Roshan Kanakala: రైడింగ్ లో పోలీసులకు దొరికిపోయిన యాంకర్ సుమ కొడుకు... కారులో సూట్ కేసులు!
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల ఎన్నికల వేళ రైడింగ్ లో దొరికిపోయాడు. అతని కారులో సూట్ కేసులు ఉన్నాయి. ఈ న్యూస్ సంచలనంగా మారింది.
Anchor Suma Son Roshan Kanakala
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల పోలీసుల రైడింగ్ లో దొరకడం కలకలం రేపుతోంది. స్నేహితులతో పాటు కారులో వెళుతున్న రోషన్ ని పోలీసులు ఆపారు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో మద్యం, డబ్బులు భారీగా రవాణా అవుతున్నాయి. ఈ క్రమంలో కార్లు, ఇతర వాహనాలను చెక్ చేస్తున్నారు.
Anchor Suma Son Roshan Kanakala
రోషన్ కనకాల కారును పోలీసులు రైడింగ్ లో భాగంగా ఆపారు. అయితే రోషన్ తో పాటు అతని ఫ్రెండ్స్ తిక్క సమాధానాలు చెప్పారు. తమ ఇన్ఫ్లున్సు ఉపయోగించే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు వదల్లేదు. కారు డిక్కీ ఓపెన్ చేయించారు.
Anchor Suma Son Roshan Kanakala
కారు డిక్కీలో వారికి సూట్ కేసులు కనిపించాయి. అవి ఓపెన్ చేయమంటే తటపటాయించారు. పోలీసులతో డీల్ మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు మాత్రం వినకుండా సూట్ కేసులు ఓపెన్ చేయాలని పట్టుబట్టారు. చేసేది లేక సూట్ కేసులు ఓపెన్ చేసి చూపారు. వాటిలో ఉన్న సరుకు చూసి పోలీసులు షాక్ అయ్యారు.
Anchor Suma Son Roshan Kanakala
సూట్ కేసుల్లో జిలేబీలు, బబుల్ గమ్స్ ఉన్నాయి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇది నిజమైన రైడ్ కాదని. ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ కోసం హీరోలు కొత్త పంథాలు ఎంచుకుంటున్నారు.ఇటీవల అల్లరి నరేష్ ఉగ్రం టైటిల్ తో సీరియస్ మూవీ చేశాడు. దీని ప్రమోషన్ కోసం ఏకంగా యాంకర్ సుమను అరెస్ట్ చేసినట్లు నమ్మించాడు.
Anchor Suma Son Roshan Kanakala
సుమ అరెస్ట్ అయిన వీడియో సంచలనం రేపింది. పలువురు ఆమె నిజంగానే అరెస్ట్ అయ్యారని షాక్ అయ్యారు. ఉత్తుత్తి అరెస్ట్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా సుమ కొడుకు రోషన్ బబుల్ గమ్ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా పోలీస్ రైడింగ్ లో దొరికినట్లు నమ్మించే వీడియో చేశాడు.
Anchor Suma Son Roshan Kanakala
బబుల్ గమ్ మూవీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రవికాంత్ పేరెపు దర్శకుడు. రోషన్ కి జంటగా మానసా చౌదరి నటించింది. విష్ణువర్ధన్ రాణే కీలక రోల్ చేశాడు. బబుల్ గమ్ డిసెంబర్ 29న విడుదల కానుంది.
Nana patekar: అభిమానిని కొట్టిన నానా పటేకర్, విమర్షలు రావడంతో.. ఘటనపై వివరణ