- Home
- Entertainment
- స్టన్నింగ్.. కార్తికేయ2 ప్రెస్ మీట్ లో అనుపమ విజువల్ బ్లాస్ట్.. ఇలా సర్ప్రైజ్ చేసింది ఏంటి..
స్టన్నింగ్.. కార్తికేయ2 ప్రెస్ మీట్ లో అనుపమ విజువల్ బ్లాస్ట్.. ఇలా సర్ప్రైజ్ చేసింది ఏంటి..
నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చిత్రం కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కొనసాగుతోంది.

నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చిత్రం కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కొనసాగుతోంది. దేవుడితో లింక్ పెడుతూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కార్తికేయ విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముందుగా ఈ ఆగష్టు 12న రిలీజ్ కార్తికేయ 2 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఒకరోజు మారింది. 12న కాకుండా ఈ చిత్రాన్ని 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ ప్రెస్ మీట్ కి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా హాజరు కావడం విశేషం. ఎందుకంటే అనుపమ ఇటీవల తాను కార్తికేయ 2 ప్రమోషన్స్ కి హాజరు కాలేకపోతున్నానని ప్రకటించింది. ఇతర చిత్రాల షెడ్యూల్స్ తో బిజీగా ఉండడంతో ప్రమోషన్స్ కి హాజరు కావడం కుదరడం లేదని పేర్కొంది.
కానీ తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అనుపమ కళ్ళు చెదిరే వైడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ అదరగొట్టేసింది. అనుపమ క్యూట్ స్మైల్, గ్లామర్ లుక్స్ నెట్టింట అభిమానులని మెస్మరైజ్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో శ్రీకృష్ణ తత్వం ఎక్కువగా ఉంటుందని నిఖిల్ తెలిపాడు. ఇక ఈ చిత్రం రెండు సార్లు కోవిడ్ వల్ల రిలీజ్ కి నోచుకోలేకపోయింది. లేట్ అయినా లేటెస్ట్ గా రాబోతున్నాం అని నిఖిల్ తెలిపారు.
ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన సపోర్ట్ వస్తోందని నిఖిల్ తెలిపారు. జనాలు థియేటర్ లో చూసే సినిమాలు రావాలి అంటున్నారు. మా చిత్రం థియేటర్స్ కోసమే చూశాం. మా సినిమాకి థియేటర్స్ ఇస్తే చాలు అంటూ నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఈ చిత్ర సెకండ్ ట్రైలర్ ఆగష్టు 6న రిలీజ్ చేస్తాం అని నిఖిల్ తెలిపారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాం అని నిఖిల్ తెలిపారు.