- Home
- Entertainment
- విదేశీ వీధుల్లో అనుపమా పరమేశ్వరన్ చక్కర్లు.. స్టయిల్ పోజులతో రచ్చ లేపుతున్న క్యూట్ బ్యూటీ.. వెకేషన్ పిక్స్
విదేశీ వీధుల్లో అనుపమా పరమేశ్వరన్ చక్కర్లు.. స్టయిల్ పోజులతో రచ్చ లేపుతున్న క్యూట్ బ్యూటీ.. వెకేషన్ పిక్స్
క్యూట్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఇప్పుడు జోరుమీదుంది. వరుసగా విజయాలు వరించడంతో ఆమె దూకుడుకి అడ్డే లేదు. ప్రస్తుతం ఈ భామ విదేశాల్లో ఎంజాయ్ చేస్తుండటం విశేషం.

తారలంతా దీపావళి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కానీ అనుపమా పరమేశ్వరన్ మాత్రం విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతుంది. స్టయిల్ కా బాప్‌అనేలా ఆమె ఫారెన్ స్ట్రీట్స్ లో హల్‌చల్ చేస్తుండటం విశేషం. నాన్ స్టాప్ గా అక్కడి ప్రకృతిని, అందమైన లొకేషన్స్ లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది.
ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్ ఐరోపా ఖండంలోని వ్రోక్లోవ్ అనే దేశంలో ఉంది. అక్కడ తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ ఫోటో లాస్ట్ కాదు క్యూట్ అంటూ పేర్కొంది. ఇలాంటివి ఇంకా పంచుకుంటాననే విషయాన్ని వెల్లడించింది అనుపమా.
ఇందులో చాలా హాట్‌గా ఉంది అనుపమా. బ్రౌన్ కలర్ టైట్ టీషర్ట్ ధరించి ఎద ఎత్తులు చూపించింది. పైన షర్ట్ వేసింది కానీ బటన్స్ అన్నీ తీసేసింది. బ్లూ జీన్స్ ధరించి, జేబుల్లో చేతులు పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. నాన్ స్టాప్‌గా అనుపమా ఎంజాయ్ చేస్తుందనే విషయాన్ని ఇవి తెలియజేస్తున్నాయి.
అక్కడి ఫుడ్‌ని, జ్యూస్‌లను ఫోటోలు తీసి షేర్ చేసింది. తన ఫ్రెండ్స్ తో కలిసి అనుపమా ఇలా వ్రోక్లోవ్‌లో ఎంజాయ్ చేస్తుందనే విషయం అర్థమవుతుంది. దీపావళి సెలబ్రేషన్ ఈ బ్యూటీ విదేశాల్లో ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అనుపమా పరమేశ్వరన్ ఇటీవల `కార్తికేయ 2`తో సంచలన విజయాన్ని అందుకుంది. ఈసినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది వంద కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది. ఊహించిన విజయం ఇటు చిత్ర యూనిట్‌ని, అటు చిత్ర వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. టీమ్ మాత్రం షాక్‌లోకి వెళ్లడం విశేషం. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది అనుపమా.
దీంతో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఛాన్స్ లు క్యూ కడుతున్నాయి. రెండేళ్లకి ముందు అనుపమా కెరీర్ అయిపోయిందా? అనే గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు అత్యంత క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `18పేజెస్`తోపాటు `డీజే టిల్లు` సీక్వెల్ `టిల్లు స్వ్కేర్`, `బట్టర్ ఫ్లై`, `సిరెన్`, `హెలెన్`రీమేక్ చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు మరో ప్రాజెక్ట్ ఈ బ్యూటీ చేతిలో ఉంది.
మొదట్నుంచి క్యూట్ అందాలతో కనువిందు చేసుకుంటూ వచ్చిన అనుపమా పరమేశ్వరన్ గ్లామర్ డోస్ పెంచుతుంది. అప్పుడప్పుడు హద్దులు చెరిపేస్తూ హాట్ షో చేస్తుంది. అభిమానులకు, నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది. అదే సమయంలో తాను గ్లామర్ పాత్రలు కూడా చేయగలననే హింట్ ఇస్తుంది. ఇటీవల `రౌడీబాయ్స్`లో లిప్ లాక్ సీన్లలోనూ నటించిన విషయం తెలిసిందే.