టిల్లు లవర్ క్యారెక్టర్ నుంచి బయట పడలేకున్న అనుపమ.. సెల్ఫీలు తీసుకుంటూ అదే జపం
డీజే టిల్లు బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
డీజే టిల్లు బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా అనే సాంగ్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.
డీజే టిల్లులో సిద్దు, నేహా శెట్టి మధ్య రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. టిల్లు స్క్వేర్ లో అంతకి మించేలా అనుపమ, సిద్దు రెచ్చిపోతున్నారు. అసలు అనుపమ నుంచి ఈ రేంజ్ బోల్డ్ ట్రాన్స్ ఫర్మేషన్ అసలు ఊహించం.
టిల్లు స్క్వేర్ నుంచి వస్తున్న ప్రతి పోస్టర్ రొమాంటిక్ గానే ఉంటోంది. పోస్టర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో అని అంతా షాక్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా అనుపమ టిల్లు స్క్వేర్ లో తన పాత్ర నుంచి బయటకి రాలేకుంది. ఇటీవల ఓ మై లిల్లీ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. కంప్లీట్ సాంగ్ మార్చి 18న రిలీజ్ కానుంది. తాజాగా అనుపమ బ్లూ శారీలో సెల్ఫీ ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సెల్ఫీ ఫోజుల్లో కూడ అనుపమ లిల్లీ జపమే చేస్తోంది. టిల్లు లవర్ పాత్ర నుంచి బయట పడలేకుంది. లిల్లిలాగా చివరి సారి అల్లరి చేస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. అనుపమ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉన్నాయట. ఆల్రెడీ అనుపమ రౌడీ బాయ్స్ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది.,మార్చి 29న టిల్లు స్క్వేర్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.