- Home
- Entertainment
- చిరంజీవితో భోళా శంకర్ నిర్మాత మరో సినిమా..రెమ్యునరేషన్ రూమర్స్ పై సమాధానం, వాట్సాప్ చాట్ వైరల్
చిరంజీవితో భోళా శంకర్ నిర్మాత మరో సినిమా..రెమ్యునరేషన్ రూమర్స్ పై సమాధానం, వాట్సాప్ చాట్ వైరల్
నిర్మాత అనిల్ సుంకరని చిరంజీవి రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది పెడుతున్నారని, సినిమా నిరాశపరిచినప్పటికీ పూర్తి రెమ్యునరేషన్ కోసం డిమాండ్ చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థల్లో పుకార్లు మొదలయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లో విడుదలయింది. ఏమాత్రం బజ్ లేని ఈ చిత్రం చాలా మంది ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద ఉసూరు మనిపించింది. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి ఈ చిత్రాన్ని మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
సినిమా పరాజయం చెందడంతో ట్రోలింగ్ కి తోడు కొన్ని రూమర్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. నిర్మాత అనిల్ సుంకరని చిరంజీవి రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది పెడుతున్నారని, సినిమా నిరాశపరిచినప్పటికీ పూర్తి రెమ్యునరేషన్ కోసం డిమాండ్ చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థల్లో పుకార్లు మొదలయ్యాయి. భోళా శంకర్ రిజల్ట్ కంటే ఎక్కువగా ఈ రూమర్స్ మెగా అభిమానులని ఇబ్బంది పెట్టాయి.
అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని మెగా కాంపౌండ్ నుంచి సమాధానం వస్తోంది. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ లాంటి వారు ఈ రూమర్స్ ని ఖండిస్తున్నారు. అయితే ఈ రూమర్స్ పై స్వయంగా నిర్మాత అనిల్ సుంకర స్పందించినట్లు ఓ వాట్సాప్ చాట్ వైరల్ గా మారింది. ఆ వాట్సాప్ చాట్ అనిల్ సుంకరదే అని అంటున్నారు.
Chiranjeevi
చిరంజీవిపై వస్తున్న రూమర్స్ నిజమేనా అని ఎవరో ప్రశ్నించగా అనిల్ సుంకర చాట్ లో సమాధానం ఇచ్చారు. ఇది అసలు ఏ మాత్రం వాస్తవం కాదు. నేను ప్రస్తుతం యుఎస్ కి వెళుతున్నా అని సమాధానం ఇచ్చారు. ఈ న్యూస్ వైరల్ అవుతోంది కొద్దిగా స్పందించండి అని అడగగా.. పట్టించుకోకండి.. నేను చిరంజీవి గారితో మరో సినిమా చేయబోతున్నాను. ఆయన చాలా నిజాయతీ గల మనిషి. మనం సినిమాతోనే సమాధానం చెబుదాం అని రిప్లై ఇచ్చారు.
ఇప్పుడు ఈ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది నిజంగానే అనిల్ సుంకర వాట్సాప్ చాటేనా అనేది క్లారిటీ లేదు. కానీ మెగా ఫాన్స్ మాత్రం ఇది ఆయన వాట్సాప్ అనే అంటున్నారు.
అనిల్ సుంకరకి ఈ ఏడాది మాత్రం కలసి రాలేదు అనే చెప్పాలి. అఖిల్ హీరోగా తెరకెక్కించిన హై బడ్జెట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ చిత్రంలో భారీ నష్టాలు ఎదురయ్యాయి, భోళా శంకర్ విజయం సాధించి నష్టాలు పూడుస్తుంది అని అనుకున్నారు. కానీ భోళా శంకర్ కూడా తీవ్రంగా నిరాశపరిచింది.