌ చేయాలనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో చాలా మంది స్టార్లని భాగం చేశాడు. కానీ సినిమా పెద్ద డిజాస్టర్‌. అసలు దీన్నొక సినిమాగానే కన్సిడర్‌ చేసేందుకు ఆడియెన్స్, క్రిటిక్స్ ఇష్టపడలేదు. దీంతో అనుష్క పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
 

57

నిజానికి `సైజ్‌జీరో` కోసం అనుష్క చాలా కష్టపడింది. బాగా బరువు పెరిగింది. ఉభకాయురాలిగా కనిపించింది. ఆ తర్వాత వెంటనే బరువు తగ్గింది. అయితే ఇదంతా మేకప్‌తో కాకుండా ఆమె రియల్‌గా చేసింది. నిజంగానే ఫుడ్‌ తీసుకుని అధిక బరువు పెరిగింది. ఆ తర్వాత నిజంగానే తగ్గింది. ఈ సందర్బంగానే అనుష్కకి హెల్త్ సమస్యలు ప్రారంభమయ్యాయి. ఆమె బరువు కంట్రోల్‌ కావడం లేదు. అది అనారోగ్యానికి కారణమవుతుంది. బరువు తగ్గలేకపోవడంతో అనుష్క బయటకు రావడం మానేసింది. 
 

67

`మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` సినిమాకి ముందు నుంచే అనుష్క బయట కనిపించడం తగ్గించింది. ఇంకా చెప్పాలంటే `భాగమతి` తర్వాత ఆమె మీడియాకి దూరంగా ఉంటుంది. పూర్తి ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితమయ్యింది. తన సినిమా ప్రమోషన్స్ లోనూ పాల్గొనడం లేదు. కారణం ఆమె ఆరోగ్య సమస్యలే. స్వీటి అధిక బరువుతో బాధపడుతుంది. దాన్ని ఓవర్‌ కమ్‌ చేయలేకపోతుంది. దీంతో సినిమాలు కూడా తగ్గించింది. బయట కనిపించేందుకు కూడా ఆమె ఇష్టపడటం లేదు.

77

కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలో ఓ నటికి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా అత్యంత బాధాకరం. వారికి మాత్రం ఓ నరకం. ఓ చెత్త సినిమా కారణంగా తన కెరీర్‌ డ్యామేజ్‌ అయ్యే పరిస్థితి రావడం బాధాకరం. దీనికి కారణం మాత్రం ఆ దర్శకుడే అని ఆమె అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దాని కారణంగానే ఆమె ఇప్పుడు కెమెరా కంట పడకుండా దాచుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మరి దీన్నుంచి ఆమె ఎప్పుడు బయటపడుతుందో ఏంటో. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved