Anchor Varshini: టైట్ జీన్స్ లో బోల్డ్ యాంకర్ వర్షిణి హాట్ ఫోజులు... వైరల్ గా లేటెస్ట్ ఫొటోస్
బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు వర్షిణి సుందరరాజన్. రష్మీ, అనసూయ (Anasuya) , శ్రీముఖి తరువాత ఆ స్థానం వర్షిణిదే. అయితే వాళ్ళ రేంజ్ పాపులారిటీ, క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
టాప్ ప్లేస్ లో ఉన్న యాంకర్స్ కి పోటీగా ఎదగాలని వర్షిణి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీనికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నారు. మిలియన్స్ లో ఉన్న ఫ్యాన్స్ కి వినోదం పంచుతున్నారు.
హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి (Varshini Sounderajan), అక్కడ అవకాశాలు తగ్గడంతో యాంకర్ అవతారం ఎత్తారు. ఢీ షోలో కొన్నాళ్ళు యాంకర్ గా చేయగా, బాగా పాపులర్ అయ్యారు.
మోడల్ గా కెరీర్ ప్రారంభిన వర్షిణి కొన్ని చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. మంచి హైట్ అండ్ గ్లామర్ ఉండి కూడా వర్షిణి ప్రతిభకు తగ్గ అవకాశాలు దక్కించుకోలేకపోయారు.
సుధీర్ రష్మితో రొమాన్స్ చేస్తుంటే... హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేసేది. ఆది, వర్షిణి జంటకు మంచి మార్కులే పడ్డాయి. కారణం ఏమైనా కానీ లేటెస్ట్ సీజన్ నుండి ఆమెను తొలగించారు.
అక్కడ అవకాశం పోయినా స్టార్ మా లో కామెడీ స్టార్స్ షోకి సోలో గా యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకున్నారు వర్షిణి. ఆ షో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంది.
ఇక బిగ్ బాస్ (Bigg boss telugu 5) లేటెస్ట్ సీజన్లో వర్షిణి పాల్గొంటున్నారని అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. తీరా చూస్తే వర్షిణి ఎంట్రీ ఇవ్వలేదు. కనీసం ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది.
అయితే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి కావలసిన మజా పంచుతుంది. హాట్ హాట్ డ్రెస్ లో గ్లామర్ కి షోకి తెరలేపతూ... కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.
తాజాగా వర్షిణి డెనిమ్ జీన్స్ లో చిలిపి ఫోజులిచ్చారు. ఈ పొడుగు సుందరి అందాల విందుకు నెటిజెన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. దీనితో కామెంట్స్ రూపంలో తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. నైస్ బేబీ, బ్యూటిఫుల్ అంటూ... రెచ్చిపోతున్నారు. వర్షిణి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.
తన తోటి యాంకర్స్ రష్మీ, అనసూయ, శ్రీముఖి.. యాంకర్స్ గా, యాక్టర్స్ గా రాణిస్తూ సత్తా చాటుతున్నారు. వర్షిణి సైతం అలా టూ ఇన్ వన్ జాబ్ లో సెటిల్ అవ్వాలని కలలు కంటున్నారు. డిజిటల్ కంటెంట్ లో నటులకు విరివిగా అవకాశాలు దొరుకుతున్న నేపథ్యంలో వర్షిణి ఆశలు నెరవేరే అవకాశం లేకపోలేదు.