యాంకర్ సుమ సంచలన నిర్ణయం, ఇక స్క్రీన్ కు గుడ్ బై చెప్పనున్న స్టార్ హోస్ట్ ...?
యాంకర్ సుమ సంచలన నిర్ణయంతీసుకుందట..? ఇక పై స్క్రీన్ కు గుడ్ బై చెప్పనుందట, తనకు బలం ఉన్నచోటే ఉండాలని నిర్ణయించుకుందట..? ఇంతకీ సుమ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటీ..? ఎందుకు..?
బుల్లి తెర ప్రేక్షకులకు ఆరాధ్య యాంకర్ సుమ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ఎన్నో ఏళ్ళుగా సుమ బుల్లి తెరను ఏలేస్తోంది. యాంకర్ అంటే ప్రతీ ఒక్కరికి గుర్తుకు వచ్చేది చూస్తున్నారు. కేరళ అమ్మాయి అయిన కూడా మన తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యింది. టాలీవుడ్ లో దూసుకుపోతోంది.
ఈమె తెలుగు లో చేసిన సినిమాలు, షో లు ఎంత హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. స్టార్ హీరోల ఈవెంట్స్ అంటే సుమ ఉండాల్సిందే. ఇక సుమ హోస్ట్ చేసిన ఏ షో అయిన కూడా మంచి హిట్ అవుతుంది..ఇక సినిమాలు కూడా అంతే...ఈమె పేరు ప్రపంచ వ్యాప్తంగా పాకింది.
అంతే కాదు సుమ యాంకర్ల కులదైవంగా మారిపోయింది. హోస్ట్ గా లిమకా బుక్ ఆఫ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది సుమ కనకాల. ఆమె మాటల ప్రవాహానికి ఆడియన్స్ మైమరచిపోయేవారు. కొన్ని స్టార్ ఈవెంట్లలో స్టార్ హీరోలతో పాటు.. ఆమె కుడా స్పెషల్ ఏవీలు వేశారంటే.. హోస్ట్ గా సుమ ఇమేజ్, స్టామినా అర్ధం అవుతుంది.
ముందుగా ఇండ్ట్రీకి సుమ నటిగా పరిచయం అయ్యింది. కొన్ని టీవీ సీరియళ్ళతో పాటు.. మరికొన్ని సినిమాలలో కూడా నటించి మెప్పించింది. ఆ తరువాత యాంకర్ గామారి తన సత్తా చాటుకుంటుంది. సుమతో పాటు యాంకరింగ్ స్టార్ట్ చేసిన వారు అంతా ఎప్పుడో రిటైయిర్ అయ్యారు. కాని సుమ మాత్రం 50 ఏళ్లు దగ్గరకు వస్తున్నా.. ఇంకా స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే ఉంది.
అంతే కాదు ఇంత వరకూ ఏ హోస్ట్ అందుకోనంత రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటోంది సుమ. తన ఏజ్ పై ఎంత మంది సెటైర్లు వేస్తున్నా.. వాళ్ళకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ.. అప్ కమింగ్ యాంకర్లకు కూడా గట్టి పోటీ ఇస్తోంది సుమ.
ఇది ఇలా ఉంటే.. హోస్ట్ గా సూపర్ సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న సుమ.. నటిగా కూడా ఇంతే స్టార్ డమ్ అందుకోవాలి అనుకుందో ఏమో.. మళ్ళీ నటన స్టార్ట్ చేసింది. జయమ్మ పంచాయితీ సినిమాతో .. సిల్వర్ స్క్రీన్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్న సుమకు.. నిరాశే ఎదురయ్యింది.
స్టార్ యాంకర్ గా తనకు ఉన్న పలుకుబడి ఉపయోగించి రామ్ చరణ్ దగ్గర నుంచి సెలబ్రిటీ స్టార్స్ అందరితో జయమ్మ పంచాయితీ సినిమాకు ప్రమోషన్ చేయించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి విమర్షకులు ప్రశంసలు సాధించింది. కాని జనాలను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సుమ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
తనకు జనాల్లో ఉన్న ఇమేజ్, తన స్టార్ డమ్ ఈ సినిమాకు ఉపయోగపడుతుంది అనుకున్నారు, సుమ కోసం జనాలు ఖచ్చితంగా సినిమా చూస్తారు అనుకుంది, కాని ఇలా అయ్యే సరికి సుమ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్ కు ఇక గుడ్ బై చెప్పాలని సుమ ఆలోచిస్తున్నారట,
తనకు మొదటి నుంచీ స్టార్ లైఫ్ ఇచ్చిన హోస్ట్ గానే.. కంటీన్యూ అవ్వాలని చూస్తుంది సుమ. తనకు బలం ఉన్న యాంకరింగ్ లోనే.. సాధ్యం అయినంత వరకూ కొనసాగాలి అని నిర్ణయించుకుందట. ఇకపై సినిమాల జోలికి వెళ్లకూడదని నిర్ణయింకుందట సుమ. ఎప్పుడైనా అడపా దడపా.. గెస్ట్ రోల్స్ తప్పించి.. ఇలా పుల్ లెన్త్ సినిమాలు సుమ చేయదంటూ.. ఇండస్ట్రీలో టాక్ గట్టిగా నటుస్తోంది.