MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ తో పాటు అనుష్క కూడా ప్రాజెక్టులోకి...ఏం జరుగుతోంది?

ప్రభాస్ తో పాటు అనుష్క కూడా ప్రాజెక్టులోకి...ఏం జరుగుతోంది?

 ప్రభాస్-అనుష్క పెయిర్ ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో జత కట్టింది. మొదటి సారిగా బిల్లా, ఆ తర్వాత మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2.  వీరి జోడి చూసి ముచ్చటపడిపోయారు అభిమానులు.

3 Min read
Author : Surya Prakash
Published : Apr 13 2024, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


 ప్రభాస్, అనుష్క జంటను వెండితెరపై ఇష్టపడనివారు ఉండరు. వాళ్లిద్దరూ పెళ్లిచేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. అయితే అదీ జరగలేదు. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా కాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇవి రూమర్స్ అని ఇద్దరూ ఈ రూమర్‌ను కొట్టిపారేశారు. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని.. తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని మీడియా ముఖంగా చాలాసార్లు చెప్పారు. అయినప్పటికీ ఏదో ఒక రకంగా వీళ్లిద్దరిపై రూమర్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. దాంతో బాహుబలి తర్వాత వీళ్లిద్దరూ కలిసి ఏ ప్రాజెక్టు చేయలేదు. కానీ ఇప్పుడు మరోసారి ఒకే సినిమాలో వాళ్లిద్దరూ కనిపించబోతున్నారు. 

28


 ది బెస్ట్ జోడీ అనిపించుకున్న  ప్రభాస్-అనుష్క పెయిర్ ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో జత కట్టింది. మొదటి సారిగా బిల్లా, ఆ తర్వాత మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2.  వీరి జోడి చూసి ముచ్చటపడిపోయారు అభిమానులు. డార్లింగ్‌కు సరి జోడి అనుష్కనే అని తేల్చేసారు. అయితే ఈ జంట మరోసారి కలవలేదు.   బాహుబలి 2 తర్వాత ఇద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీ బిజీగా ఉన్నారు. 

38


అనుష్క వరసగా భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి.. మిస్టర్ పోలి శెట్టి మూవీలతో అలరించగా.. డార్లింగ్ ప్రభాస్ సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ మూవీలతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా లైనప్ చాలా పెద్దగానే ఉంది. రాజా సాబ్, కల్కి, స్పిరిట్, సలార్-2 కాకుండా హను రాఘవపూడితో మరో సినిమా ఓకే చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనుష్క శెట్టి, ప్రభాస్ ఒకే ప్రాజెక్టు లో చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే జంటగా మాత్రం కాదట. ఆ ప్రాజెక్టు ఏంటంటే..
 

48


మంచు విష్ణు తాజా చిత్రం ‘క‌న్న‌ప్ప‌’లో అనుష్క, ప్రభాస్ ఇద్దరూ కనిపించనున్నారు. ఈ  సినిమాని భారీ హంగుల‌తో, రూ.100 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నారు మొదట్లో మంచు విష్ణు సినిమా అనగానే చాలామంది లైట్ తీసుకున్నారు.. కానీ ప్రాజెక్టులోకి వస్తున్న లైనప్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఊహించిన దానికంటే మిన్న‌గా తీసేందుకు విష్ణు చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు, ఖ‌ర్చు పెడుతున్నాడని అర్దమవుతోంది. ఇప్ప‌టికే  మోహ‌న్ లాల్‌, న‌య‌న‌తార‌, కృతిస‌న‌న్‌, శివ‌రాజ్ కుమార్‌.. ఇలా భారీతారాగ‌ణాన్ని ‘క‌న్న‌ప్ప‌’ కోసం రంగంలోకి దించాడు. 

58
Anushka Shetty and Prabhas

Anushka Shetty and Prabhas

రీసెంట్ గా అక్ష‌య్ కుమార్ సైతం ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అనుష్క కూడా… ఓ కీ క్యారక్టర్ చేయడానికి ఓకే చెప్పిందని స‌మాచారం. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  అక్ష‌య్ శివుడిగా, అనుష్క పార్వ‌తిగా క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. పార్వ‌తి పాత్ర‌కు ముందు కంగ‌నాను అనుకొన్నారు. లాస్ట్ మినిట్ లో అనుష్క తో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. 

68
Prabhas Anushka Shetty

Prabhas Anushka Shetty


పార్వతీదేవి పాత్ర కోసం బాహుబలి దేవసేన రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ఒకే చెప్పగా ఇప్పుడు అనుష్క కూడా స్టయితే బాహుబలి కాంబోలో సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉంటుంది. అనుష్క శెట్టి క్యారెక్టర్ నచ్చితే స్పెషల్ పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయదు. ఇక కన్నప్ప లాంటి సినిమాలో ఇంతమంది తారకణం ఉన్నప్పుడు ఆమె అడిగితే నో చెప్పకుండా ఉండలేదు. 

78
Anushka Shetty

Anushka Shetty


 రీసెంట్ గా న్యూజీలాండ్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశారు. శివ రాజ్ కుమార్‌, బ్ర‌హ్మానందం, మోహ‌న్ లాల్ .. వీళ్లంతా ఇప్ప‌టికే షూటింగ్ లో పాలుపంచుకొన్నారు. ప్ర‌భాస్‌, న‌య‌న‌తార, అనుష్క వీళ్లపై త్వ‌ర‌లోనే స‌న్నివేశాల్ని పూర్తి చేస్తారు.

88
Anushka Shetty

Anushka Shetty


ఇక అనుష్క విషయానికి వస్తే...ప్రభాస్ బ్యానర్ యువీ క్రియేషన్స్‌‌లో మిస్ శెట్టి.. మిస్టర్ పోలి శెట్టితో నటించిన ఆమె మలయాళంలో కథనార్ అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ వర్క్ స్టార్ అయ్యింది. 10 రోజుల పాటు ఒడిశాలో షూటింగ్ జరిగింది. ఈ సినిమా గురించి ఎటువంటి సమాచారం బయటకు రాకూడదని భారీ భద్రత కల్పించారని తెలుస్తోంది. ఈ క్రమంలో మరో వార్త బయటకు వచ్చింది.  అలాగే క్రిష్ మూవీతో పాటు యువీ క్రియేషన్స్ లో మరో కొత్త చిత్రం షురూ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved