- Home
- Entertainment
- సింగర్స్ తో రాత్రి శ్రీముఖి పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో నాన్‌స్టాప్ చిందులు.. రాములమ్మ రచ్చ నెక్ట్స్ లెవల్
సింగర్స్ తో రాత్రి శ్రీముఖి పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో నాన్‌స్టాప్ చిందులు.. రాములమ్మ రచ్చ నెక్ట్స్ లెవల్
హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. హైలీ ఎనర్జిటిక్‌తో సందడి చేస్తూ టీవీ షోస్‌లను రక్తికట్టించే ఈ భామ ఇప్పుడు ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంది. అన్‌లిమిటెడ్ ఎంజాయ్‌మెంట్‌తో రచ్చ చేస్తుంది.

హాట్ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) సింగర్స్ తో కలిసి ఎంజాయ్ చేసింది. నాన్‌స్టాప్‌గా రెచ్చిపోయింది. శనివారం రాత్రి తెగ ఎంజాయ్ చేసింది. ఏకంగా స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ మరీ రెచ్చిపోయారు. ఆకాశమే హద్దుగా ఎంజాయ్ చేయడం విశేషం. తాజాగాఈ వీడియోలను, ఫోటోలను పంచుకుంది శ్రీముఖి.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తాను ఎంజాయ్ చేసిన వీడియోలను షేర్ చేసింది శ్రీముఖి. ఇందులో `సరిగమప`లోని సింగర్స్ అందరు ఉండటం విశేషం. గీతా మాధురి, సాకేత్ లు ప్రధానంగా ఉన్నారు. వీరంతా అర్థరాత్రి స్విమ్ చేస్తూ రెచ్చిపోయారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓ రీసార్ట్ లో వీరంతా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది.
`సరిగమప` టీమ్ అందరితో కలిసి శ్రీముఖి ఇలా ఎంజాయ్ చేసింది. రాత్రి పార్టీలో సందడి చేసింది. జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమప సింగింగ్ షోకి శ్రీముఖి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. సింగింగ్ టాలెంట్ ఉన్న వారిని వెలికితీసే ఈ షోలో లాస్ సీజన్ ఇటీవలే ముగిసింది. శృతిక విన్నర్‌గా నిలిచారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి వీరంతా పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది.
శ్రీముఖి యాంకర్‌గా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె `సరిగమప`తోపాటు `జాతి రత్నాలు` షోకి హోస్ట్ గా చేస్తుంది. ఈ రెండు విజయవంతంగా దూసుకెళ్తున్నాయి. దీంతోపాటు కొత్తగా మరికొన్ని షోలు చేస్తుంది శ్రీముఖి.
గణేష్ పండుగ సందర్భంగా జీ తెలుగులో స్పెషల్ షోకి ప్లాన్ చేశారు. `మన ఊరి రంగస్థలం` పేరుతో నిర్వహిస్తున్న షో ప్రోమో విడుదలైంది. దీనికి శ్రీముఖి యాంకర్‌గా చేస్తున్నారు. దీంతోపాటు `ఆహా`కోసం మరో షో చేస్తుంది శ్రీముఖి. `డాన్సు ఐకాన్`గా చేస్తున్న షోకి ఆమె జడ్జ్ గా చేస్తుండటం విశేషం. దీనికి ఓంకార్ యాంకర్. ఆయన నిర్వహణలో ఈ షో రన్ కాబోతుంది.
ఓ వైపు టీవీ షోస్‌తోపాటు సినిమాలు కూడా చేస్తుంది. ప్రస్తుతం ఆమె `భోళా శంకర్`లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆ మధ్య `మ్యాస్ట్రో` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. అంతకు ముందు `క్రేజీ అంకుల్స్` చిత్రంలో ఏకంగా హీరోయిన్‌గా నటించి ఫిదా చేసింది. బోల్డ్ రోల్‌లో మెప్పించింది. కానీఆ సినిమాకి పెద్దగా ఆదరణ దక్కలేదు.