- Home
- Entertainment
- కోలీవుడ్ లో కీర్తి సురేష్ కు మరో ఛాన్స్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్, స్టార్ హీరో ప్రాజెక్ట్ లో ‘కళావతి’.!
కోలీవుడ్ లో కీర్తి సురేష్ కు మరో ఛాన్స్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్, స్టార్ హీరో ప్రాజెక్ట్ లో ‘కళావతి’.!
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్, స్టార్ హీరో కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఇందుకు సంబంధించి డిటేయిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ తన లైనప్ ను బిల్డప్ చేస్తోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే తమిళంలో కీర్తి సురేష్ కు సంబంధించి రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. మరో ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
తమిళ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara) దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. ఇందులో తమిళ స్టార్ హీరో శింబు (Simbu) ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో బిగ్ ప్రాజెక్ట్ రాబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఈ చిత్రాన్ని హుంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే సుధా కొంగర లీడ్ డైరెక్టర్ గా దూసుకుపోతోంది. శింబు కూడా తనదైన శైలిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో వీరి కాంబోపై అభిమానులు ఖుషీ అవుతున్నారు.
దీపావళి సందర్భంగా ఈ చిత్ర అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. తర్వలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం కీర్తి నటించిన తమిళ చిత్రాలు ‘సైరన్’, ‘మామన్నన్’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇలోగా మరో ఆఫర్ అందుకుందని టాక్ రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇక కీర్తికి టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఆచీతూచీ అడుగువేస్తోందీ అమ్మడు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్30 చిత్రంలో అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. కానీ అనివార్య కారణాలతో వదులుకుందని టాక్.
చివరిగా తెలుగు ఆడియెన్స్ ను ‘సర్కారు వారి పాట’తో అలరించిన కీర్తి సురేష్.. ప్రస్తుతం ‘దసరా’ (Dasara)తో అలరించబోతోంది. ‘నేను లోకల్’ తర్వాత మరోసారి నాని (Nani) సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర అప్డేట్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.