MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నాగార్జున హీరో అవుతాడనుకోలేదు.. ఏఎన్నార్‌ కామెంట్స్ వైరల్‌.. బిజినెస్‌ కోసం ప్లాన్‌.. అందుకే పెళ్లి?

నాగార్జున హీరో అవుతాడనుకోలేదు.. ఏఎన్నార్‌ కామెంట్స్ వైరల్‌.. బిజినెస్‌ కోసం ప్లాన్‌.. అందుకే పెళ్లి?

హీరో నాగార్జున.. టాలీవుడ్‌లో మన్మథుడిగా పాపులర్. 65ఏళ్లలోనూ ఇప్పటికీ నవ మన్మథుడిలా ఉంటూ యంగ్‌ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 02 2023, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నాగార్జునని మొదట హీరో చేయాలని ఏఎన్నార్‌ అనుకోలేదట. ఆయన చేత బిజినెస్‌ పెట్టించాలని ప్లాన్‌ చేశాడట. అందుకోసం ఇంజనీరింగ్‌, ఎంబీఏ చేయించడానికి అక్కినేని నాగేశ్వరరావు ప్లాన్‌ చేశారు. అయితే అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది తనకే ఆశ్చర్యపరిచిందన్నారు ఏఎన్నార్‌. నాగార్జున గురించి ఏఎన్నార్‌ చెప్పిన విషయాలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరి ఇందులో ఏఎన్నార్‌ ఏం చెప్పాడనేది చూస్తే, 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఏఎన్నార్‌.. గతంలో జయప్రద యాంకర్‌గా చేసిన ఓ టాక్‌ షోలో పాల్గొన్నారు. ఇందులో నాగార్జున ప్రస్తావన వచ్చింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, నాగార్జున హీరో అవుతాడని తాను అనుకోలేదని తెలిపారు. దీంతో అమెరికాలోని కొలంబియాతోపాటు మరో యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌, ఎంబీఏ కలిసి ఉన్న ఓ కోర్ట్స్ లో అడ్మిషన్‌ వెయించాడట ఏఎన్నార్‌. బిజినెస్‌ కోర్స్ చేస్తే ఇండస్ట్రీ పెట్టడానికి ఉపయోగపడుతుందని, తాను ఇక్కడ ఓ పరిశ్రమ పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిపారు ఏఎన్నార్‌. స్టడీ అయిపోయాక ఏడాదికి పెళ్లి చేశామాని తెలిపారు ఏఎన్నారు.
 

36

అయితే ఏ బిజినెస్‌ పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఎలాంటి ఇండస్ట్రీ పెడతావు, ఏం చేయాలని ఉందని అడిగితే.. అప్పుడు నాగార్జున అసలు విషయం బయటపెట్టాడట. `నాకు సినిమాల్లో యాక్ట్ చేయాలనుంది` అని చెప్పాడట.  సినిమాల్లో చేయాలంటే నాటకాల అనుభవం లేదు, అది(యాక్టింగ్‌ కోర్స) లేదు, ఇది లేదు ఎలా అనుకున్నారట. కచ్చితంగా తాను నటించాలనుకుంటున్నట్టు చెప్పడంతో డైలాగ్‌ డెలివరీ, అలాగే కరాటే నేర్పించారట. ఆరేడు మాసాలు బాంబేలో ఓ లేడీ వద్ద యాక్టింగ్‌కి సంబంధించిన క్రాష్‌ కోర్స్ నేర్పించాడట. ఆ తర్వాత సినిమాల్లోకి తీసుకొచ్చినట్టు చెప్పాడు ఏఎన్నార్. 
 

46

నాగార్జున 1986లో `విక్రమ్‌` చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. మధుసూధన్‌రావు దర్శకత్వం వహించిన అన్నపూర్ణ స్టూడియోపై అక్కినేని వెంకట్‌ నిర్మించారు. శోభన ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. నాగార్జున సినిమాల్లోకి రావడం వెనుక, హీరో కావడం వెనుక ఇంతటి స్టోరీ జరిగిందని ఏఎన్నార్‌ మాటలని బట్టి చూస్తే తెలుస్తుంది. 
 

56

నాగ్‌ని హీరో చేసే ఉద్దేశ్యం నాగేశ్వరరావుకి లేకపోవడం వల్లే ముందుగానే పెళ్లి చేసినట్టు తెలుస్తుంది. నాగ్‌.. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని 1984లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే 86లో నాగచైతన్య జన్మించారు. ఆ సమయంలోనే నాగ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే నాగార్జున సినిమాల్లోకి వెళ్లడం లక్ష్మికి ఇష్టం లేదని, అందుకే ఈ ఇద్దరి విడిపోయినట్టు భోగట్టా. ఆ తర్వాత 1990లో ఈ ఇద్దరి విడాకులు తీసుకున్నారు. 
 

66

ఆ తర్వాత నాగార్జున.. హీరోయిన్‌ అమల ప్రేమలో పడ్డారు. ఇద్దరు కలిసి సినిమాలు చేశారు. ఈ క్రమంలో పరిచయం, ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. అయితే అమలని పెళ్లి చేసుకోవడం ఏఎన్నార్‌కి కూడా ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు అంతా హ్యాపీ. ఆ తర్వాత నాగ్‌-అమలకి అఖిల్‌ జన్మించారు. ఇప్పుడు నాగచైతన్య, అఖిల్‌ హీరోలుగా రాణిస్తున్నారు. నాగార్జున `నా సామి రంగ` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే `బిగ్‌ బాస్‌ తెలుగు 7`కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved